Viral Video: ఘోర ప్రమాదం..! ట్రక్కును ఢీ కొట్టిన రైలు.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు..
Viral Video: అమెరికాలో రైల్వే క్రాసింగ్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన రైలు ఒక ట్రక్కును బలంగా ఢీ కొట్టింది. దీంతో ట్రక్కు గాల్లోకి ఎగిరి
Viral Video: అమెరికాలో రైల్వే క్రాసింగ్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన రైలు ఒక ట్రక్కును బలంగా ఢీ కొట్టింది. దీంతో ట్రక్కు గాల్లోకి ఎగిరి ముక్కలుగా ముక్కలుగా కిందపడింది. ఈ వీడియో చాలా ప్రమాదకరంగా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. పదే పదే చూస్తూ లైక్స్, కామెంట్స్ చేస్తున్నారు. అమెరికాలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరగుతాయా.. అని ప్రశ్నిస్తున్నారు.
వీడియోలో మొదటగా రైల్వే క్రాసింగ్ వద్ద లోడ్‌తో ఉన్న ఒక ట్రక్కు ఇరుక్కుపోవడం చూడవచ్చు. ఎరుపు లైట్లు వెలుగుతూ ఉంటాయి. ఇంతలో పట్టాలు తప్పిన రైలు వేగంగా వచ్చి ట్రక్కును బలంగా ఢీ కొడుతుంది. దీంతో ట్రక్కు గాల్లోకి ఎగరడం మనం వీడియోలో గమనించవచ్చు. ట్రక్కు ముక్కలు ముక్కలుగా మారి కిందపడుతుంది. ఈ సంఘటన శుక్రవారం అమెరికాలోని ఓక్లహోమాలోని థాకర్‌విల్లేలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
వాస్తవానికి ట్రక్కు అధిక లోడ్ కారణంగా ట్రాక్ గుండా వెళ్లలేకపోయింది. అక్కడే ఇరుక్కుపోయింది. కానీ ఇంతలో ఇలా జరుగుతుంది. వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు వారి స్పందనను తెలియజేస్తున్నారు. ఒక వినియోగదారు పాపం ట్రక్కు యజమాని బాగా నష్టపోయి ఉంటాడని సానుభూతి వ్యక్తం చేశారు. మరికొందరు సమయానికి ట్రక్కులో ఎవరూలేకపోవడం మంచిదైందని అంటున్నారు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత అధికారులు సంఘటన స్థలానికి వచ్చి జరిగిన ఆస్తి నష్టాన్ని అంచనా వేసే పనిలో పడ్డారు.