Double Chin: డబుల్ చిన్ సమస్యతో బాధపడుతున్నారా.? అయితే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి, ఫలితం పక్కాగా ఉంటుంది.
Double Chin: డబుల్ చిన్ ఇది చాలా మంది ఎదుర్కొనే సమస్య. మెడ కింద కొవ్వులాంటి పదార్థం పేరుకుపోవడం కారణంగా దవడ కింద మరో దవడ ఉన్నట్లు కనిపిస్తుంది...
Double Chin: డబుల్ చిన్ ఇది చాలా మంది ఎదుర్కొనే సమస్య. మెడ కింద కొవ్వులాంటి పదార్థం పేరుకుపోవడం కారణంగా దవడ కింద మరో దవడ ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది అందానికి అడ్డంగా మారుతుంది. డబుల్ చిన్ సమస్యతో బయటకు వెళ్లాంటే ఇబ్బంది పడుతుంటారు. మరి డబుల్ చిన్ సమస్యను చిన్న చిన్న వ్యాయామాలతో చెక్ పెట్టవచ్చనే విషయం మీకు తెలుసా.? మీరు ఎలాంటి పనిలో ఉన్నా సరే రోజులో కొంత సేపు ఈ సింపుల్ టిక్స్ ఫాలో అవుతే డబుల్ చిన్ సమస్యను కొద్ది సమయంలోనే చెక్ పెట్టొచ్చు. మరి ఆ ఫేషియల్ ఎక్సర్‌సైజ్‌లు ఏంటి? ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
జా రొటేషన్ (దవడ వ్యాయామం)..
ఇందులో భాగంగా దవడను విభిన్న కోణాల్లో తిప్పాల్సి ఉంటుంది. ముందుగా దవడను ముందుకు సాగదీయాలి అనంతరం.. దవడను ఎడవవైపు తిప్పాలి మళ్లీ వెనక్కి అని కుడివైపు తిప్పాలి. ఇదే విధానాన్ని పలుమార్లు చేయాలి. ఇలా చేయడం వల్ల డబుల్ చిన్ సమస్య త్వరగా తగ్గిపోతుంది.
గాలిలో ముద్దుపెట్డం..
ఈ వ్యాయామం కోసం ముందుగా నిటారుగా నిలబడాలి. అనంతరం తలను పైకి చాపి గాలిలో ముద్దాడాలి. ఇలా పది సెకండ్ల పాటు ఉండడానికి ప్రయత్నించాలి. దీన్ని కనీసం ఐదు సార్లు చేయాలి. అయితే ఈ సమయంలో మీ మెడపై ప్రభావం పడకుండా చూసుకోవాలి.
బాల్ వ్యాయామం..
ముందుగా మెడ, దవడ మధ్యలో సరిపోయే ఒక చిన్న బంతిని తీసుకోవాలి. అనంతరం ఆ బంతిని దవడంతో కిందికి నొక్కాలి. ఇలా పది సెకండ్లపాటు ఉంటూ ఇదే ప్రాసెస్‌ను రిపీట్ చేయాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది.
నాలుకతో ముక్కును తాకడం..
ఇందుకోసం ముందుగా కంఫర్టబుల్ పొజిషన్‌లో కూర్చోవాలి. తర్వాత నోటిని తెరిచి నాలుకను వీలైనంత ముందుకు లాగాలి. తర్వాత పైకి లేపి ముక్కును తాకేందుకు ప్రయత్నించాలి. నాలుకను వీలైనంత పైకి తీసుకెళ్లి 5 సెకండ్లపాటు అలాగే ఉంచడానికి ప్రయత్నించాలి. ఇలా రోజుకు 10 సార్లు రిపీట్ చేస్తే డబుల్ చిన్ సమస్య దూరమవుతుంది.
నోటిని పెద్దగా తెరవడం..
ఈ విధానంలో నోటిని పెద్దగా తెరవాలి. నోటితోపాటు ముక్కు రంద్రాలను కూడా పెద్దగా తెరవాలి. ఐదు సెకండ్లపాటు ఇలా చేసి నోటిని మూయాలి. ఇలా రోజుకు 10 సార్లు చేస్తే డబుల్ చిన్ సమస్య త్వరలోనే నయమవుతుంది.
Mumbai News: నిద్ర మత్తులో టూత్‌పేస్టుకు బదులు ఎలుకల మందుతో పళ్ళు తోముకున్న యువతి.. చివరకు..
Belly Fat: వ్యాయామం చేయకుండా బెల్లీఫ్యాట్ కరగాలంటే ఈ 5 విషయాలు తెలుసుకోండి..!