AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Tips: వేసవిలో మీ చర్మం మృదువుగా ఉండాలంటే.. ఈ ఐస్ క్యూబ్ తో ఫేస్ మసాజ్ చేసి చూడండి..! వావ్‌ అంటారు..

వేసవిలో చర్మ సంరక్షణ చాలా ముఖ్యం. ఎండవేడి మీ చర్మాన్ని టాన్ చేస్తుంది. ఇది చర్మాన్ని నల్లగా మార్చడమే కాకుండా చర్మ కాంతిని తగ్గిస్తుంది. సాధారణంగా ఈ సమస్యల నుంచి బయటపడేందుకు చాలా రకాల ఫేస్ ప్యాక్ లను ఉపయోగిస్తారు. అయితే ఖరీదైన బ్యూటీ పార్లర్‌ల చుట్టూ తిరిగి డబ్బును వృథా చేయకుండా ఐస్ క్యూబ్స్ వాడితే వేసవిలో చర్మ సమస్యలను ఈజీగా ఇంట్లోనే దూరం చేసుకోవచ్చు. అందుకోసం చౌకగా లభించే ఐస్‌ క్యూబ్స్‌ అద్భుతంగా సహపడతాయి. వీటితో మీ చర్మంలో కాంతి, ముఖంలో నిగారింపు సంతరించుకుంటుంది.

Beauty Tips: వేసవిలో మీ చర్మం మృదువుగా ఉండాలంటే.. ఈ ఐస్ క్యూబ్ తో ఫేస్ మసాజ్ చేసి చూడండి..! వావ్‌ అంటారు..
Benefits Of Ice Cubes
Jyothi Gadda
|

Updated on: Mar 27, 2024 | 9:26 AM

Share

వేసవిలో చర్మ సంరక్షణ చాలా ముఖ్యం. ఎండవేడి మీ చర్మాన్ని టాన్ చేస్తుంది. ఇది చర్మాన్ని నల్లగా మార్చడమే కాకుండా చర్మ కాంతిని తగ్గిస్తుంది. సాధారణంగా ఈ సమస్యల నుంచి బయటపడేందుకు చాలా రకాల ఫేస్ ప్యాక్ లను ఉపయోగిస్తారు. అయితే ఖరీదైన బ్యూటీ పార్లర్‌ల చుట్టూ తిరిగి డబ్బును వృథా చేయకుండా ఐస్ క్యూబ్స్ వాడితే వేసవిలో చర్మ సమస్యలను ఈజీగా ఇంట్లోనే దూరం చేసుకోవచ్చు. అందుకోసం చౌకగా లభించే ఐస్‌ క్యూబ్స్‌ అద్భుతంగా సహపడతాయి. వీటితో మీ చర్మంలో కాంతి, ముఖంలో నిగారింపు సంతరించుకుంటుంది.

వేసవిలో చర్మానికి ఐస్..

వేసవిలో ఐస్ క్యూబ్ చర్మాన్ని చల్లబరుస్తుంది. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. వేసవిలో చాలా రకాల ఐస్ క్యూబ్స్ ముఖానికి రాసుకోవచ్చు. ఈ ఐస్ క్యూబ్స్ చర్మాన్ని తాజాగా ఉంచుతాయి. సూర్యుని హానికరమైన కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తాయి.

ఇవి కూడా చదవండి

అలోవెరా ఐస్ క్యూబ్..

కలబంద ఐస్ క్యూబ్స్ వేసవిలో చర్మాన్ని చల్లబరుస్తుంది. టానింగ్ నిరోధించడానికి ఉపయోగించవచ్చు. దీన్ని ఉపయోగించడానికి, తాజా అలోవెరా జెల్‌ను ఐస్ ట్రేలో వేసి ఫ్రీజర్‌లో ఉంచండి. 2 నుండి 3 గంటల తర్వాత ఈ ఐస్ క్యూబ్‌తో మీ ముఖాన్ని మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల ట్యానింగ్ తగ్గి చర్మం మెరుస్తుంది.

దోసకాయ, నిమ్మకాయ ఐస్ క్యూబ్స్..

దోసకాయ, నిమ్మకాయలు వేసవిలో చర్మానికి చాలా మేలు చేస్తాయి. ఇది చర్మాన్ని చల్లబరుస్తుంది. టానింగ్‌ను నివారిస్తుంది. దీన్ని ఉపయోగించాలంటే దోసకాయను మిక్సీలో మెత్తగా రుబ్బుకుని, ఈ మిశ్రమానికి నిమ్మరసం కలపండి. ఐస్ ట్రేలో పోసి ఫ్రీజ్ చేయండి. ఈ ఐస్ క్యూబ్ ను ముఖానికి రాసుకుంటే వేసవిలో వచ్చే దద్దుర్లు కూడా తగ్గుతాయి.

టమాటా, తేనెతో ఐస్‌క్యూబ్స్‌..

వేసవిలో టమాటా, తేనె ఐస్ క్యూబ్ ను చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మం తాజాగా ఉంటుంది. ఇందుకోసం కావాల్సినంత టమాటా రసం తీసి అందులో తేనె కలపాలి. ఇప్పుడు ఐస్ ట్రేలో ఫ్రీజ్ చేయండి. ఆ తర్వాత మీ ముఖానికి మసాజ్ చేయండి. 15 నిమిషాలు అలా వదిలివేయండి. ఇలా చేయడం వల్ల మచ్చలు తొలగిపోయి చర్మం మెరుస్తుంది.

దాల్చిన చెక్క ఐస్ క్యూబ్స్…

మీరు వేసవిలో మొటిమలతో బాధపడుతుంటే దాల్చిన చెక్క ఐస్ క్యూబ్‌ను ఉపయోగించవచ్చు. దాల్చిన చెక్కలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమలను తగ్గించగలవు. దీన్ని ఉపయోగించడానికి, 1/4 టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని నీటిలో కరిగించి, ఐస్ ట్రేలో పోసుకుని ఫ్రీజ్‌ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఐస్ క్యూబ్‌ని ముఖానికి అప్లై చేయండి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
హార్దిక్‌కు నో చెప్పిన 2 జట్లు.. రేసులోకి దూసుకొచ్చిన 7 జట్లు
హార్దిక్‌కు నో చెప్పిన 2 జట్లు.. రేసులోకి దూసుకొచ్చిన 7 జట్లు
జస్ట్ ఆ హీరో ఫ్రెండ్ అని చెప్పా.. అంతే బ్యాంకాక్‌ ఆస్పత్రిలో ..
జస్ట్ ఆ హీరో ఫ్రెండ్ అని చెప్పా.. అంతే బ్యాంకాక్‌ ఆస్పత్రిలో ..
వెదర్‌ను బట్టి ట్రాఫిక్ సిగ్నల్స్.. త్వరలో సరికొత్త టెక్నాలజీ
వెదర్‌ను బట్టి ట్రాఫిక్ సిగ్నల్స్.. త్వరలో సరికొత్త టెక్నాలజీ
తిక్క కుదిరిందా? పది అడుగుల పాముతో ఏంటా పరాచకాలు
తిక్క కుదిరిందా? పది అడుగుల పాముతో ఏంటా పరాచకాలు
ఇంగ్లండ్‌తో పోరుకు బుడ్డోడు వద్దు.. పక్కనపెడితేనే మంచిది
ఇంగ్లండ్‌తో పోరుకు బుడ్డోడు వద్దు.. పక్కనపెడితేనే మంచిది
తెలంగాణలో మరో మూడు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడంటే..?
తెలంగాణలో మరో మూడు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడంటే..?
తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం! తెలుగు నేల నుంచే నింగిలోకి..
తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం! తెలుగు నేల నుంచే నింగిలోకి..
మహేష్ నటించిన ఆ సినిమాలో నా సీన్స్ కట్ చేశారు: హీరో సత్యదేవ్
మహేష్ నటించిన ఆ సినిమాలో నా సీన్స్ కట్ చేశారు: హీరో సత్యదేవ్
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!
అన్నదాతలకు గుడ్‌న్యూస్.. 2వ విడత రైతు భరోసా నిధులు విడుదల
అన్నదాతలకు గుడ్‌న్యూస్.. 2వ విడత రైతు భరోసా నిధులు విడుదల