గాజు గ్లాసులో నీళ్లు తాగడం వల్ల అద్భుత ప్రయోజనాలు..! తెలిస్తే అస్సలు వదలరు..
Glass Water Benefits: సాధారణంగా ఇళ్లలో నీళ్లు తాగడానికి స్టీల్ గ్లాస్, లేదా ప్లాస్టిక్ బాటిల్ వాడుతారు. కానీ ఇవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
Glass Water Benefits: సాధారణంగా ఇళ్లలో నీళ్లు తాగడానికి స్టీల్ గ్లాస్, లేదా ప్లాస్టిక్ బాటిల్ వాడుతారు. కానీ ఇవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కానీ ఇంట్లో గాజు గ్లాసులు కూడా ఉంటాయి. వీటిని ఎప్పుడు ఉపయోగించరు. ఎందుకంటే ఇవి కిందపడితే పగిలిపోతాయని భయపడుతారు. అందుకే ఎక్కువగా వినియోగించరు. ఏ పండుగ సమయంలో కానీ ఇంటికి ఎప్పుడైనా అతిథులు వచ్చినప్పుడు కానీ వాడుతారు. అయితే గాజు గ్లాసులో నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఉపయోగాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు.
1. వాసన రాదు గాజు గ్లాసులోని నీరు వాసన రాదు. శుభ్రంగా ఉంటాయి. కానీ స్టీల్ గ్లాసు, ప్లాస్టిక్ గ్లాసులలో నీరు ఎక్కువ సమయం ఉంటే వాసన వచ్చే అవకాశం ఉంటుంది.
2. రసాయనాలు ఉండవు గాజు గ్లాసులో ఎటువంటి రసాయనాలు ఉండవు. కానీ ప్లాస్టిక్ గ్లాసు కానీ బాటిల్ కానీ ఉపయోగిస్తే కరిగిన ప్లాస్టిక్ శరీరంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అందుకే వీటిని వాడకూడదు.
3. నీటి శుభ్రత గాజు గ్లాసులో నీరు ఎంత శుభ్రంగా ఉందో ఇట్టే తెలిసిపోతుంది. కానీ ప్లాస్టిక్, స్టీల్ గ్లాసులో మనం గుర్తించలేము. చాలామంది గమనించక మురికి నీరు తాగిన సందర్భాలు కూడా ఉన్నాయి.
4. ఉష్ణోగ్రతలో మార్పు నీటిని ప్లాస్టిక్, స్టీల్ గ్లాసులలో ఉంచితే వీటి ఉష్ణోగ్రతలో మార్పు ఉంటుంది. కానీ గాజు గ్లాసులో ఇది జరగదు. ఎందుకంటే గాజు సీసాలు నీటి ఉష్ణోగ్రతను ఎక్కువసేపు చల్లగా ఉంచుతాయి.
5. మంచి అనుభూతి గాజు గ్లాసులోని నీరు తాగితే మంచి అనుభూతి దొరుకుతుంది. నీటి రుచిని ఆస్వాదించవచ్చు. ఒకవేళ నీరు తేడాగా ఉన్నా తెలిసిపోతుంది.