Benefits Of Moong Dal Sprouts: మొలకెత్తిన పెసలతో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటో తెలిస్తే షాకవుతారు

మొలకెత్తిన పెసల్లో ఫైబర్, రౌగేజ్ మాత్రమే కాకుండా, ఫోలేట్, విటమిన్ సి, అనేక ఖనిజాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా మొలకెత్తిన పెసల్లో విటమిన్ కె ఉంటుంది. ఇది ఆరోగ్యానికి అనేక విధాలుగా పనిచేస్తుంది. 1 కప్పు నానబెట్టిన పెసల్లో  5.45 ఎంసీజీ విటమిన్ కే ఉంటుంది. ఈ విటమిన్ కే మీకు అనేక విధాలుగా పని చేస్తుంది.

Benefits Of Moong Dal Sprouts: మొలకెత్తిన పెసలతో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటో తెలిస్తే షాకవుతారు
Moong Dal Sprouts
Follow us
Srinu

|

Updated on: Jun 20, 2023 | 4:30 PM

మొలకెత్తిన గింజలు తింటే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అందరికీ తెలిసిందే ముఖ్యంగా మొలకెత్తిన పెసలు తింటే ఆరోగ్యపరంగా చాలా లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత రోజుల్లో ఆరోగ్య పరిరక్షణకు చాలా మంది వివిధ చర్యలను తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. దీంతో చాలామంది మొలకెత్తిన పెసలను సాంప్రదాయకంగా దేశీ అల్పాహారంగా తీసుకుంటున్నారు. మొలకెత్తిన పెసల్లో ఫైబర్, రౌగేజ్ మాత్రమే కాకుండా, ఫోలేట్, విటమిన్ సి, అనేక ఖనిజాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా మొలకెత్తిన పెసల్లో విటమిన్ కె ఉంటుంది. ఇది ఆరోగ్యానికి అనేక విధాలుగా పనిచేస్తుంది. 1 కప్పు నానబెట్టిన పెసల్లో  5.45 ఎంసీజీ విటమిన్ కే ఉంటుంది. ఈ విటమిన్ కే మీకు అనేక విధాలుగా పని చేస్తుంది. ఉదాహరణకు, ఇది కండరాల బలాన్ని పెంచుతుంది. అలాగే మీ రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది కాకుండా, ఆస్టియోకాల్సిన్ అనేది ఆరోగ్యకరమైన ఎముక కణజాలాన్ని ఉత్పత్తి చేయడానికి సాయం చేస్తుంది. మొలకెత్తిన పెసల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం.

గుండెకు మేలు 

మొలకెత్తిన పెసలు గుండె ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు, అడ్డంకుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే అనేక వ్యాధుల నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది.

జీర్ణక్రియకు మంచిది

మొలకెత్తిన పెసలను తినడం మీ జీర్ణక్రియకు వివిధ రకాలుగా మేలు జరుగుతుంది. ఇది గట్‌లోని బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది. అలాగే కడుపులో జీవక్రియ కార్యకలాపాలను పెంచుతుంది. ఫలితంగా మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే మీ జీర్ణవ్యవస్థ సజావుగా నడుస్తుంది. మీ రక్తంలో చక్కెర స్థాయిలు కూడా స్థిరంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

ఎముకలకు బలం

మొలకెత్తిన పెసలను తినం వల్ల ఎముకల పటిష్టతకు అనేక రకాలుగా మేలు జరుగుతుంది. ఎముకల సాంద్రత పెరగడంతో పాటు కీళ్లకు సంబంధించిన సమస్యలను నివారిస్తుంది. కండరాలు ఆరోగ్యంగా ఉండేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. 

మరిన్ని హెల్త్ వార్తల కోసం..