చేపలను వేయించడానికి ఏ నూనె మంచిదో తెలుసా..? ఈ టిప్స్‌ మీ కోసమే..!

చేపలను వేయించడానికి వాడే నూనెలో ఎక్కువ స్మోక్ పాయింట్ లేకపోతే, అది చేపలను వేయించేటప్పుడు తడిగా, జిడ్డుగా మారుస్తుంది. చేపలు వేగిన తరువాత కూడా పెద్దగా రుచిగా ఉండవు. కారంగా ఉంటుందని చెబుతున్నారు. అందుకే ఫిష్‌ఫ్రై కోసం ఉపయోగించే నూనె విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు.

చేపలను వేయించడానికి ఏ నూనె మంచిదో తెలుసా..? ఈ టిప్స్‌ మీ కోసమే..!
Fish Fry
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 14, 2024 | 11:41 AM

మనలో చాలా మంది చేపల కూర కంటే ఫిష్ ఫ్రైనే ఎక్కువగా ఇష్టపడతారు. అలాంటి చేపల వేయించేటప్పుడు ఇంట్లో వంటకు ఉపయోగించే నూనెను ఉపయోగిస్తాము. అయితే ఫిష్‌ ఫ్రై కోసం ఉపయోగించే నూనె విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలంటున్నారు పోషకాహార నిపుణులు. చేపలను వేయించడానికి వాడే నూనెలో ఎక్కువ స్మోక్ పాయింట్ లేకపోతే, అది చేపలను వేయించేటప్పుడు తడిగా, జిడ్డుగా మారుస్తుంది. చేపలు వేగిన తరువాత కూడా పెద్దగా రుచిగా ఉండవు. కారంగా ఉంటుందని చెబుతున్నారు. అందుకే ఫిష్‌ఫ్రై కోసం ఉపయోగించే నూనె విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు.

అన్ని నూనెలకు స్మోక్ పాయింట్ ఉంటుంది. కానీ, ఏదైనా వేయించడానికి మనకు సరైన స్మోక్ పాయింట్ అవసరం. ఎందుకంటే మనం చేపలు వేయించే వరకు నూనె కాగుతూనే ఉంటుంది. దాని స్మోక్ పాయింట్ సరిగ్గా లేకపోతే, నూనె మాడిపోతుంది. అప్పుడు దాని వాసన మారుతుంది.

వేరుశెనగ నూనెలో చేపలను వేయించడానికి ఎక్కువ స్మోక్‌ పాయింట్ ఉంటుంది. కాబట్టి ఇది వేయించడానికి అనుకూలంగా ఉంటుంది. కానీ అది చేపల రుచిని మార్చగలదు, మీరు వేరుశెనగ రుచిని ఇష్టపడకపోతే, దానిని ఉపయోగించవద్దు.

ఇవి కూడా చదవండి

ఆలివ్ ఆయిల్.. ఈ నూనె తేలికగా ఉంటుంది. ఇందులో చేపలను వేయించడం ఆరోగ్యానికి కూడా మంచిది. అయితే డీప్ ఫ్రై చేయాలంటే ఆలివ్‌ ఆయిల్‌ లేదా నెయ్యి వాడటం మంచిది. ఇది చేపలు మరింత క్రిస్పీగా, మంచి రుచిగా మారుతుంది. డీప్ ఫ్రై చేయడానికి ఇది సరిపోకపోయినా, తవా చేపలను వేయించడానికి అనుకూలంగా ఉంటుంది. ఆలివ్ ఆయిల్ చాలా ఖరీదైనది, కాబట్టి పొదుపుగా ఉపయోగించడం మంచిది.

ఆవాల నూనె. ఇది బెంగాల్, ఒడిశా వంటి ప్రాంతాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. అక్కడి ప్రజలు చేపలను వేయించడానికి ఎక్కువగా ఇదే నూనెను ఉపయోగిస్తారు. ఇది వారికి సాంప్రదాయ పద్ధతి.. పైగా ఫిష్‌ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుంది.

కేరళ, కర్ణాటక వంటి దక్షిణ భారత వంటకాలకు కొబ్బరి నూనెను ఎక్కువగా ఉపయోగిస్తారు. మీరు కూడా కొత్త రుచిలో చేపల ఫ్రై ట్రై చేయాలనుకుంటే..కొబ్బరి నూనె మంచి ఎంపిక. దీంతో చేస్తే చేపలు చాలా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. కానీ, ఈ రుచిని అందరూ ఇష్టపడరు. అలాగే కొబ్బరినూనె చలికాలంలో గడ్డకట్టుకుపోతుంది.

బడ్జెట్ సమస్య అయితే పొద్దుతిరుగుడు లేదా సోయాబీన్ నూనెను ఉపయోగించండి. ఆలివ్ ఆయిల్, కొబ్బరినూనె, కనోలా ఆయిల్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి, ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని ఉపయోగించవచ్చు. అయితే, ఆవాలు, సన్‌ఫ్లవర్ ఆయిల్ డీప్ ఫ్రై చేయడానికి ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)