AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇవేవో పిచ్చి ఆకులు అనుకునేరు.. పవర్‌ఫుల్ దివ్యౌషధం.. దెబ్బకు ఈ 6 సమస్యలు మటాష్..

పుదీనా.. ఔషధ గుణాలతో పాటు సువాసన, రుచికి ప్రసిద్ధి చెందింది. పుదీనాను సూప్‌లు, సలాడ్‌లు, చట్నీలు, కాక్‌టెయిల్‌లలో ఉపయోగిస్తారు. పుదీనా ఆకులు రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. పుదీనాను క్రమం తప్పకుండా తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.. వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు..? ఈ వివరాలను తెలుసుకోండి..

ఇవేవో పిచ్చి ఆకులు అనుకునేరు.. పవర్‌ఫుల్ దివ్యౌషధం.. దెబ్బకు ఈ 6 సమస్యలు మటాష్..
పుదీనా జీర్ణ సంబంధిత సమస్యలకు దివ్యౌషధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అజీర్ణం, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి పుదీనా ఆకులతో చేసే వైద్యం ఉపశమనం కలిగిస్తుంది. పుదీనాలో ఉండే మెంథాల్ అనే సమ్మేళనం కడుపులోని కండరాలను సడలించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
Shaik Madar Saheb
|

Updated on: Apr 03, 2025 | 8:45 PM

Share

పుదీనా.. ఒక ఔషధ మొక్క.. దీనిలో ఔషధగుణాలతోపాటు ఎన్నో పోషకాలు దాగున్నాయి.. ఇవి ఆరోగ్యాన్ని కాపాడేందుకు పనిచేస్తాయి.. అందుకే పుదీనాను సహజ ఔషధ మొక్కగా పేర్కొంటారు. పుదీనాను పురాతన కాలం నుంచి ఆయుర్వేద, గృహ నివారణలలో ఒకటిగా ఉపయోగిస్తున్నారు. దీని ప్రభావం చల్లదనాన్ని కలిగిస్తుంది.. ఇది రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పుదీనా శరీరాన్ని చల్లబరచడంలో సహాయపడుతుంది.. కాబట్టి, వేసవి కాలంలో దీనిని ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. పుదీనాలో ఫైబర్ తోపాటు పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, భాస్వరం, విటమిన్ సి, ఐరన్, విటమిన్ ఎ ఉన్నాయి. పుదీనాలోని యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు క్యాన్సర్ అభివృద్ధి కారకాలను నిరోధిస్తాయి. పుదీనా రోగనిరోధక శక్తిని సైతం పెంచుతుంది. అందుకే.. పుదీనాను క్రమం తప్పకుండా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రోజూ ఉదయాన్నే కనీసం 5-6 ఆకులైనా నమిలి తినాలని సూచిస్తున్నారు.

పుదీనా తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

  1. జీర్ణ సమస్యలు దూరం: జీర్ణక్రియను మెరుగుపరచడంలో పుదీనా చాలా సహాయపడుతుందని అనేక పరిశోధనలలో ప్రస్తావించారు. ఇందులో ఉండే మెంథాల్ గ్యాస్, అజీర్ణం, అసిడిటీ వంటి కడుపు సమస్యలను తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా, ఆకలిని కూడా పెంచుతుంది. తరచుగా పుదీనా చట్నీ, పుదీనా నీరు లేదా పుదీనా టీ తీసుకోవడం వల్ల కడుపు సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
  2. తలనొప్పి నుంచి ఉపశమనం: పుదీనా చల్లదనాన్ని అందిస్తుంది.. ఇది ఒత్తిడి, తలనొప్పి నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. తలకు పుదీనా నూనె రాసుకోవడం వల్ల మైగ్రేన్ వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇది కాకుండా, పుదీనా టీ తాగడం వల్ల శరీరానికి, మనసుకు ప్రశాంతత లభిస్తుంది.
  3. జలుబు – దగ్గు నుంచి ఉపశమనం: పుదీనాలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. పుదీనాను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జలుబు, ఇతర ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు.
  4. మొటిమల సమస్య దూరం: చర్మ సంబంధిత సమస్యలను తొలగించడంలో పుదీనా కూడా ప్రభావవంతంగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమలను తగ్గించడంలో, చర్మాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి. పుదీనా రసం లేదా ఫేస్ ప్యాక్ ను ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖం తాజాగా ఉంచడంతోపాటు.. చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.
  5. బరువు తగ్గుతుంది: బరువు తగ్గించడంలో కూడా పుదీనా సహాయపడుతుంది. ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది.. తద్వారా కేలరీలను బర్న్ చేసే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అంతేకాకుండా, ఇది చాలా సేపు కడుపు నిండినట్లు అనిపిస్తుంది.. తద్వారా తరచుగా తినాలనే కోరిక తగ్గుతుంది.
  6. మౌత్ ఫ్రెషనర్ : పుదీనా సహజ మౌత్ ఫ్రెషనర్‌గా కూడా పనిచేస్తుంది. దీని రిఫ్రెషింగ్ సువాసన దుర్వాసనను తొలగించడంలో సహాయపడుతుంది. దీని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు నోటి నుండి బ్యాక్టీరియాను తొలగించి, శ్వాసను తాజాగా ఉంచుతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..