Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Water: బ్లాక్ వాటర్ అంటే ఏమిటి? ఈ నీటిని తాగడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటంటే..

సెలబ్రిటీల జీవితం గురించి తెలుసుకోవడానికి అభిమానులు చాలా ఉత్సాహాన్ని చూపిస్తారు. సెలబ్రేటీలు ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకూ తినే ఆహారం, తాగే నీరు వరకూ ప్రతి విషయాన్ని తెలుసుకునేందుకు ఆసక్తిని చూపిస్తారు. చాలా మంది సెలబ్రిటీలు బ్లాక్ నీటిని తాగుతూ కనిపిస్తారు. అయితే ఈ బ్లాక్ నీటికి, సాధారణ నీటికి మధ్య తేడా ఏమిటో మీకు తెలుసా? ఇది ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందంటే?

Black Water: బ్లాక్ వాటర్ అంటే ఏమిటి? ఈ నీటిని తాగడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటంటే..
Black Water
Surya Kala
|

Updated on: Jun 24, 2025 | 9:47 PM

Share

క్రికెటర్లు అయినా, బాలీవుడ్ స్టార్లు అయినా, సెలబ్రిటీలు తమ స్టైల్, ఫిట్‌నెస్, ఆహారపు అలవాట్లకు సంబంధించిన వార్తలతో చర్చల్లోనే ఉంటారు. ఎందుకంటే అభిమానులు సెలబ్రిటీల గురించి ప్రతిదీ తెలుసుకోవాలనుకుంటున్నారు. విరాట్ కోహ్లీ నుంచి శ్రుతి హాసన్ , మలైకా అరోరా వరకు ప్రతి ఒక్కరూ బ్లాక్ వాటర్ తాగడం చూస్తారు. నీరు మన దినచర్యలో ఒక ముఖ్యమైన భాగం. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఫిల్టర్ చేసిన నీటిని తాగుతారు. తద్వారా తాగే నీటిలో ఎటువంటి మలినాలు ఉండవు. సహజంగా లభించే నీటిలో కొన్ని ఖనిజాలు కూడా ఉంటాయి. ప్రస్తుతం బ్లాక్ వాటర్ సెలబ్రిటీలలో బాగా ప్రాచుర్యం పొందింది. బ్లాక్ వాటర్ సాధారణ నీటి కంటే ఎందుకు భిన్నంగా ఉంటుంది? ఈ రోజు ఆ విషయాలను తెలుసుకుందాం.

సెలబ్రిటీలు బ్లాక్ వాటర్ తాగుతారు. దీని రుచి దాదాపు సాధారణ నీటి మాదిరిగానే ఉంటుంది. అయితే ఈ నీటి ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ నల్ల నీళ్ళను ప్రత్యేకంగా చూపించేందుకు ఈ నీటిలో పోషక విలువలు వంటి అనేక కారణాలు ఉన్నాయి. ఈ నీళ్ళు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. బ్లాక్ వాటర్ ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం.

pH స్థాయి తేడా సెలబ్రిటీలు త్రాగే బ్లాక్ వాటర్ ఆల్కలీన్ వాటర్. సాధారణ నీటి pH 6 నుంచి 7 మధ్య ఉన్నప్పటికీ.. ఈ బ్లాక్ వాటర్ pH 7 కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే 8 లేదా 9. ఇది శరీరంలోని ఆమ్లత్వాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కనుక ఈ వాటర్ ఆమ్ల సమస్యను కలిగించదు. ఇది మీ చర్మానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఫిట్‌గా ఉండటానికి సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

ఖనిజ లవణాలు ఎక్కువ కొన్ని ఖనిజాలు నీటిలో సహజంగా కనిపిస్తాయి. అయితే నీటిని ఫిల్టర్ చేసినప్పుడు.. కొన్నిసార్లు ఈ ఖనిజాలు నాశనమవుతాయి. బ్లాక్ వాటర్ లో అనేక ఖనిజాలను విడిగా కలుపుతారు. ఇవి శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.

బ్లాక్ వాటర్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటంటే ఆల్కలీన్ బ్లాక్ వాటర్ తాగడం వల్ల శరీరం విషాన్ని తొలగిస్తుంది. దీని pH స్థాయి శరీరం నుంచి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. సాధారణ నీటి కంటే బ్లాక్ వాటర్ శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో ఎక్కువ సహాయపడుతుంది. దీనితో పాటు బ్లాక్ వాటర్ వల్ల రక్తంలో చక్కెర నియంత్రణ, మెరుగైన నిద్ర, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడం వంటి కొన్ని ఇతర ప్రయోజనాలు కూడా పరిగణించబడతాయి. ఎముకలు బలంగా ఉంటాయి.

ఇది తెలుసుకోవడం ముఖ్యం బ్లాక్ వాటర్ ఎంత ప్రయోజనకరంగా ఉంటుందనే విషయంపై చాలా పరిమితమైన శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. ఈ బ్లాక్ వాటర్ ఎటువంటి వ్యాధిని నయం చేయడంలో సహాయపడదు. ఆల్కలీన్, ఖనిజాల పరిమాణం కారణంగా ఈ నీటిని తాగడం ఆరోగ్యంగా ఉండటానికి ఒక ఎంపికగా మాత్రమే త్రాగవచ్చు. ఇందులో కూడా సరైన బ్రాండ్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే, మీ ఆహారంలో బ్లాక్ వాటర్‌ను చేర్చుకునే ముందు, ఖచ్చితంగా వైద్యుడిని లేదా సర్టిఫైడ్ డైటీషియన్‌ను సంప్రదించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

హ్యాట్సాఫ్‌! ట్రయథ్లాన్‌లో చరిత్ర సృష్టించిన.. టాలీవుడ్ హీరోయిన్.
హ్యాట్సాఫ్‌! ట్రయథ్లాన్‌లో చరిత్ర సృష్టించిన.. టాలీవుడ్ హీరోయిన్.
నయన్‌పై ధనుష్‌తో పాటు మరో నిర్మాత సీరియస్.. 5 కోట్లకు నోటీస్‌
నయన్‌పై ధనుష్‌తో పాటు మరో నిర్మాత సీరియస్.. 5 కోట్లకు నోటీస్‌
తన సినిమా ప్రివ్యూ చూస్తూ.. కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్
తన సినిమా ప్రివ్యూ చూస్తూ.. కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్
3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్‌.. ఎప్పటి నుంచి అంటే
3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్‌.. ఎప్పటి నుంచి అంటే
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. చిక్కుల్లో 29 మంది తారలు..
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. చిక్కుల్లో 29 మంది తారలు..
చిన్న తప్పుతో.. EDకి అడ్డంగా దొరికిన టాలీవుడ్ స్టార్స్
చిన్న తప్పుతో.. EDకి అడ్డంగా దొరికిన టాలీవుడ్ స్టార్స్
సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..
సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి
నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా
నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా
ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో
ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో