Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లైన మీ కూతురికి పొరపాటున కూడా ఈ గిఫ్ట్ లు ఇవ్వకండి..! ఎందుకో తెలుసా.?

ప్రతి ఒక్కరికీ కొన్ని నమ్మకాలు ఉంటాయి. ముఖ్యంగా భారతీయ సంస్కృతిలో వాస్తు, జ్యోతిష శాస్త్రాలకు విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ శాస్త్రాల ప్రకారం కొన్ని వస్తువులను పెళ్లైన కూతురికి బహుమతిగా ఇవ్వడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఇది సంబంధాలలో తేడాలను, ఆర్థిక ఇబ్బందులను లేదా ఒత్తిడిని కలిగించే ప్రమాదం ఉందట. మరి అలాంటి బహుమతులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

పెళ్లైన మీ కూతురికి పొరపాటున కూడా ఈ గిఫ్ట్ లు ఇవ్వకండి..! ఎందుకో తెలుసా.?
Avoid These 3 Gifts For Married Daughters
Follow us
Prashanthi V

|

Updated on: Apr 03, 2025 | 9:01 PM

తల్లిదండ్రుల ప్రేమకు హద్దులు ఉండవు. తమ పిల్లల కోసం వారు ఎంత చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. ముఖ్యంగా ఆడపిల్లలంటే చాలా అపురూపం. కూతురు పెళ్లి అయిన తర్వాత కూడా ఆమెకు అవసరమైన అన్ని విషయాల్లో సహాయపడాలని తల్లిదండ్రులు భావిస్తారు. అయితే ఏదైనా బహుమతి ఇచ్చే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను గమనించడం అవసరం. వాస్తు నిపుణుల సూచనల ప్రకారం కొన్ని వస్తువులను బహుమతిగా ఇచ్చినప్పుడు అనుకోని సమస్యలు ఏర్పడే అవకాశం ఉందట.

వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన వస్తువులను కూతురికి బహుమతిగా ఇవ్వడం వల్ల ఆమె వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఆ బహుమతులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తు నిపుణుల ప్రకారం నలుపు రంగు నెగటివ్ ఎనర్జీని ఆకర్షించే శక్తిని కలిగి ఉంటుంది. పెళ్లైన కూతురికి నల్లటి దుస్తులు బహుమతిగా ఇచ్చినట్లయితే ఆమె వైవాహిక జీవితంలో అనవసర సమస్యలు తలెత్తవచ్చని నమ్ముతారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని దెబ్బతీసే అవకాశముందని చెబుతారు. కాబట్టి నల్లటి దుస్తుల బదులుగా శుభప్రదమైన రంగులు అయిన పసుపు, గులాబీ, తెలుపు, ఆకుపచ్చ వంటి రంగులను ఎంచుకోవడం మంచిది.

గాజు సాధారణంగా బలహీనతకు, అస్థిరత్వానికి ప్రతీకగా పరిగణించబడుతుంది. ఇది తేలికగా పగిలిపోతుంది కాబట్టి వాస్తు నిపుణుల ప్రకారం గాజు వస్తువులను పెళ్లైన కూతురికి బహుమతిగా ఇవ్వడం మంచిది కాదట. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సభ్యుల మధ్య అనివార్యమైన విభేదాలు తలెత్తే ప్రమాదం ఉంటుందని అంటారు. కాబట్టి గాజు వస్తువుల బదులుగా బంగారు, వెండి వంటి శుభప్రదమైన లోహాల నుంచి తయారైన వస్తువులను బహుమతిగా ఇవ్వడం శ్రేయస్కరం.

వాస్తు, ధార్మిక విశ్వాసాల ప్రకారం ఊరగాయలలో ఉండే కారం, పులుపు వంటి రుచులు సంబంధాలలో మార్పులకు సంకేతంగా పరిగణించబడతాయి. పెళ్లైన కూతురికి ఊరగాయలు బహుమతిగా ఇవ్వడం వల్ల అత్తామామలతో సంబంధాల్లో చిన్న చిన్న విభేదాలు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆమె కుటుంబ జీవితం ఒత్తిడిగా మారే అవకాశం ఉందట. అందుకే ఊరగాయల బదులుగా తియ్యటి పదార్థాలను బహుమతిగా ఇవ్వడం శ్రేయస్కరమని సూచిస్తున్నారు.

కూతురు పెళ్లి అయిన తర్వాత కూడా తల్లిదండ్రుల ప్రేమ మారదు. ఆమెకు మంచి భవిష్యత్తు కావాలని కోరుకునే ప్రతి తల్లిదండ్రులు వాస్తు సూచనల ప్రకారం కొన్ని చిన్న విషయాలను పాటిస్తే కుటుంబంలో శుభ ఫలితాలను పొందవచ్చు. మంచి మాటలు మాట్లాడటం, శుభప్రదమైన బహుమతులు ఇవ్వడం, ప్రేమతో ఆదరించడం ఇవన్నీ సానుకూలతను పెంచుతాయి.