శరీరంలో ఈ లక్షణాలు కనపడితే అస్సలు నిర్లక్ష్యం చేయకండి..! ఎంత ప్రమాదమో తెలుసా..?
శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే.. కొన్ని సాధారణ ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాటిని మనం సరిగా గమనించం. చాలా మంది నొప్పులు, వాపులు, చర్మ మార్పులు చూసి అవి మామూలు పనుల వల్లనే అంటారు. కానీ ఇవన్నీ యూరిక్ యాసిడ్ వల్ల కావచ్చు. దీన్ని సరిగా గమనించకపోతే గుండె, మూత్రపిండాల లాంటి పెద్ద సమస్యలు రావచ్చు. కాబట్టి ఈ లక్షణాలను చూడగానే డాక్టర్ ను కలవడం చాలా ముఖ్యం.

యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగినప్పుడు శరీరంపై ఎరుపు రంగు మచ్చలు, పొడిబారడం, దురద లాంటివి రావచ్చు. ఇవి మొదట అలెర్జీ లాగా అనిపిస్తాయి. కానీ ఇది యూరిక్ యాసిడ్ వల్ల వచ్చే చర్మ సమస్యల లక్షణాలు కావచ్చు. చర్మంలో మార్పులతో పాటు పాదాలలో ముఖ్యంగా కాలి బొటనవేలు దగ్గర నొప్పి, వాపు, బిగుతుగా ఉండటం చూడొచ్చు. ఇవి యూరిక్ యాసిడ్ వల్ల ఏర్పడే యురేట్ క్రిస్టల్స్ (చిన్న రాళ్ల లాంటివి) కారణంగా వస్తాయి. ఇది కొన్నిసార్లు వెన్నునొప్పికి కూడా కారణం కావచ్చు.
అధిక యూరిక్ యాసిడ్ వల్ల తక్కువ జ్వరం, ఒంటి నొప్పులు వస్తాయి. ముఖ్యంగా ఉదయం నిద్ర లేవగానే నడుము, మోకాలు, తుంటి నొప్పిగా అనిపిస్తాయి. దీన్ని కొన్నిసార్లు వేరే శారీరక సమస్యలుగా అనుకోవడానికి అవకాశం ఉంది. పై లక్షణాలు మీకు కనిపిస్తుంటే వెంటనే వైద్యుడి దగ్గరకు వెళ్లి రక్త పరీక్ష చేయించుకోండి. ఇది సమస్య మొదలు కాకముందే తెలుసుకోవచ్చు.
- చక్కెర, పాల ఉత్పత్తులు, ఎర్ర మాంసం, ప్రాసెస్ చేసిన ఆహారాలు తక్కువగా తినండి.
- తేలికపాటి, తక్కువ గంటల్లో జీర్ణమయ్యే భోజనం.. ఆరోగ్యానికి మంచివి.
- నీరు ఎక్కువగా తాగండి.. ఇది షుగర్ స్థాయిలను అదుపులో ఉంచడానికి సాయం చేస్తుంది.
- బరువు తగ్గించుకోండి.. బరువు ఎక్కువగా ఉంటే యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశం ఉంది.
యూరిక్ యాసిడ్ సమస్యను తక్కువగా చూస్తే అది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి లక్షణాలు కనిపించగానే పరీక్షలు చేయించుకొని డాక్టర్ సలహా తోనే నియమాలు పాటించండి. సరైన సమయంలో చర్య తీసుకుంటే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.