AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హెల్తీ హెయిర్ కోసం బొప్పాయి హెయిర్ మాస్క్ ను ట్రై చేయండి.. తెల్లజుట్టుకు శాశ్వత పరిష్కారం..!

ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. చుండ్రు నివారణకు కూడా గొప్ప పరిష్కారంగా ఉంటుంది. బొప్పాయి, తలపై కాలుష్యం వంటి అంశాల కారణంగా తలెత్తే చర్మ వ్యాదులని నిరోధించడానికి సహాయపడే ఎంజైమ్స్ కలిగి ఉంటుంది. చిన్న మొత్తంలో ఉపయోగించినప్పుడు నిర్జీవమైన జుట్టుకు జీవాన్నిచ్చే కండిషనర్ వలె పనిచేస్తుంది కూడా. బొప్పాయి తొక్కలు కూడా చాలా మేలు చేస్తాయి.

హెల్తీ హెయిర్ కోసం బొప్పాయి హెయిర్ మాస్క్ ను ట్రై చేయండి.. తెల్లజుట్టుకు శాశ్వత పరిష్కారం..!
Hair Care
Jyothi Gadda
|

Updated on: Sep 13, 2024 | 4:03 PM

Share

తెల్లజుట్టు అనేది చాలా మందిని చిన్న వయసులోనే వేధించే సాధారణ సమస్య. కానీ, కొన్ని ఇంటి నివారణల ద్వారా దీనిని నివారించవచ్చు. జుట్టు సమస్యల నివారణకు బొప్పాయి పండు కూడా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి జుట్టు పెరుగుదల, ఆరోగ్యానికి ప్రోత్సహిస్తుంది. జుట్టును మృదువుగా, మెరిసేలా చేయడంలో ప్రభావంతంగా పనిచేస్తుంది. బొప్పాయిలో, మెగ్నీషియం, రాగి, పొటాషియం, A, C విటమిన్లు, ఇతర పోషకాలను సైతం కలిగి ఉంటుంది. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. చుండ్రు నివారణకు కూడా గొప్ప పరిష్కారంగా ఉంటుంది. బొప్పాయి, తలపై కాలుష్యం వంటి అంశాల కారణంగా తలెత్తే చర్మ వ్యాదులని నిరోధించడానికి సహాయపడే ఎంజైమ్స్ కలిగి ఉంటుంది. చిన్న మొత్తంలో ఉపయోగించినప్పుడు నిర్జీవమైన జుట్టుకు జీవాన్నిచ్చే కండిషనర్ వలె పనిచేస్తుంది కూడా. బొప్పాయి తొక్కలు కూడా చాలా మేలు చేస్తాయి.

బొప్పాయి తొక్కను ఉపయోగించి తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. ఇది జుట్టు మెరుపును పెంచుతుంది. పండిన అరటిపండు, బొప్పాయి తొక్క, రెండు చుక్కల కొబ్బరి నూనె, కాఫీ పొడితో హెయిర్ మాస్క్‌ని తయారు చేసుకోవచ్చు. ఒక విటమిన్-ఇ క్యాప్సూల్‌ను కూడా అందులో వేయాలి. వీటన్నింటిని బాగా మిక్స్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ హెయిర్ మాస్క్ గ్రే హెయిర్‌ను తగ్గించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ హెయిర్ మాస్క్‌ను సిద్ధం చేయడానికి, ముందుగా పండిన అరటిపండును తీసుకోవాలి. బొప్పాయి తొక్కను గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఒక గిన్నెలో అరటిపండు గుజ్జు, బొప్పాయి తొక్క పేస్ట్, కాఫీ పొడి, రెండు చుక్కల కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల దాకా జుట్టుకు అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచండి. తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయండి. తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మారడం ప్రారంభమవుతుంది. ఈ మాస్క్ మీ జుట్టుకు పోషణనిస్తుంది. జుట్టును స్మూత్‌గా మార్చడంతోపాటు జుట్టు రాలే సమస్యను క్రమంగా తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..