వాడిపోయిన పూలను పారేసే బదులు ఇలా ఫేస్ మాస్క్ తయారు చేసుకోండి..5 నిమిషాల్లోనే అదిరిపోయే అందం !

భగవంతుడిని పూజించిన పూలను పారేసే బదులు ముఖానికి మాస్క్ తయారు చేసుకోవచ్చు. ఇవి సహజమైనవి కాబట్టి, ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ కూడా కలిగించవు. మీ చర్మ రకానికి సరిపోయే పూలను ఎంచుకుని ఫేస్ ప్యాక్ తయారు చేసుకోండి. పూలు చర్మ సంరక్షణ లక్షణాలను కలిగి ఉంటాయని ఆయుర్వేదం కూడా చెబుతోంది.

వాడిపోయిన పూలను పారేసే బదులు ఇలా ఫేస్ మాస్క్ తయారు చేసుకోండి..5 నిమిషాల్లోనే అదిరిపోయే అందం !
Flower Based Homemade Face Packs
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 14, 2024 | 10:53 AM

పువ్వులు ప్రకృతి ప్రసాదించిన వరం. ఇవి వాటి గొప్ప సువాసనతో ఇంద్రియాలను రిఫ్రెష్ చేయడమే కాకుండా చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. అవును, పూలతో తయారు చేసిన ఫేస్ మాస్క్‌లు సూపర్ హైడ్రేటింగ్‌గా పనిచేస్తాయి. మీకు మెరుస్తున్న, మచ్చలు లేని చర్మాన్ని అందిస్తాయి. మీ చర్మాన్ని సంరక్షించుకోవడానికి ఇంట్లో లభించే పూలతో ఫేస్ మాస్క్ తయారు చేసుకోవచ్చు. భగవంతుడిని పూజించిన పూలను పారేసే బదులు ముఖానికి మాస్క్ తయారు చేసుకోవచ్చు. ఇవి సహజమైనవి కాబట్టి, ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ కూడా కలిగించవు. మీ చర్మ రకానికి సరిపోయే పూలను ఎంచుకుని ఫేస్ ప్యాక్ తయారు చేసుకోండి. పూలు చర్మ సంరక్షణ లక్షణాలను కలిగి ఉంటాయని ఆయుర్వేదం కూడా చెబుతోంది.

గులాబీ పూలతో ఫేస్‌ మాస్క్: గులాబీ రేకుల్లో సహజ నూనెలు ఉంటాయి. ఇవి చర్మాన్ని తేమగా, మృదువుగా చేస్తాయి. అలాగే రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది. కొన్ని గులాబీ పువ్వులు తీసుకుని రేకులను తెంపుకుని ఎండలో ఆరబెట్టి పొడి చేసి పెట్టుకోవాలి.

తయారీ విధానం: మీకు కావాల్సినప్పుడు రెండు స్పూన్ల పాలు, 1 స్పూన్ గోధుమ పిండి, అర చెంచా గులాబీ రేకుల పొడి వేసి బాగా కలపాలి. తయారుచేసిన పేస్ట్‌ని ముఖం, మెడపై అప్లై చేయండి. 20 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత సాధారణ నీటితో కడిగేయండి. ముఖంలో కొత్త మెరుపును గమనిస్తారు.

ఇవి కూడా చదవండి

బంతి పువ్వు : విటమిన్ సి పుష్కలంగా కలిగి ఉన్న పువ్వు బంతిపువ్వు. ఇది మెరిసే, ప్రకాశవంతమైన చర్మాన్ని అందించడంలో సహాయపడుతుంది . విటమిన్ సి ఒక ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్, ఇది వృద్ధాప్య సంకేతాల నుండి, సూర్యరశ్మితో సహా ఇతర సమస్యల నుండి చర్మాన్ని రక్షిస్తుంది.

తయారీ విధానం: రెండు బంతి పూల రేకులను తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు, మిశ్రమానికి ఒక టీస్పూన్ తేనె, అర టీస్పూన్ నీరు కలపండి. ఈ పేస్ట్‌ను చర్మంపై సమానంగా అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.

మందార పూలతో ఫేస్‌ప్యాక్‌: మందార పూ ఫేస్ ప్యాక్ మీ చర్మంలోని మలినాలను తొలగించి, మెరిసేలా చేయడానికి ఉత్తమమైనది. ఈ ఫ్లవర్ ఫేస్ ప్యాక్ మలినాలను తొలగించి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. ముఖంపై జిడ్డును తగ్గించి, మొటిమలను అదుపులో ఉంచుతుంది.

తయారుచేసే విధానం: మందార పువ్వుల రేకులను చల్లటి నీళ్లలో నానబెట్టి, ఉదయాన్నే గ్రైండ్ చేసి ఆ నీటిని వడగట్టాలి. ఈ నీటిలో 3 టేబుల్ స్పూన్ల ఓట్స్ మరియు కొద్దిగా టీ ట్రీ ఆయిల్ వేసి పేస్ట్ చేయాలి.

మల్లెపూలతో ఫేస్‌ప్యాక్‌: జాస్మిన్ ఆహ్లాదకరమైన వాసనను ఇవ్వడమే కాకుండా చర్మ సంరక్షణకు కూడా మంచిది. మీరు దురద లేదా పొడి చర్మం కలిగి ఉంటే కూడా ఇది ఉపశమనాన్ని అందిస్తుంది. చర్మానికి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. సహజ క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటుంది. వృద్ధాప్య సంకేతాలను దాచిపెడుతుంది.

తయారీ విధానం: మల్లెపూ రేకులను బాగా రుబ్బుకోవాలి. దీనికి ఒక టేబుల్ స్పూన్ పెరుగు, ఒక టీస్పూన్ చక్కెర కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరనివ్వాలి. అప్లై చేసిన 15-20 నిమిషాల తర్వాత శుభ్రంగా వాష్‌ చేసుకోవాలి.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

అంగరంగ వైభవంగా ఆవుదూడకు గ్రాండ్‌గా ఉయ్యాల ఫంక్షన్‌ !!
అంగరంగ వైభవంగా ఆవుదూడకు గ్రాండ్‌గా ఉయ్యాల ఫంక్షన్‌ !!
వాడిపోయిన పూలను పారేసే బదులు ఇలా ఫేస్ మాస్క్ తయారు చేసుకోండి..
వాడిపోయిన పూలను పారేసే బదులు ఇలా ఫేస్ మాస్క్ తయారు చేసుకోండి..
పుట్టుడు దుఃఖంతో రంది పెట్టుకుంటే.. పండులాంటి బిడ్డ పుట్టాడు
పుట్టుడు దుఃఖంతో రంది పెట్టుకుంటే.. పండులాంటి బిడ్డ పుట్టాడు
చేతబడులు.. భయంకర సంఘటనలు.. హడలెత్తించే హారర్ థ్రిల్లర్
చేతబడులు.. భయంకర సంఘటనలు.. హడలెత్తించే హారర్ థ్రిల్లర్
ఎవరు బాసు నువ్వు.. సెంచరీ చేసేందుకు ఏకంగా 10 ఏళ్లు..
ఎవరు బాసు నువ్వు.. సెంచరీ చేసేందుకు ఏకంగా 10 ఏళ్లు..
430 కోట్ల ఆస్తులు.. 50 కోట్ల విలువైన లగ్జరీ కార్లు !!
430 కోట్ల ఆస్తులు.. 50 కోట్ల విలువైన లగ్జరీ కార్లు !!
ఆ MLA కు లడ్డూలు.. ఫ్రూట్స్ తో తులాభారం.. ఆ లడ్డూలు ఏం చేశారంటే
ఆ MLA కు లడ్డూలు.. ఫ్రూట్స్ తో తులాభారం.. ఆ లడ్డూలు ఏం చేశారంటే
IND vs AUS: 21 ఏళ్ల క్రితం గంగూలీ చేసిన తప్పే రిపీట్ చేసిన రోహిత్
IND vs AUS: 21 ఏళ్ల క్రితం గంగూలీ చేసిన తప్పే రిపీట్ చేసిన రోహిత్
గుకేష్‌కు తమిళనాడు సీఎం బంఫర్ ఆఫర్.. రూ. 5 కోట్ల నజరానా
గుకేష్‌కు తమిళనాడు సీఎం బంఫర్ ఆఫర్.. రూ. 5 కోట్ల నజరానా
నీటిలో తేలియాడే యుద్ధ ట్యాంకర్ల ట్రయల్‌ రన్‌‪.. మన తెలంగాణ నుంచే
నీటిలో తేలియాడే యుద్ధ ట్యాంకర్ల ట్రయల్‌ రన్‌‪.. మన తెలంగాణ నుంచే