Diabetes: డయాబెటిస్ బాధితులు స్వీట్లకే కాదు.. వీటికి కూడా దూరంగా ఉండాలి
డయాబెటిస్ ఒక్కసారి అటాక్ అయ్యిందంటే అంత సులువుగా పూర్తిగా బయటపడడం చాలా కష్టమైన విషయమని తెలిసిందే. అందుకే ఒక్కసారి ఈ వ్యాధి వచ్చిందంటే చాలు జీవనశైలిని పూర్తి మార్చేయాల్సి ఉంటుంది. తీసుకునే ఆహారం మొదలు, జీవన విధానంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. ముఖ్యంగా డయాబెటిస్...
డయాబెటిస్ ఒక్కసారి అటాక్ అయ్యిందంటే అంత సులువుగా పూర్తిగా బయటపడడం చాలా కష్టమైన విషయమని తెలిసిందే. అందుకే ఒక్కసారి ఈ వ్యాధి వచ్చిందంటే చాలు జీవనశైలిని పూర్తి మార్చేయాల్సి ఉంటుంది. తీసుకునే ఆహారం మొదలు, జీవన విధానంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. ముఖ్యంగా డయాబెటిస్ వచ్చిన వారు స్వీట్స్ తీసుకోవడాన్ని పూర్తిగా మార్చేస్తారు. అయితే కేవలం స్వీట్స్ మాత్రమే కాకుండా, ఇతర ఆహార పదార్థాలను తీసుకోవడం కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. స్వీట్స్ మాత్రమే కాకుండా డయాబెటిస్ వ్యాధి గ్రస్తులపై ప్రభావం చూపే మరికొన్ని ఆహారపదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* సాధారణంగా ఉప్పు ఎక్కువగా తీసుకుంటే రక్తపోటు పెరుగుతుందని తెలిసిందే. అయితే ఉప్పు కేవలం బీపీకి మాత్రమే కాకుండా డయాబెటిస్ వ్యాధి గ్రస్తులకు ఇది మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్ లేకపోయినా ఉప్పు తీసుకోవడాన్ని పూర్తిగా తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి వాటికి పూర్తిగా దూరంగా ఉండాలి.
* డయాబెటిస్ వ్యాధితో బాధపడేవారు రిఫైండ్ చేసిన పిండికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఈ పిండి శరీరంలో గ్లూకోజ్ వేగంగా మారడానికి కారణమవుతుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయి గణనీయంగా పెరుగుతుంది. అందుకే ఇలాంటి పిండికి దూరంగా ఉండాలి.
* మధుమేహ వ్యాధితో బాధపడేవారు వేయించిన ఆహారాలకు దూరంగా ఉండాలి. అవి అధిక మొత్తంలో కొవ్వును కలిగి ఉంటాయి, కొవ్వు నెమ్మదిగా జీర్ణమైనప్పుడు, అది రక్తంలో చక్కెరను పెంచుతుంది. ఇది డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు మంచిది కాదు.
* డయాబెటిస్ బాధితులు ఆల్కహాల్‌కు పూర్తిగా దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఎలాంటి ఆహారం తీసుకోకుండా మద్యం సేవిస్తే శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా తగ్గే ప్రమాదం ఉంటుంది. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.
* గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండే పండ్లను తినడం కూడా డయాబెటిస్ బాధితులకు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయ, పైనాపిల్స్‌లో ఎక్కువగా గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండడం మంచిది.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..