Mushrooms benifits: పుట్ట గొడుగులతో ఇన్ని ప్రయోజనాలా.. వదిలేదే ల్యా..! ఒత్తిడిని తగ్గించే పుట్టగొడుగులు.. (వీడియో)

పుట్టగొడగులు…ఆరోగ్యానికి చాలా మంచివి.. అనారోగ్య సమస్యలను తగ్గించడమే కాకుండా… శరీరానికి కావాల్సిన రోగ నిరోధక శక్తిని అందిస్తాయి. వీటితో రకరకాల వంటలను చేసుకోవచ్చు.. ఫంగస్ జాతికి చెందిన పుట్టగొడుగులు.

Mushrooms benifits: పుట్ట గొడుగులతో ఇన్ని ప్రయోజనాలా.. వదిలేదే ల్యా..!  ఒత్తిడిని తగ్గించే పుట్టగొడుగులు.. (వీడియో)

|

Updated on: Oct 23, 2021 | 8:31 AM

పుట్టగొడగులు…ఆరోగ్యానికి చాలా మంచివి.. అనారోగ్య సమస్యలను తగ్గించడమే కాకుండా… శరీరానికి కావాల్సిన రోగ నిరోధక శక్తిని అందిస్తాయి. వీటితో రకరకాల వంటలను చేసుకోవచ్చు.. ఫంగస్ జాతికి చెందిన పుట్టగొడుగులు. శాకాహార ప్రియులకు ఇష్టమైన ఫుడ్. ఇందులో ఉండే యాంటీ ఇన్‏ఫ్లామేటరీ గుణాలు శరీంపై వచ్చే వాపులను తగ్గిస్తాయి. అలాగే అధిక బరువు, డయాబెటిస్, గుండె జబ్బులను నియంత్రిస్తాయి. అంతేకాదు.. పుట్టగొడుగులు ఒత్తిడి, ఆందోళన తగ్గించడంలో దిట్ట. పెన్ స్టేట్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు.. 2400 మంది ఆహారం, ఆరోగ్య డేటాను విశ్లేషించి పుట్టగొడుగులు తినే వ్యక్తుల్లో డిప్రెషన్‌, ఒత్తిడి లాంటి లక్షణాలు తక్కువగా ఉన్నట్లుగా నిరూపించారు..
పుట్టగొడుగులను తినడం వల్ల అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయన్నారు ప్రముఖ పరిశోధకుడు డాక్టర్ జాషువా మస్కట్. పుట్టగొడుగులలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ అమైనో ఆమ్లాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయన్నారువీటిలో ఉండే అధిక స్థాయి ఎర్గోథియోనిన్.. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుందని తెలిపారు.. ఇక గత అధ్యయనాలు కూడా పుట్టగొడుగుల వినియోగంవల్ల స్కిజోఫ్రెనియా ప్రమాదాన్ని తగ్గిస్తుందని తెలిపాయి.. మరో అధ్యయనంలో పుట్టగొడుగులలో సైలోసిబిన్ అనే సమ్మేళనం ఉన్నట్లు తెల్చారు. ఇది మెదడులోని న్యూరాన్ కనెక్టివిటీని 10 శాతం పెంచుతుందట. అలాగే పుట్టగొడుగులలో ఉండే సెలీనియం, ఎర్గోథియోనిన్ అనే మూలకాలు క్యాన్సర్‌తో పోరాడడంలో బాగా పనిచేస్తాయట. విటమిన్ ఎ, బి , సి కూడా పుట్టగొడుగులలో పుష్కలంగా ఉంటాయి. ఇవి వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. ఇంకా పుట్టగొడుగుల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని కాపాడుతాయి.

మరిన్ని చదవండి ఇక్కడ: Jr.NTR-Lakshmi Pranathi: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?(ఫొటోస్)

Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)

Thousands years old Jellyfish: వీటి వయసు వందల వేల ఏళ్లు..! మరణమే లేని జెల్లీ ఫిష్‌లు.. (వీడియో)

Follow us