Washing Machine: చాలామంది ఇప్పుడు బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్ ఉపయోగిస్తున్నారు. చేతులతో పిండటం తక్కువైపోయింది. గతంలో వాషింగ్ మెషన్ ధరలు కూడా విపరీతంగా ఉండేవి. కానీ మారిన కాలానికి అనుగుణంగా ధరలు కూడా దిగివచ్చాయి. అంతేకాదు వాయిదాలలో కూడా చెల్లించవచ్చు. దీంతో సామాన్యులు కూడా వాషింగ్ మెషన్‌లు కొనడానికి మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగం చేసేవారు తప్పనిసరిగా వాడుతున్నారు. సమయం కలిసివస్తుందని, పని సులువుగా అవుతుందని భావిస్తున్నారు. అయితే వాషింగ్ మెషన్ ద్వారా బట్టలు ఉతుకుతున్నప్పటికీ కొందరు తెలియక తప్పులు చేస్తున్నారు. వాటివల్ల మెషన్ రిపేర్ రావడం, బట్టలు చినిగిపోవడం జరుగుతున్నాయి. ఇలాంటి తప్పులు జరగకూడదంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి. వాటి గురించి ఒక్కసారి తెలుసుకుందాం.
వాస్తవానికి చాలామందికి వాషింగ్ మెషీన్ ఎలా ఉపయోగించాలో తెలియదు. కొన్నిసార్లు అజాగ్రత్త వల్ల మంచి దుస్తులు కూడా పాడవుతాయి. వాషింగ్ మెషీన్‌లో సామర్థ్యం కంటే ఎప్పుడు ఎక్కువ బట్టలు వేయకూడదు. బట్టలను విభజించి ఉతకడానికి ప్రయత్నిస్తే మంచిది. చాలా మురికి బట్టలు, తక్కువ మురికి బట్టలు, తెల్లని బట్టలు, కొత్త బట్టలు ఇలా వేరు చేసి ఉతికితే మెషిన్ బాగుంటుంది అలాగే దుస్తులు కూడా మన్నికగా ఉంటాయి. ముఖ్యంగా తెల్లటి దుస్తులను పాత బట్టలతో ఎప్పుడూ కలిపి ఉతకవద్దు. చాలాసార్లు కొత్త బట్టల రంగు పోతుంది దీని వల్ల పాత బట్టలు రంగు మారవచ్చు.
అలాగే వాషింగ్ మెషీన్‌లో నీరు పెట్టేటప్పుడు అందులో సర్ఫ్ వేసి బట్టలు వేస్తాము. బదులుగా సర్ఫ్ నీటిలో పూర్తిగా కరిగించి ఆ నురుగులో బట్టలు వేస్తే మంచిది. తద్వారా బట్టలు బాగా శుభ్రం అవుతాయి. వాటికి సర్ఫ్ మరకలు ఉండవు. జాకెట్, ప్యాంటు లేదా టీ షర్టు వంటి జిప్ ఉన్న బట్టలు ఉతికేటప్పుడు జిప్‌ను మూసివేసి అందులో వేయాలి. లేదంటే మెషీన్ డ్రమ్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. కొత్త బట్టను మొదటిసారి వాషింగ్ మెషీన్‌లో ఉంచి ఆ తర్వాత శుభ్రమైన నీటిలో పిండాలి. ఎందుకంటే వాటి రంగు పోతుంది. వస్త్రం రంగు బయటకు వస్తే మెషిన్ కూడా కడగాలి. చాలా మంది ప్రజలు బట్టలు ఆరబెట్టడానికి ఎక్కువసేపు డ్రైయర్‌ని ఉపయోగిస్తారు. ఇలా చేయడం ద్వారా ఫాబ్రిక్ త్వరలో పాడయ్యే అవకాశం ఉంటుంది. బదులుగా బట్టలు సూర్యకాంతి, గాలిలో ఆరబెడితే మంచిది.