Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai News: నిద్ర మత్తులో టూత్‌పేస్టుకు బదులు ఎలుకల మందుతో పళ్ళు తోముకున్న యువతి.. చివరకు..

Mumbai Girl: నిద్ర లేచిన వెంటనే నిద్ర మత్తులో టూత్ బ్రష్ పై టూత్ పేస్టుకు బదులు .. ఫెవికాల్ , షేవింగ్ క్రీమ్ లు పెట్టుకునే సీన్లను సరదాగా సినిమాల్లో చూస్తాం.. అయితే ఓ యువతి నిద్రమత్తులో టూత్ పేస్టుకు బదులుగా..

Mumbai News: నిద్ర మత్తులో టూత్‌పేస్టుకు బదులు ఎలుకల మందుతో పళ్ళు తోముకున్న యువతి.. చివరకు..
Toothpaste
Follow us
Surya Kala

|

Updated on: Sep 14, 2021 | 3:56 PM

Mumbai Girl: నిద్ర లేచిన వెంటనే నిద్ర మత్తులో టూత్ బ్రష్ పై టూత్ పేస్టుకు బదులు .. ఫెవికాల్ , షేవింగ్ క్రీమ్ లు పెట్టుకునే సీన్లను సరదాగా సినిమాల్లో చూస్తాం.. అయితే ఓ యువతి నిద్రమత్తులో టూత్ పేస్టుకు బదులుగా రాట్ పాయిజన్ పెట్టుకుని పళ్ళు తోముకుని ప్రాణాలు పోగొట్టుకుంది.  ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ముంబై ధారావికి చెందిన 18 ఏళ్ల యువతి టూత్‌పేస్ట్‌ అనుకుని  ఎలుకల విషంతో పళ్ళు తోముకోవడంతో ఆదివారం మరణించింది. సెప్టెంబర్ 3 ఉదయం 10 గంటల సమయంలో అఫ్సానా ఖాన్ ఎప్పటిలాగే నిద్రలేచింది. కొంచెం మగతలో అఫ్సానా ఖాన్ పళ్ళు తోముకోవడానికి  వెళ్ళింది. నిద్ర మబ్బులో ఆమె పొరపాటున టూత్‌పేస్ట్ ట్యూబ్ పక్కన ఉంచిన ఎలుక పాయిజన్ క్రీమ్ ట్యూబ్‌ను తీసుకొని దానిని టూత్ పేస్టుగా పెట్టుకుంది. తర్వాత పళ్ళు తోముకుంది.

అయితే అఫ్సానా ఖాన్ కు రుచి , వాసనలో తేడా తెలిసింది. పేస్ట్‌ని ఉమ్మి, నోరు బాగా శుభ్రం చేసుకుంది. కొంచెం పర్వాలేదు అనుకున్న తర్వాత తన సాధారణ దినచర్యను కొనసాగించింది. అయితే కొంతకాలం తర్వాత ఆమెకి మైకంగా అనిపించడం, కడుపు నొప్పి వంటి ఇబ్బందులు తలెత్తాయి. అయితే ఈ విషయం కుటుంబం సభ్యులకు చెబితే.. తనను ఎక్కడ తిడతారో అని భయంతో.. తనకు తోచిన ముందుకు కొనుక్కుని వాడుతూనే ఉంది. అయితే ఎలాంటి ఉపశమనం లభించలేదు. అంతేకాదు ఆమె రోజు రోజుకీ ఆమె ఆరోగ్య పరిస్థితి దిగజారింది. దీంతో కుటుంబ సభ్యులు మూడు ప్రైవేట్ ఆసుపత్రులకు, తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకుని వెళ్లారు.

రోజు రోజుకీ తన ఆరోగ్యం క్షిణించడంతో చివరకు సెప్టెంబర్ 12 న తాను పొరపాటున ఎలుకల మందుతో పళ్ళు తోముకున్న విషయాన్ని కుటుంబ సభ్యులకు చెపింది. దీంతో వెంటనే అఫ్సానాను సర్ జెజె ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు.  అయితే అప్పటికే ఆలస్యం అయ్యింది. అఫ్సానాను రక్షించడానికి వైద్యులు ఎన్ని ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది  దీంతో కుటుంబతో పాటు స్థానికంగా విషాదం నెలకొంది. వైద్యులు విషం కారణంగానే అఫ్సానామరణించినట్లు నిర్ధారించారు. ధారావి పోలీస్ స్టేషన్ ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం నమూనా సేకరించింది. వెంటనే, ఈ సంఘటనపై పోలీసులు ఆమె కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేశారు. ప్రమాదవశాత్తు మరణించిందని ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు. తదుపరి విచారణ కొనసాగుతోందని ఒక పోలీసు అధికారి తెలిపారు.

Also Read:  కొబ్బరి బోండాలోని నీరు తాగి.. కొబ్బరి పడేస్తున్నారా.. అది తింటే కలిగే ఆరోగ్య ప్రయోజలు ఎన్నో..