AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aloe Vera for Skin Care: మొటిమలతో విసిగిపోయారా? అయితే ఇంటి పెరట్లోని ఈ మొక్కతో చిటెకెలో మాయం చేద్దాం..

కలబంద మన చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉన్నందున, ఇది చర్మ సంరక్షణకు చాలా మంచిది. అందుకే ఇళ్లలో కలబందను పెంచుతారు. కానీ చాలా మందికి కలబందను సరిగ్గా ఎలా ఉపయోగించాలో తెలియదు. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, దాని ప్రకాశాన్ని పెంచడానికి కలబందను ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం..

Aloe Vera for Skin Care: మొటిమలతో విసిగిపోయారా? అయితే ఇంటి పెరట్లోని ఈ మొక్కతో చిటెకెలో మాయం చేద్దాం..
ముఖం, జుట్టుకు ఎల్లప్పుడూ తాజా కలబంద జెల్ మాత్రమే రాయడం మంచిది. కలబంద ఆరోగ్యంగా లేకుంటే లేదా సరిగ్గా నిల్వ చేయకపోతే అది దుర్వాసన వస్తుంది. ఈ జెల్ బ్యాక్టీరియా లేదా ఇతర సూక్ష్మజీవులతో కలుషితమై ఉంటుంది. దీనివల్ల దురద వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, కలబంద జెల్ దుర్వాసనతో కూడి ఉంటే దానిని ఉపయోగించకపోవడమే మంచిది.
Srilakshmi C
|

Updated on: Feb 20, 2025 | 1:08 PM

Share

ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని కోరుకోవడం సహజం. ముఖ్యంగా అమ్మాయిలు ఈ విషయంలో మరింత కేర్‌గా ఉంటారు. అందుకే అందంటా కనిపించేందుకు రకరకాల ఉత్పత్తులు వినియోగిస్తుంటారు. ముఖ్యంగా ముఖంపై మాటిమాటికీ వచ్చే మొటిమలు, వాటి తాలూకు మచ్చలు అంత త్వరగా పోవు. మొటిమల నివారణకు వివిధ సబ్బులు, క్రీములు ఎన్ని వాడినా లాభం ఉండదు. అలాంటప్పుడు పెరట్లోని ఈ ఔషధ మొక్క సాయం తీసుకోవచ్చు. అందే కలబంద. కలబంద చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చర్మ సంరక్షణకు చాలా మంచిది. అందుకే ఇళ్లలో కలబందను పెంచుతారు. కానీ చాలా మందికి కలబందను సరిగ్గా ఎలా ఉపయోగించాలో తెలియదు. చర్మ ఆరోగ్యానికి కలబందను ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం..

కలబంద పురాతన కాలం నుంచి ఉపయోగించబడుతోంది. అందుకే ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న కలబందను అనేక గృహ నివారణల రూపంలో కూడా ఉపయోగిస్తారు. కలబంద చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. చర్మంపై మంట, నల్లటి మచ్చలు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. కలబందలో సాలిసిలిక్ ఆమ్లం, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మ సంరక్షణకు చాలా మంచిది.

కలబంద ప్రయోజనాలు

చర్మంపై వచ్చే దద్దుర్లు, మంటను తగ్గించడంలో కలబంద చాలా ప్రభావవంతంగా ఉంటుంది. కలబందలోని శోథ నిరోధక లక్షణాలు దీనికి సహాయపడతాయి. కలబందను కట్ చేసి తొక్క తీసి, ఆ జెల్ ను ఫ్రిజ్ లో ఉంచి బాగా చల్లబరిచనివ్వాలి. ఆపై దీనిని ముఖానికి అప్లై చేసుకోవాలి. కలబంద కూడా ఒక గొప్ప మాయిశ్చరైజర్. దీనిని ప్రతిరోజూ ముఖానికి అప్లై చేయడవచ్చు. అలోవెరా జెల్ ను ముఖంపై 10 నిమిషాలు అప్లై చేయడం వల్ల చర్మ సంబంధిత సమస్యలన్నీ దూరం అవుతాయి. ఇది చర్మాన్ని మృదువుగా చేసి, మెరుపును ఇవ్వడం ద్వారా దాని అందాన్ని పెంచుతుంది. కలబందలోని యాంటీఆక్సిడెంట్లు, ఎంజైమ్‌లు చర్మాన్ని కాంతివంతం చేయడానికి సహాయపడతాయి. మొటిమలతో బాధపడేవారు అలోవెరా జెల్‌ను ముఖానికి అప్లై చేసుకోవచ్చు. ఇది దాదాపు అన్ని చర్మ సమస్యలను పరిష్కరిస్తుంది.

ఇవి కూడా చదవండి

కలబందను ఎలా ఉపయోగించాలి?

సాధారణంగా కలబందను పూయడానికి బదులుగా దానికి కొన్ని పదార్థాలను జోడించి వినియోగించడం మంచిది. దీన్ని మాయిశ్చరైజర్‌గా ఉపయోగించాలంటే ఇందులో కొద్దిగా తేనె జోడించవచ్చు. మొటిమలను వదిలించుకోవడానికి పసుపును ఉపయోగించవచ్చు. జిడ్డు చర్మం ఉంటే, కలబందకు కొద్దిగా నిమ్మరసం కలిపి అప్లై చేయవచ్చు. ఇలా చేయడం వల్ల సమస్య చాలా త్వరగా పరిష్కారమవుతుంది.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్‌ చేయండి.