Health Tips: ఆహారం తింటూ నీరు తాగొద్దు అని పెద్దలు ఎందుకు చెబుతారో తెలుసా..!

నీరు లేకుండా మనిషి జీవించడం అసాధ్యం. నీరు ఎంత ముఖ్యమో.. దానికి సంబంధించి అనేక అపోహలు ఉన్నాయి. ఉదాహరణకు నిలబడి నీరు త్రాగకూడదు, ఆహార పదార్థాలను తింటూ నీరు త్రాగకూడదు. ఈ అపోహలలో ఒకటి తిన్న వెంటనే నీరు త్రాగాలా లేదా ఆహారంతో త్రాగాలా లేదా అనేది. తరచుగా డిన్నర్ టేబుల్ దగ్గర పిల్లలు భోజనం చేసే సమయంలో నీరు తాగవద్దు అని తల్లి చెప్పడం కనిపిస్తుంది. అయితే చాలా తక్కువ మందికి దీని వెనుక ఉన్న అసలు అర్థం తెలుసు. ఇదే విషయంపై నిపుణులు ఏమి చెబుతున్నారో ఈ రోజు తెలుసుకుందాం..

Health Tips: ఆహారం తింటూ నీరు తాగొద్దు అని పెద్దలు ఎందుకు చెబుతారో తెలుసా..!
Ayurveda Health Tips
Follow us
Surya Kala

|

Updated on: Aug 23, 2024 | 3:58 PM

నీరు మానవ జీవితానికి చాలా అవసరం. నీరు లేని మానవ జీవితాన్ని ఊహించడం కష్టం. మనిషికి జీవనాధారం నీరే. నీరు లేకుండా మనిషి జీవించడం అసాధ్యం. నీరు ఎంత ముఖ్యమో.. దానికి సంబంధించి అనేక అపోహలు ఉన్నాయి. ఉదాహరణకు నిలబడి నీరు త్రాగకూడదు, ఆహార పదార్థాలను తింటూ నీరు త్రాగకూడదు. ఈ అపోహలలో ఒకటి తిన్న వెంటనే నీరు త్రాగాలా లేదా ఆహారంతో త్రాగాలా లేదా అనేది.

తరచుగా డిన్నర్ టేబుల్ దగ్గర పిల్లలు భోజనం చేసే సమయంలో నీరు తాగవద్దు అని తల్లి చెప్పడం కనిపిస్తుంది. అయితే చాలా తక్కువ మందికి దీని వెనుక ఉన్న అసలు అర్థం తెలుసు. ఇదే విషయంపై నిపుణులు ఏమి చెబుతున్నారో ఈ రోజు తెలుసుకుందాం..

నిపుణులు ఏమంటారు

ఇవి కూడా చదవండి

ఆయుర్వేదం ప్రకారం శరీరం దాని సొంత పని విధానాన్ని కలిగి ఉంటుంది. మనం ఆహారం తిన్నప్పుడు ఆ ఆహారాన్ని జీర్ణం అవ్వడానికి శరీరం అగ్నిని ఉత్పత్తి చేస్తుంది, దీనిని గ్యాస్ట్రిక్ ఫైర్ అంటారు. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. ఈ అగ్ని లేదా శక్తి సహాయంతో ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. శరీరం ఆహారం నుంచి పూర్తి పోషణను పొందుతుంది. అయితే మనం ఆహారం తిన్న వెంటనే నీరు త్రాగినప్పుడు ఈ అగ్ని లేదా శక్తి శాంతింస్తుంది. దీని కారణంగా ఆహారం జీర్ణం అయ్యేలా చేయడానికి శరీరం చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీని కారణంగా జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు పెరుగుతాయి. అజీర్ణం, గ్యాస్, త్రేనుపు వంటి సమస్యలతో బారిన పడే అవకాశం ఉంది.

తిన్న వెంటనే చల్లటి నీరు తాగకూడదు

అలాగే ఆహారం తిన్న తర్వాత చల్లటి నీటిని తాగకూడదు. ఇది జీర్ణవ్యవస్థను కూడా దెబ్బతీస్తుంది. ఆహారం జీర్ణం అవ్వదు. నీళ్లు తాగాల్సి వచ్చినా ఒకటి రెండు గుటకలు మాత్రమే తాగాలని నిపుణులు చెబుతున్నారు. ఒకేసారి ఎక్కువ నీరు త్రాగవద్దు ఎందుకంటే అలా చేయడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. అందుకే ఆహారం తిన్న అరగంట తర్వాత మాత్రమే నీరు తాగాలి. దీనితో పాటు తిన్న వెంటనే పడుకోకండి. ఇది జీర్ణక్రియ వేగాన్ని కూడా తగ్గిస్తుంది. ఆహారం తిన్న తర్వాత రెండు మూడు గుక్కల నీళ్లు తాగి కాసేపు నడవడం, అరగంట తర్వాత ఒక గ్లాసు నీళ్లు తాగడం, ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ సవ్యంగా సాగడమే కాకుండా జీర్ణ సమస్యలు దరిచేరవు.

తినడానికి ముందు కూడా నీరు త్రాగ వచ్చా

తినడానికి అరగంట ముందు నీరు త్రాగాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే తినే ముందు నీరు త్రాగడం వల్ల కడుపు ఉబ్బుతుంది. కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఇది అవసరమైన దానికంటే తక్కువ ఆకలిని కలిగిస్తుంది. కనుక ఎవరైనా తినడానికి ముందు లేదా తిన్న తర్వాత వెంటనే నీరు తాగే అలవాటుని తగ్గించుకోండి..

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)