Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Tips: ఎండలకు మీ ముఖం మాడిపోయిందా? వారానికి రెండుసార్లు ఇలా చేయండి.. అద్దంలా మేరిపోవడం ఖాయం..

Beauty Tips: బానుడి భగభగలు.. తీవ్ర ఉష్ణోగ్రతలు.. వెరసి ముఖం మాడిపోతుంది. అందమైన రూపం కాస్తా.. కళావిహీనంగా తయారవుతోంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఫేస్ ట్యాన్‌ను తొలగించుకునేందుకు..

Beauty Tips: ఎండలకు మీ ముఖం మాడిపోయిందా? వారానికి రెండుసార్లు ఇలా చేయండి.. అద్దంలా మేరిపోవడం ఖాయం..
Kiwi Benefits
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 07, 2023 | 4:03 PM

Beauty Tips: బానుడి భగభగలు.. తీవ్ర ఉష్ణోగ్రతలు.. వెరసి ముఖం మాడిపోతుంది. అందమైన రూపం కాస్తా.. కళావిహీనంగా తయారవుతోంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఫేస్ ట్యాన్‌ను తొలగించుకునేందుకు.. మార్కెట్‌లో లభించే రకరకాల ఫేస్ క్రీమ్స్, కాస్ట్యూమ్స్ కొనుగోలు చేసి యూజ్ చేస్తారు. అయితే, రసాయనాలతో తయారు చేసిన ప్రోడక్ట్స్ వాడటం వల్ల ప్రయోజనం కొంతకాలం మాత్రమే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నేచురల్‌ పదార్థాలతో ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చునని చెబుతున్నారు. కివి పండులో ముఖారవిందాన్ని రెట్టింపు చేయొచ్చని పేర్కొంటున్నారు. మరి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

కివి రుచి పరంగా పుల్లంగా ఉంటుంది. ఇందులో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది. అంతేకాదు.. చర్మంపై వృద్ధాప్య ఛాయలను తగ్గించడంలోనూ అద్భుతంగా పని చేస్తుంది. చర్మం ఎక్కువ కాలం యవ్వనంగా ఉంటుంది. కివి పడును ముఖానికి అప్లై చేయడం వలన.. మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. కివిలో ఆక్టినిడిన్ అనే సహజమైన ప్రొటీయోలైటిక్ ఎంజైమ్ ఉంది. ఇది ముఖారవిందాన్ని, గ్లో పెంచడంలో సహాయపడుతుంది. కివిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

కివి పండును ముఖంపై అప్లై చేయాలి..

కివీ ముక్కలను ఐస్‌లో ఉంచి చల్లబరచాలి. కాసేపటి తరువాత ఈ ముక్కలను ముఖంపై బాగా రుద్దాలి. మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ముఖం చర్మానికి అవసరమైన పోషకాలు నేరుగా అందుతాయి. తద్వారా చర్మం కాంతివంతంగా మారుతుంది. చర్మం గ్లో కూడా పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

పెరుగు, కివి..

ఒక గిన్నెలో 2 స్పూన్ల పెరుగు తీసుకోవాలి. అందులో కివీ గుజ్జును వేయాలి. దానిని బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత పేస్ట్‌ని ముఖం, మెడపై అప్లై చేయాలి. ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత మంచి నీళ్లతో ముఖం కడుక్కుని శుభ్రం చేసుకోవాలి.

స్ట్రాబెర్రీ, కివీ..

ఒక గిన్నెలో కివి, స్ట్రాబెర్రీ గుజ్జును సమాన పరిమాణంలో తీసుకోవాలి. బాగా మెత్తగా చేసి అందులో చందనం పొడి కలపాలి. ఆ తర్వాత ముఖానికి పట్టించి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. వారానికి 2 సార్లు ఇలా అప్లై చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది.

కలబంద, కివీ..

కివీ గుజ్జు, అలోవెరా జెల్ కలిపి బాగా కలపాలి. ఆ తర్వాత పేస్ట్‌ని ముఖానికి బాగా పట్టించి, 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత ముఖాన్ని కడిగి శుభ్రం చేసుకోవాలి.

గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం బ్యూటీషియన్స్ సలహాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న చిట్కాల ఆధారంగా ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..