- Telugu News Photo Gallery Amazing health benefits of parijat flowers for bone problems Telugu Lifestyle News
ఈ పువ్వు రాత్‌కీ రాణి..! ఆయుర్వేదంలో అద్భుత సంజీవని.. లాభాలు తెలిస్తే కళ్లకు అద్దుకోవాల్సిందే..!!
పారిజాత పుష్పం ప్రయోజనాలు: రాత్రి రాణిగా పేరొందిన పారిజాత పుష్పంలోని సువాసన మనసును ఉల్లాసపరుస్తుంది. పారిజాత పువ్వులు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ఆయుర్వేద వైద్యంలో పారిజాత పువ్వుకు విశేష ప్రాధాన్యత ఉంది. పారిజాతం ఆకులతో పాటు, దాని పువ్వులు కూడా అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. దీని పువ్వులు, ఆకులు, నూనెను జలుబు, జీర్ణ సమస్యలు, కీళ్లనొప్పులు వంటి వివిధ వ్యాధుల చికిత్సలో, పిల్లలలో కడుపు నొప్పి నుండి ఉపశమనం పొందేందుకు ఉపయోగిస్తారు. పారిజాత పువ్వులు కంటి సమస్యలలో మేలు చేస్తాయి. ఆకలిని పెంచడంలో కూడా సహాయపడతాయి. దీని వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలను తెలుసుకుందాం.
Updated on: Mar 27, 2024 | 7:24 AM

హిందూమతంలో పారిజాతానికి పవిత్రమైన, ప్రత్యేక స్థానం ఉంది. పారిజాతాన్ని పారిజాత అనే పేరుతోనే కాకుండా అనేక ఇతర పేర్లతో కూడా పిలుస్తారు. పారిజాత శృంగర హర, హరసింగర, శివులి, షెఫాలీ అనే పేర్లతో కూడా పిలుస్తారు.. పారిజాతాన్ని ఆంగ్లంలో నైట్ జాస్మిన్ అంటారు. ఆకాశ వనదేవతలకు కూడా పారిజాతానికి అవినాభావ సంబంధం ఉంది. వనదేవతలు తమ అలసటను పోగొట్టుకోవడానికి పారిజాత వృక్షం వద్దకు వస్తారని పెద్దలు చెబుతుంటారు. ఆయుర్వేదంలో పారిజాత ఒత్తిడిని తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉందని, అనేక ఔషధ గుణాలను కలిగి ఉందని చెప్పబడింది.

జలుబు, దగ్గుకు చికిత్స: పారిజాత మొక్క దగ్గుకు ఔషధంగా ఉపయోగపడుతుంది. చెట్టు బెరడును ఆయుర్వేద ఔషధంగా ఉపయోగిస్తారు. దీని ఆకులు, బెరడు, పూలు తీసుకుని నీళ్లలో మరిగించి కషాయం చేసి తాగితే మేలు జరుగుతుంది. ఇది తరచుగా ఆయుర్వేద చికిత్సగా ఉపయోగించబడుతుంది. జలుబు, దగ్గుకు పారిజాత పువ్వు టీ లేదా డికాషన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి.

జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది: పారిజాత పుష్పం ఆయుర్వేద వైద్యంలో జీర్ణశక్తిని మెరుగుపరిచే లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. పారిజాత పువ్వులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, వివిధ పోషక మూలకాలు ఉన్నాయి. ఇది జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. పారిజాత పువ్వు ఆకులను తీసుకోవడం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అజీర్ణాన్ని తగ్గిస్తుంది.

ఒత్తిడిని తగ్గిస్తుంది: పారిజాత పువ్వు సువాసన మానసిక ఒత్తిడిని తగ్గించడంలో, అంతర్గత శాంతిని పెంపొందించడంలో సహాయపడుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడే అరోమాథెరపీ, ఆయుర్వేదంలో ఇది ఒక సహజ నివారణగా పరిగణించబడుతుంది. అలాగే, చలికాలంలో చాలా మంది చుండ్రు సమస్యను ఎదుర్కొంటారు. అలాంటి వారికి పారిజాత గింజలను పేస్టులా చేసి తలకు పట్టిస్తే చుండ్రు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.

హిందూమతంలో పారిజాతానికి పవిత్రమైన, ప్రత్యేక స్థానం ఉంది. పారిజాతాన్ని పారిజాత అనే పేరుతోనే కాకుండా అనేక ఇతర పేర్లతో కూడా పిలుస్తారు. పారిజాత శృంగర హర, హరసింగర, శివులి, షెఫాలీ అనే పేర్లతో కూడా పిలుస్తారు.. పారిజాతాన్ని ఆంగ్లంలో నైట్ జాస్మిన్ అంటారు. ఆకాశ వనదేవతలకు కూడా పారిజాతానికి అవినాభావ సంబంధం ఉంది. వనదేవతలు తమ అలసటను పోగొట్టుకోవడానికి పారిజాత వృక్షం వద్దకు వస్తారని పెద్దలు చెబుతుంటారు. ఆయుర్వేదంలో పారిజాత ఒత్తిడిని తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉందని, అనేక ఔషధ గుణాలను కలిగి ఉందని చెప్పబడింది.

గొంతు సంబంధిత సమస్యలను నయం చేయడానికి ఆయుర్వేదంలో దీనిని ఉపయోగిస్తారు. దీని వేరును నమిలి తింటే గొంతు సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. దీని ఆకులను ఉడకబెట్టి కషాయాల రూపంలో తాగడం వల్ల శరీరంలో ఎలాంటి నొప్పి వచ్చినా, వాపు వచ్చినా ఉపశమనం కలుగుతుందని ఆయుర్వేదంలో చెప్పబడింది. (ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)




