- Telugu News Photo Gallery So many Health benefits of eating Radish in Winter, Check Here is Details in Telugu
Radish: ముల్లంగే కదా అని తేలిగ్గా తీసుకోండి.. చలి కాలంలో తింటే బోలెడన్ని లాభాలు!
ముల్లంగి అందరికీ అందుబాటులోనే లభిస్తుంది. ముల్లంగిని సలాడ్స్, వంట్లలో కూడా ఉపయోగించి తింటూ ఉంటారు. ముల్లంగి నుంచి వాసన వస్తుందని చాలా మంది దీన్ని తినడానికి సందేహిస్తూ ఉంటారు. కానీ ముల్లంగి తినడం వల్ల ఎన్నో వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు..
Updated on: Dec 14, 2024 | 1:08 PM

ముల్లంగి గురించి పెద్దగా పరిచయాలు అవసరం లేదు. దీని గురించి అందరికీ తెలుసు. ఇది దుంప జాతికి చెందినది. ముల్లంగి నుంచి అదొక రకమైన వాసన వస్తుందని చాలా మంది తినరు. కానీ ముల్లంగి తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ముల్లంగి ఆకుల్లో కూడా ఎన్నో పోషకాలు లభిస్తాయి.

ముల్లంగి ఇతర కాలాల్లో కంటే.. శీతాకాలంలో తింటే ఆరోగ్యానికి మరింత మంచిది. ముల్లంగి తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషణ అందుతుంది. ముల్లగిం తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలన్నీ దూరం చేస్తుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం ఇతర సమస్యలు కూడా కంట్రోల్ అవుతాయి.

ముల్లంగి తరచూ తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీంతో ఇతర వ్యాధులతో పోరాడే శక్తి వస్తుంది. త్వరగా వైరస్, ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అలాగే ప్రాణాంతకమైన క్యాన్సర్‌ను కూడా అదుపులో ఉంచుకోవచ్చు.

అధిక బరువుతో బాధ పడేవారు కూడా ముల్లంగి తింటే.. ఆ సమస్య నుంచి త్వరగా బయట పడొచ్చు. అంతే కాకుండా శరీరంలో పేరుకు పోయిన కొలెస్ట్రాల్ కూడా కరిగించడంలో కూడా ముల్లంగి సహాయ పడుతుంది.

క్యాన్సర్ ఉన్నవారు ముల్లంగి తింటే ఈ వ్యాధిని కంట్రోల్ చేయవచ్చు. ముల్లంగి తింటే.. గుండె సమస్యలు, బీపీ, షుగర్, ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. లివర్‌ను, కిడ్నీలను క్లీన్ చేయడంలో కూడా ముల్లంగి సహాయ పడుతుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)




