Almond with honey: బాదంతో తేనె కలుపుకుని తింటే ఎన్ని లాభాలో తెలుసా..? ఇలాంటి వంద రోగాలకు ఇదే మందు..!
మనకు ఎన్నో రకాల డ్రై ఫ్రూట్స్ అందుబాటులో ఉన్నాయి. అన్నింటిలో బాదం పప్పుకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇందులో ఫైబర్‌తో పాటుగా ఆరోగ్యకరమైన కొవ్వులు ఇతర అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అవి విటమిన్ E కి మంచి మూలం కూడా. ఇది మీ కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. బాదంలో కాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం వంటి పోషకాలు కూడా ఉంటాయి. ఇవి శరీరం బాగా పనిచేయడానికి అవసరం.

అధ్యయనాల ప్రకారం, బాదం పప్పులో వివిధ రకాల పోషకాలు నిండివున్నాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, ఫైబర్ మొదలైనవి పుష్కలంగా లభిస్తాయి. కేవలం కొన్ని బాదంపప్పులు ఒక వ్యక్తి రోజువారీ ప్రోటీన్ అవసరాలలో ఎనిమిదో వంతు కలిగి ఉంటాయి. చాలా మంది బాదంపప్పును పచ్చిగా లేదా నానబెట్టి తినడానికి ఇష్టపడతారు. కానీ బాదంపప్పును తేనెతో కలిపి తీసుకోవడం వల్ల మీకు మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయని మీకు తెలుసా.
బాదం లాగే, తేనె కూడా ఆరోగ్యానికి ఔషధ నిధి అంటారు.. తేనెను చాలా సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. తేనె అనేక ఆరోగ్య ప్రయోజనాలను, ఔషధ ఉపయోగాలను కలిగి ఉంది. తేనె యాంటీఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తుంది. యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్ నష్టం నుండి రక్షిస్తాయి.
తేనె బ్యాక్టీరియా, ఫంగస్‌లను చంపగలదని పరిశోధనలో తేలింది. ఇందులో సహజంగా లభించే హైడ్రోజన్ పెరాక్సైడ్, ఒక క్రిమినాశక మందు ఉంటుంది. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్‌గా కూడా పనిచేస్తుంది. తేనె జీర్ణక్రియను మెరుగుపరచడంలో, ఫ్లూ లక్షణాలను తగ్గించడంలో, బరువును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. తేనె, బాదం నుండి మరిన్ని ప్రయోజనాలు పొందాలనుకుంటే, మీరు ఉదయం ఖాళీ కడుపుతో ఈ రెండింటినీ కలిపి తినమని నిపుణులు సూచిస్తున్నారు.
తేనె, వేయించిన బాదంపప్పులను కలిపి తినడం వల్ల మీ కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగుపడతాయి. తేనె, బాదం రెండూ గుండె జబ్బులను నివారించడంలో సహాయపడే లక్షణాలను కలిగి ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
చక్కెర అధికంగా తీసుకోవడం వల్ల డయాబెటిస్ వస్తుంది. చక్కెరకు మంచి ప్రత్యామ్నాయం తేనె. తేనె తీసుకోవడం వల్ల బరువు, రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతాయి. బాదంతో తేనె తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి అదుపులో ఉంటుంది. శరీర శక్తి పెరుగుతుంది.
బాదం జింక్, విటమిన్ బి, ఐరన్ వంటి పోషకాలకు నిలయం. తేనె రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఈ మిశ్రమాన్ని తీసుకోవడం ద్వారా మీరు మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు. ఈ మిశ్రమం ఫ్లూ సీజన్‌లో కూడా శరీరాన్ని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.
బాదం, తేనె కలిపి తినడం వల్ల మీ చర్మానికి మేలు జరుగుతుంది. ఈ అద్భుతమైన మిశ్రమం చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బాదంపప్పు పొడి తేనెతో కలిపి తయారుచేసిన ఫేస్ ప్యాక్ చర్మ రంధ్రాలను శుభ్రపరుస్తుంది. చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా చేస్తుంది. దీనివల్ల ముఖంపై మొటిమలు, మచ్చలు, ముడతలు తగ్గుతాయి. మెరుగైన ఫలితాల కోసం మీరు మిశ్రమానికి కొద్దిగా పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..