AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pot Water: కుండలో నీళ్లు తాగుతున్నారా.. ఈ విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి..

నీళ్లు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ విషయం గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. అందరికీ తెలుసు. అయితే ఎందులో నీళ్లు తాగుతున్నారన్నది ఇంపార్టెంట్. ప్రస్తుతం వేసవి కాలం.. ఎండలు మండిపోతున్నాయి. చల్లచల్లని నీళ్లు తాగాలని అందరూ అనుకుంటారు. దీంతో ఫ్రిజ్‌లో వాటర్ పెట్టి.. కూలింగ్ వాటర్ తాగేస్తూ ఉంటారు. ఇలా తాగడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ. అందుకే కుండలోని నీళ్లు తాగాలని చెబుతారు. కుండలోని నీళ్లు సహజంగానే..

Pot Water: కుండలో నీళ్లు తాగుతున్నారా.. ఈ విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి..
Pot Water
Chinni Enni
|

Updated on: Jun 04, 2024 | 5:54 PM

Share

నీళ్లు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ విషయం గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. అందరికీ తెలుసు. అయితే ఎందులో నీళ్లు తాగుతున్నారన్నది ఇంపార్టెంట్. ప్రస్తుతం వేసవి కాలం.. ఎండలు మండిపోతున్నాయి. చల్లచల్లని నీళ్లు తాగాలని అందరూ అనుకుంటారు. దీంతో ఫ్రిజ్‌లో వాటర్ పెట్టి.. కూలింగ్ వాటర్ తాగేస్తూ ఉంటారు. ఇలా తాగడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ. అందుకే కుండలోని నీళ్లు తాగాలని చెబుతారు. కుండలోని నీళ్లు సహజంగానే చల్లగా ఉంటాయి. ఇంట్లో ఫ్రిజ్ ఉన్నా.. చాలా మంది కుండలోని నీళ్ళు తాగేందుకే ఇష్ట పడుతున్నారు. ఈ నీటిని తాగడం వల్ల ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

కుండలో ఉంచిన నీరు చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా.. ఖనిజాలు కూడా అందుతాయి. కుండ నీటిలోని ఆల్కలీన్ లక్షణాలు శరీరం పీహెచ్ స్థాయిలను నిర్వహించడంలో హెల్ప్ చేస్తుంది. ఈ నీళ్లు తాగడం మంచిదే అయినా.. కొన్ని విషయాలు మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. లేదంటే అనారోగ్య సమస్యలు రావడం పక్కా. కుండని శుభ్రం చేసే విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో ఇప్పుడు చూద్దాం.

1. కుండను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. ప్రతి రోజూ నీళ్లు వేసే ముందు కుండని శుభ్రంగా స్క్రబ్బర్‌తో శుభ్రం చేసి నీళ్లు వేయాలి. బాగానే ఉంది కదా అని వదిలేయకూడదు. మట్టి వల్ల బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

2. మీరు కొత్త కుండ ఉపయోగిస్తే.. కుండను దాదాపు రెండు రోజులు నీటిలో నానబెట్టి.. ఆ తర్వాత ఉప్పు వేసి స్క్రబ్బర్‌తో శుభ్రం చేయడాలి. అప్పుడే కుండలోని నీళ్లు తాగేందుకు బెటర్.

3. కుండను శుభ్రం చేయడానికి ముందుగానే ఒక లిక్విడ్‌ను సిద్ధం చేసుకోండి. ఓ బౌల్‌లో బేకింగ్ సోడా, వైట్ వెనిగర్, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపండి. ఈ లిక్విడ్‌తో కుండను శుభ్రం చేయండి.

4. కుండను దాదాపుగా ఒక సంవత్సరం పాటు ఉపయోగించుకోవచ్చు. కుండలోని నీళ్లు చల్లబడటం లేదు అన్న సమయంలో వేరే కుండ తీసుకోవచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..