Glowing Skin: మీ ముఖం దీపంలా వెలిగిపోవాలా.. ఈ స్పెషల్ చిట్కాలు మీ కోసమే!

ఫేస్ అందంగా, కాంతివంతంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. దీని కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఖరీదైన ఉత్పత్తులు ఉపయోగిస్తూ ఉంటారు. ఎంత కెమికల్స్ లేనివి ఉపయోగించినా.. ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. చర్మం డల్‌గా, నిర్జీవంగా మారిందంటే అందుకు కారణం.. సరైన పోషకాహారం తీసుకోకపోవడమే. హెల్దీ ఫుడ్ తీసుకుంటూ.. ఇంట్లోని చిన్న చిన్న హోమ్ రెమిడీస్ పాటిస్తే చాలు..

Glowing Skin: మీ ముఖం దీపంలా వెలిగిపోవాలా.. ఈ స్పెషల్ చిట్కాలు మీ కోసమే!
Glowing Skin
Follow us

|

Updated on: Jul 09, 2024 | 4:20 PM

ఫేస్ అందంగా, కాంతివంతంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. దీని కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఖరీదైన ఉత్పత్తులు ఉపయోగిస్తూ ఉంటారు. ఎంత కెమికల్స్ లేనివి ఉపయోగించినా.. ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. చర్మం డల్‌గా, నిర్జీవంగా మారిందంటే అందుకు కారణం.. సరైన పోషకాహారం తీసుకోకపోవడమే. హెల్దీ ఫుడ్ తీసుకుంటూ.. ఇంట్లోని చిన్న చిన్న హోమ్ రెమిడీస్ పాటిస్తే చాలు.. మీ ముఖం దీపంలా వెలిగి పోతుంది. మీ శరీరం కాంతివంతంగా మెరిసిపోతుంది. ఎప్పుడు పై నుంచే కాకుండా.. లోపల నుంచి కూడా ఆరోగ్యంగా ఉండటం అవసరం.

అదే విధంగా మీరు చర్మం విషయంలో సరైన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. బయట కాలుష్యం వల్ల కూడా మీ ముఖంపై డెడ్ స్కిన్ సెల్స్ వచ్చి చేరతాయి. కాబట్టి బయటకు వెళ్లారంటే స్కార్ఫ్ ఖచ్చితంగా ఉంచుకోవాలి. సన్ స్క్రీన్ రాసుకోవాలి. నీటిని ఎక్కువగా తాగుతూ ఉండాలి. పోషణ ఉండే ఆహారం తినాలి. కెమికల్స్ లేని ప్రోడెక్ట్స్ ఉపయోగించాలి. ఇవన్నీ చేస్తూ ఇప్పుడు చెప్పే చిట్కాలు ట్రై చేస్తే చాలు. మీ ముఖం ఖచ్చితంగా దీపంలా వెలిగిపోతుంది. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

టమాటా:

టమాటాతో చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. మీరు బయట చేసుకునే స్క్రబ్స్ కంటే.. ఇంట్లేనే టమాటాపై కొద్దిగా పంచదార వేసుకుని నెమ్మదిగా స్క్రబ్ చేయండి. ఇలా చేస్తే మంచి గ్లో వస్తుంది. వారంలో రెండు సార్లు ఇలా ట్రై చేయండి.

ఇవి కూడా చదవండి

పాలు:

పచ్చి పాలు అయినా, పాల మీద మీగడతో అయినా ముఖాన్ని అప్పుడప్పుడూ మర్దనా చేసుకుంటూ ఉండండి. ఇలా చేయడం వల్ల మంచి గ్లో రావడం పక్కా. అంతే కాకుండా మీ స్కిన్ ఎంతో మృదువు గా మారుతుంది.

స్కిన్ గ్లోయింగ్ ప్యాక్:

ఒక గిన్నె తీసుకుని అందులో కొద్దిగా ఒక టీ స్పూన్ బియ్యం పిండి, కొద్దిగా కలబంద, ఒక స్పూన్ టమాటా రసం, ఒక స్పూన్ బంగాళదుంప రసం, అర టీ స్పూన్ కాఫీ పొడి అన్నీ వేసి కలపాలి. అవసరం అనుకుంటే నీళ్లు లేదా రోజ్ వాటర్ లేదా పాలు ఉపయోగించవచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ అంతా పట్టించండి. ఆ తర్వాత ఓ 5 నిమిషాలు మర్దనా చేయాలి. ఆ తర్వాత ముఖం కడిగేయండి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే చాలు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

మీరు కూడా జిమ్‌కి వెళ్తున్నారా..? ఇలాంటి ట్రైనర్స్ తో జర భద్రం..!
మీరు కూడా జిమ్‌కి వెళ్తున్నారా..? ఇలాంటి ట్రైనర్స్ తో జర భద్రం..!
వర్షాకాలంలో మీ ఇల్లు అందంగా ఉండలా? ఈ చిట్కాలు పాటిస్తే సూపర్‌
వర్షాకాలంలో మీ ఇల్లు అందంగా ఉండలా? ఈ చిట్కాలు పాటిస్తే సూపర్‌
లోన్ కట్టమని రికవరీఏజెంట్స్ వేధిస్తున్నారా?ఈ టిప్స్‌తో సమస్య ఫసక్
లోన్ కట్టమని రికవరీఏజెంట్స్ వేధిస్తున్నారా?ఈ టిప్స్‌తో సమస్య ఫసక్
వీటితో మీ ఇల్లు సేఫ్‌.. రూ. 1500 లోపు బెస్ట్ సీసీటీవీ కెమెరాలు..
వీటితో మీ ఇల్లు సేఫ్‌.. రూ. 1500 లోపు బెస్ట్ సీసీటీవీ కెమెరాలు..
అలాంటి వాళ్లు గుడ్డులోని పచ్చసొన తినకూడదా..? ఒకవేళ తింటే..
అలాంటి వాళ్లు గుడ్డులోని పచ్చసొన తినకూడదా..? ఒకవేళ తింటే..
కాంగ్రెస్ సంబరాలు.. కమలం వ్యూహాలు.. ఆ ఎన్నికలపై ప్రత్యేక ఫోకస్..
కాంగ్రెస్ సంబరాలు.. కమలం వ్యూహాలు.. ఆ ఎన్నికలపై ప్రత్యేక ఫోకస్..
కెప్టెన్‌గా ప్రమోషన్.. ఆ వెంటనే బిగ్ షాకిచ్చిన గంభీర్
కెప్టెన్‌గా ప్రమోషన్.. ఆ వెంటనే బిగ్ షాకిచ్చిన గంభీర్
ఆ రెండు పథకాల్లో పెట్టుబడితో అదిరే లాభాలు..!
ఆ రెండు పథకాల్లో పెట్టుబడితో అదిరే లాభాలు..!
టికెట్‌ వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉండగా రైలు ప్రయాణం చేస్తున్నారా?
టికెట్‌ వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉండగా రైలు ప్రయాణం చేస్తున్నారా?
బుల్లి ఆటో ట్రాలీలో భారీ గజరాజు..! ఐఏఎస్‌ అధికారినే కంగారుపెట్టి
బుల్లి ఆటో ట్రాలీలో భారీ గజరాజు..! ఐఏఎస్‌ అధికారినే కంగారుపెట్టి