Star anise: ఇది ఫ్లవర్ కాదండోయ్.. పవర్ ఫుల్ మెడిసిన్..! ఎన్ని లాభాలో తెలిస్తే..
అనాస పువ్వు (స్టార్ పువ్వు) వంటలకు రుచినివ్వడమే కాకుండా, అద్భుత ఆరోగ్య ప్రయోజనాలనిస్తుంది. ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. యాంటీవైరల్, యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలతో రోగనిరోధక శక్తిని పెంచి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రిస్తుంది. పీరియడ్స్ సమస్యలు, చర్మ సౌందర్యానికి కూడా మేలు చేస్తుంది.

అనాస పువ్వు .. ఇది ఒకరకమైన సుగంధ ద్రవ్యం.. ప్రతి వంటింట్లోనూ తప్పనిసరిగా ఉంటుంది. దీనినే స్టార్ పువ్వు అని కూడా అంటారు. ఇది వంటలకు రుచిని ఇవ్వడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలనూ అందిస్తుంది. ముఖ్యంగా మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. పేగు కండరాల కదలికలను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్యను దరిచేరకుండా చేస్తుంది. అనాస పువ్వును తరచూగా తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం…
అనాస పువ్వులో యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. జీర్ణశక్తిని పెంపొందించడంలో అనాస పువ్వు సహాయపడుతుంది. కడుపులో గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలను సమర్థవంతంగా తగ్గిస్తుంది. అనాస పువ్వు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. రక్తాన్ని శుద్ధి చేసి గుండెకు రక్త ప్రసరణను మెరుగుపర్చడం ద్వారా హృదయ సంబంధ వ్యాధులు రాకుండా కాపాడుతుంది.
రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడంలో అనాస పువ్వు ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీనివల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. మూత్రనాళ ఇన్ఫెక్షన్‌తో బాధపడేవారు అనాస పువ్వును తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఇన్ఫెక్షన్లు రాకుండా నివారిస్తాయి. మహిళల్లో పీరియడ్స్ సమయంలో వచ్చే హార్మోన్ల అసమతుల్యతను తగ్గించడంలో అనాస పువ్వు ఉపయోగపడుతుంది. నెలసరి సమయంలో వచ్చే నొప్పులను కూడా తగ్గిస్తుంది. అనాస పువ్వులోని యాంటీఆక్సిడెంట్లు అనేక రకాల ఇన్పెక్షన్ల నుంచి చర్మాన్ని కాపాడతాయి. చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




