Health Tips: జీర్ణవ్యవస్థ బలంగా ఉండాలంటే.. ఈ చిట్కాలు పాటించండి..
Digestive System Healthy Tips: ఉరుకులు పరుగుల జీవితంలో.. సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల జీర్ణవ్యవస్థ పూర్తిగా దెబ్బతింటోంది. దీనివల్ల ఉదర ఇబ్బందులతో పాటు ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొన్ని చిట్కాలను పాటిస్తే జీర్ణ వ్యవస్థను.. మెరుగుపర్చుకొని ఆరోగ్యంగా ఉండవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. జీర్ణ సంబంధిత సమస్యలతో పోరాడటానికి కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే ఆరోగ్యవంతంగా ఉండొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Oct 22, 2021 | 9:02 PM

వేడి ఆహారాన్ని తినాలి: వేడిగా తాజాగా ఉన్న ఆహారం శరీరంలో సులభంగా జీర్ణమవుతుంది. ఫ్రిజ్‌లో ఉంచిన చల్లని ఆహారం మీ జీర్ణశక్తిని తగ్గిస్తుంది. దీని కారణంగా జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలు ఎదురవుతాయి.

ఆకలితో ఉన్నప్పుడు తినాలి: ఆకలిగా ఉన్నప్పుడు భోజనం, స్నాక్స్ లాంటివి తినాలి. అయితే.. ఆరోగ్యకరమైన, పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవాలి. ఎక్కువగా తినకూడదు. ఆకలి స్థాయికి అనుగుణంగా ఆహార పదార్థాలను తీసుకోవాలి. దీంతో ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.

ఆహారాన్ని బాగా నమలాలి: ఆహారాన్ని సరిగ్గా పూర్తిస్థాయిలో నమలుతూ తినాలి. ఆహారాన్ని సరిగ్గా నమలడం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది.

హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకోవాలి: తక్కువ నీరు తాగడం వల్ల మలబద్ధకం, తలనొప్పి, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. కావున మీరు హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. దీంతో జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి బయటపడవచ్చు.





























