AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Blood Purifiers: ఇవి తాగితే రక్తంలో మలినాలు మటాష్ .. న్యాచురల్ బ్లడ్ ప్యూరిఫైయర్స్ ఇవి..

మన శరీరంలో రక్తం ఎంత స్వచ్ఛంగా ఉంటే, మనం అంత ఆరోగ్యంగా ఉంటాం. రక్తంలో మలినాలు పేరుకుపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే, కొన్ని సహజసిద్ధమైన పానీయాలను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా రక్తాన్ని శుద్ధి చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు, ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో సులభంగా తయారు చేసుకోగలిగే ఈ డ్రింక్స్ కేవలం రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

Blood Purifiers: ఇవి తాగితే రక్తంలో మలినాలు మటాష్ .. న్యాచురల్ బ్లడ్ ప్యూరిఫైయర్స్ ఇవి..
Drinks For Natural Detox
Bhavani
|

Updated on: Jul 22, 2025 | 2:01 PM

Share

మన ఆరోగ్యం రక్త స్వచ్ఛతపై ఆధారపడి ఉంటుంది. రక్తంలో మలినాలు పేరుకుపోకుండా, శరీరాన్ని లోపలి నుంచి శుభ్రంగా ఉంచుకోవడానికి కొన్ని సహజ పానీయాలు అద్భుతంగా పనిచేస్తాయి. నిమ్మరసం, బీట్‌రూట్, పసుపు, వేప, అల్లం వంటి పదార్థాలతో ఇంట్లోనే రక్తాన్ని శుద్ధి చేసుకోండి.

రక్త శుద్ధికి తోడ్పడే పానీయాలు:

నిమ్మరసం: గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల శరీరంలోని మలినాలు బయటకు పోతాయి. నిమ్మరసంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తాన్ని శుభ్రం చేయడానికి సహాయపడతాయి.

బీట్‌రూట్ జ్యూస్: బీట్‌రూట్‌లో ‘బెటాసైనిన్’ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది రక్తాన్ని సమర్థవంతంగా శుద్ధి చేస్తుంది. బీట్‌రూట్ జ్యూస్ రక్తహీనతను తగ్గించడంలో కూడా దోహదపడుతుంది.

పసుపు పాలు: పసుపులో ఉండే ‘కర్కుమిన్’ బలమైన యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. పసుపు పాలు తాగడం వల్ల రక్తంలోని మలినాలు బయటకు వెళ్లిపోతాయి.

వేపాకు రసం: వేపాకు రసం తాగడం వల్ల శరీరం మొత్తం శుభ్రపడుతుంది. రక్తంలోని మలినాలను తొలగించి, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

అల్లం రసం: అల్లంలో ‘జింజోరెల్స్’ అనే సమ్మేళనాలు ఉంటాయి. అల్లం రసం తాగితే రక్తంలోని విషపదార్థాలు (టాక్సిన్స్) బయటకు వెళ్లిపోతాయి.

ధనియాల నీళ్లు: ధనియాల నీళ్లు తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగుతాయి. ఇది రక్తాన్ని శుభ్రం చేయడంతో పాటు, కాలేయ (లివర్) ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

ఉసిరి రసం: ఉసిరి రసంలో విటమిన్ సి కంటెంట్ అధికంగా ఉంటుంది. ఉసిరి రసంలోని యాంటీ ఆక్సిడెంట్లు రక్తాన్ని శుభ్రంగా ఉంచి, మలినాలను బయటకు పంపడంలో సహాయపడతాయి.

తులసి టీ: తులసి ఆకుల్లో అధిక ఔషధ గుణాలుంటాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేయడంలో, రోగనిరోధక శక్తిని (ఇమ్యూనిటీ) పెంచడంలో సహాయపడతాయి. తులసి టీ లేదా తులసి నీరు తీసుకోవచ్చు.

పుదీనా టీ: పుదీనా టీ తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన మలినాలన్నీ తొలగిపోతాయి. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి, రక్తాన్ని డిటాక్స్ చేయడంలో సహాయపడుతుంది.

ఈ సహజ పానీయాలను మీ దైనందిన జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా శరీరాన్ని లోపలి నుంచి శుభ్రంగా ఉంచుకోవచ్చు. అయితే, ఏదైనా కొత్త ఆహారపు అలవాటును ప్రారంభించే ముందు నిపుణులను సంప్రదించడం మంచిది.