AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ మొక్క కిడ్నీ, లివర్ సహా అనేక ఆరోగ్య సమస్యలకు దివ్య ఔషధం.. ఎలా ఉపయోగించాలంటే =

ప్రకృతిలో లభించే మొక్కలు మంచి మెడిసిన్. పిచ్చి మొక్కలు పనికి రావు అనుకునే మొక్కలలో కూడా ఎన్నో వ్యాధులను నయం చేసే ఔషధగుణాలున్నాయని ఆయుర్వేదం చెబుతోంది. అలాంటి మొక్కలలో ఒకటి బెర్బెరిస్ వల్గారిస్. దీనిని హోమయోపతి వైద్యంలో విరివిగా ఉపయోగిస్తారు. ఇది ఇరాన్‌లో ప్రసిద్ధి చెందిన మూలిక. దీనిని ఔషధ మొక్కగా మాత్రమే కాదు ఆహారంగా కూడా ఉపయోగిస్తారు. బెర్బెరిస్ వల్గారిస్ ని సాధారణ వాడుక బాషలో బార్బెర్రీ అని పిలుస్తారు. యూరప్, ఉత్తర ఆఫ్రికా, పశ్చిమ ఆసియాలో ఎక్కువగా పెరుగుతుంది.

ఈ మొక్క కిడ్నీ, లివర్ సహా అనేక ఆరోగ్య సమస్యలకు దివ్య ఔషధం.. ఎలా ఉపయోగించాలంటే  =
Berberis Vulgaris Plant
Surya Kala
|

Updated on: Apr 27, 2025 | 4:19 PM

Share

ప్రస్తుతం కిడ్నీ స్టోన్స్ సమస్యని ఎక్కువ మంది ఎదుర్కొంటున్నారు. అదే విధంగా పైత్య రసంలో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండడం వలన గాల్ స్టోన్స్ సమస్యతో కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యల వలన కడుపు నొప్పి, వికారంతో పాటు శరీరంలో అనేక ఇతర ఆరోగ్య సమస్యలు కూడా కలిగే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో ముత్రపిండల్లో రాళ్ళు, గాల్ స్టోన్స్ సమస్యకు నివారణ కోసం రకరకాల మందులు తీసుకుంటారు. అయితే మూత్ర‌పిండాల్లో రాళ్లు, గాల్ స్టోన్స్ ఏవైనా సరే త్వరగా కరిగి.. మళ్ళీ ఈ సమస్య తలెత్తకుండా ఉండాలని కోరుకుంటే ఈ మొక్క ఒక అద్భుతమైన ఔషధం. అద్భుత‌మైన మొక్క‌కు చెందిన మెడిసిన్ ను క‌నీసం ఒక 3 నెల‌లు ఉపయోగిస్తే ఉపశమనం లభిస్తుంది. అవును.. పలు ర‌కాల హోమియోప‌తి మందుల త‌యారీలో ఉపయోగిస్తున్న బ‌ర్బెరిస్ వ‌ల్గ‌రిస్ ని ఉపయోగిస్తే కిడ్నీ స్టోన్స్ నుంచి ఉపశమనం లభిస్తుంది.

బ‌ర్బెరిస్ వ‌ల్గ‌రిస్ మొక్క‌ వేర్లు, ఆకులతో రకరకాల మెడిసిన్ తయారు చేస్తున్నారు. బ‌ర్బెరిస్ వ‌ల్గ‌రిస్ ఔష‌ధం హోమియోప‌తి మందుల షాపులు లేదా ఆన్‌లైన్‌లోనూ దొరుకుంతుంది. ఇది లిక్విడ్ గా లభిస్తుంది. కిడ్నీ స్టోన్లు లేదా గాల్ స్టోన్స్ తో బాధపడే వారు బ‌ర్బెరిస్ వ‌ల్గ‌రిస్ మెడిసిన్ ను రోజుకు మూడు లేదా నాలుగు సార్లు ఉపయోగించాలి. తీవ్రత బట్టి ఈ ద్రవాన్ని 20 నుంచి 30 చుక్క‌ల మోతాదులో సేవించాలి. రాళ్ల సైజ్ బట్టి కిడ్నీ స్టోన్లు లేదా గాల్ స్టోన్స్ కరిగేందుకు మూడు నెలల నుంచి ఆరు నెలల వరకూ సమయం పడుతుంది. అయితే మళ్ళీ మళ్ళీ ఈ సమస్య తలెత్తదు అని హోమియోపతి నిపుణులు చెబుతున్నారు.

బ‌ర్బెరిస్ వ‌ల్గ‌రిస్ ఔష‌ధం కిడ్నీ స్టోన్లు, గాల్ స్టోన్ల నుంచి ఉపశమం మాత్రమే కాదు.. అనేక ఇతర ఆరోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. దీనిలోని ఔష‌ధ గుణాలు లివ‌ర్ స‌మ‌స్య‌ల నుంచి కూడా ఉపశమనం ఇస్తాయి.

ఇవి కూడా చదవండి

పచ్చకామేర్లతో బాధపడేవారికి బ‌ర్బెరిస్ వ‌ల్గ‌రిస్ ఔష‌ధం మంచి మెడిసిన్. ఎంత తీవ్రమైన కమేర్లు అయినా తగ్గుతాయని చెబుతున్నారు. రోజులో రెండు సార్లు పావు టీస్పూన్ మోతాదులో దీనిని తీసుకుంటే కాలేయ సమస్య వ్యాధులు తగ్గుతాయి.

ఎవరైనా అధిక రక్త పోటు సమస్యతో ఇబ్బంది పడుతుంటే ఈ బ‌ర్బెరిస్ వ‌ల్గ‌రిస్ ఔష‌ధం మంచి ఫలితాన్ని ఇస్తుంది. హై బీపీ నియంత్ర‌ణ‌లోకి వ‌స్తుంది. ర‌క్త నాళాలు తెర‌చుకుని ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. టైఫాయిడ్ వంటి జ్వరం నుంచి ఉపశమనం మాత్రమే కాదు దంతాల సమస్యలను కూడా తగ్గిస్తుంది. చిగుళ్ల స‌మ‌స్య‌ల నుంచి ఉపశమనం లభిస్తుంది.

మహిళలలో వ‌చ్చే రుతు సంబంధ స‌మ‌స్య‌ల నుంచి అంటే కడుపు నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది. అయితే ఈ బ‌ర్బెరిస్ వ‌ల్గ‌రిస్ ఔష‌ధం ఉపయోగించే ముందు.. వైద్యుల సలహా తీసుకోవాలి. డాక్టర్ సలహా మేరకు.. ఎటువంటి సమస్య ఉన్నవారు ఎంత మోతాదులో ఎన్ని సార్లు ఉపయోగించాలో తెలుసుకుని అప్పుడు ఈ ఔష‌ధాన్ని తీసుకోవాలి. లేదంటే ఇతర ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)