Banana Peel Benefits: ఈ తొక్కలో ఏముందిలే అనుకుంటున్నారా..? మీ బ్యూటీ సీక్రెట్ దాగి వుంది..!
అరటి తొక్కను పారేస్తున్నారా? దానిలోని అద్భుత ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న ఈ తొక్క చర్మానికి సహజ మెరుపును ఇస్తుంది, మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది. పళ్ళు తెల్లబడటానికి, కీటకాల కాటు, నొప్పుల ఉపశమనానికి కూడా అరటి తొక్క అద్భుతంగా పనిచేస్తుంది. ఇకపై వృథా చేయకండి!

అరటిపండ్లు శరీర ఆరోగ్యానికి అవసరమైన పొటాషియం, విటమిన్ బి6, విటమిన్ సి, మెగ్నీషియం, ఫైబర్‌కు గొప్ప మూలం. కానీ, దాదాపుగా అందరూ పండు తిన్న తర్వాత తొక్క విసిరి పడవేస్తుంటారు. కానీ, ఈ తొక్కలో దాగివున్న సీక్రెట్ తెలిస్తే.. అస్సలు విడిచిపెట్టరు. పండ్ల తొక్కలలో చర్మ ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. సరిగ్గా ఉపయోగించినట్లయితే అవి మీ చర్మానికి సహజమైన మెరుపును ఇవ్వడంలో, తేమను నిలుపుకోవడంలో సహాయపడతాయి. అరటి మన చర్మానికి ఎలాంటి ప్రయోజనాలను అందిస్తుందో చూద్దాం…
మొటిమలు – మొటిమలు ఉన్న ప్రదేశంలో పండ్ల తొక్క లోపలి భాగాన్ని సున్నితంగా రుద్దడం వల్ల మంట తగ్గుతుంది. మచ్చలు తగ్గుతాయి.
చర్మ కాంతి: పండ్ల తొక్కలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి. మీ చర్మానికి చక్కని మెరుపును ఇస్తాయి.
కంటి కింద ముడతలు తగ్గించండి: కళ్ళ కింద నల్లటి వలయాలు, ఉబ్బుని తగ్గించడానికి మీరు అరటి పండ్ల తొక్కను చిన్న ముక్కలుగా కోసి కళ్ళపై ఉంచవచ్చు.
అరటి పండ్ల తొక్క దంతాల పసుపు రంగును మార్చడానికి కూడా సహాయపడుతుంది. మీరు ప్రతిరోజూ రెండు నిమిషాలు అరటి తొక్క లోపలి భాగంతో మీ దంతాలను బ్రష్ చేసుకోవచ్చు. తొక్కలోని పొటాషియం, మెగ్నీషియం దంతాల పసుపు రంగును మార్చి తెల్లగా చేస్తాయి.
అలాగే, దోమలు లేదా ఇతర కీటకాలు కుట్టిన ప్రదేశంలో పండ్ల తొక్కను రుద్దడం వల్ల దురద, నొప్పి త్వరగా తగ్గుతుంది. కీళ్ల నొప్పులు లేదా తలనొప్పి ఉన్న ప్రాంతానికి దీన్ని అప్లై చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




