AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anant Ambani Weight Loss Journey: అనంత్ అంబానీ కఠినమైన డైట్.. ఏకంగా 108 కిలోలు తగ్గాడా..

అనంత్ అంబానీ బరువు తగ్గడానికి సహాయం చేసిన వ్యక్తి.. సెలబ్రిటీ ఫిట్‌నెస్ ట్రైనర్ వినోద్ చన్నా. అనంత్‌కు కఠినమైన ఆహార, వ్యాయామ డైట్‌ను సూచించడం వల్ల.. కేవలం 18 నెలల్లోనే అనంత్ అంబానీ 108 కిలోల బరువు తగ్గాడు . అనంత్ అంబానీ ఫుడ్ డైట్‌ గురించి వినోద్ చన్నా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అనంత్ తన బరువును తగ్గించడానికి కట్టుబడి ఉన్నాడు. అయితే అతనికి అతిగా జంక్ ఫుడ్ తినే అలవాటు ఉందని.. దీంతో అంత సులభంగా బరువు తగ్గే ప్రక్రియ..

Anant Ambani Weight Loss Journey: అనంత్ అంబానీ కఠినమైన డైట్.. ఏకంగా 108 కిలోలు తగ్గాడా..
Anant Ambani Weight Loss
Chinni Enni
|

Updated on: Feb 27, 2024 | 1:22 PM

Share

రిలయన్స్ కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈ దిగ్గజ వ్యాపారవేత్త కుమారుడు అనంత్ అంబానీ మరి కొద్ది రోజుల్లోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. రాధికా మర్చంట్‌ను త్వరలోనే వివాహం చేసుకోబోతున్నాడు. మార్చి 1వ తేదీ నుంచి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలు కానున్నాయి. గుజరాత్ జామ్ నగ్‌లోని గ్రాండ్ రిలయన్స్ గ్రీన్స్ కాంప్లెక్స్‌లో ఈ వేడుక జరగనుంది. ఈ వేడుకకు వందలాది మంది అంతర్జాతీయ ప్రముఖులు కూడా హాజరు కాబోతున్నారు. గత ఏడాది ముంబైలో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ఎంగేజ్‌మెంట్ ఘనంగా జరిగింది. ఈ విషయం పక్కన పెడితే.. అనంత్ అంబానీ బరువు తగ్గడం, ఆ తర్వాత పెరగడం గురించి పలు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అనంత్ అంబానీ కొద్ది నెలల్లోనే 108 కిలోలు ఎలా తగ్గడాని ప్రజలు షాక్‌కి గురవుతున్నారు.

అనంత్ అంబానీకి కఠినమైన డైట్..

అనంత్ అంబానీ బరువు తగ్గడానికి సహాయం చేసిన వ్యక్తి.. సెలబ్రిటీ ఫిట్‌నెస్ ట్రైనర్ వినోద్ చన్నా. అనంత్‌కు కఠినమైన ఆహార, వ్యాయామ డైట్‌ను సూచించడం వల్ల.. కేవలం 18 నెలల్లోనే అనంత్ అంబానీ 108 కిలోల బరువు తగ్గాడు . అనంత్ అంబానీ ఫుడ్ డైట్‌ గురించి వినోద్ చన్నా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అనంత్ తన బరువును తగ్గించడానికి కట్టుబడి ఉన్నాడు. అయితే అతనికి అతిగా జంక్ ఫుడ్ తినే అలవాటు ఉందని.. దీంతో అంత సులభంగా బరువు తగ్గే ప్రక్రియ కాదని వినోద్ చన్నా అన్నారు. అనంత్ అంబానీ కోసం అధిక ప్రోటీన్, అధిక ఫైబర్, తక్కువ కార్బ్ ఉన్న ఆహారాలతో అతనికి ప్రత్యేక ఆహార ప్రణాళిక రూపొందించినట్లు వినోద్ చెప్పారు.

ఇవి కూడా చదవండి

అనంత్ డైట్‌లో ఉండేవి ఇవే..

అనంత్ డైట్‌లో కూరగాయలు, మొలకలు, కాటేజ్ చీజ్, కాయ ధాన్యాలు, పప్పులు, కొద్దిగా నెయ్యి ఉంటాయని తెలిపారు. అలాగే అనంత్ అంబానీ కూడా బరువు తగ్గడం కోసం జంక్ ఫుడ్ మానేసి.. కఠినమైన శాకాహారాన్ని అనుసరించాడు. అంతే కాకుండా తగినంత నిద్ర, అతని లైఫ్‌ స్టైల్‌పై కూడా దృష్టి పెట్టడం ద్వారా బరువు తగ్గేందుకు హెల్ప్ అయిందని సూచించారు. కాగా ఇక వినోద్ చన్నా విషయానికి వస్తే.. అనంత్ అంబానీతో పాటు, అతను నీతా అంబానీ, కుమార్ మంగళం బిర్లా, అనన్య బిర్లా, జాన్ అబ్రహం, శిల్పా శెట్టి కుంద్రా, హర్షవర్ధన్ రాణే, వివేక్ ఒబెరాయ్, అర్జున్ రాంపాల్‌తో సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులకు ఫిట్‌నెస్ ట్రైనర్‌గా ఉన్నారు.