AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అల్యూమినియం vs స్టెయిన్‌లెస్ స్టీల్.. మీ ఇంటికి ఏ కుక్కర్ మంచిది? కొనే ముందు ఈ నిజాలు తెలుసుకోండి..

భారతీయ వంటగదిలో ప్రెషర్ కుక్కర్ లేని ఇల్లు ఉండదు. అయితే కొత్త కుక్కర్ కొనేటప్పుడు చాలా మందికి అల్యూమినియం మంచిదా? లేక స్టెయిన్‌లెస్ స్టీల్ మంచిదా? అనే డౌట్ ఉంటుంది. ధర తక్కువని, వంట ఫాస్ట్‌గా అవుతుందని చాలా మంది అల్యూమినియం వైపు మొగ్గు చూపుతారు. కానీ ఆరోగ్య భద్రత విషయానికి వస్తే నిపుణులు చెబుతున్న నిజాలు వేరే ఉన్నాయి.

అల్యూమినియం vs స్టెయిన్‌లెస్ స్టీల్.. మీ ఇంటికి ఏ కుక్కర్ మంచిది? కొనే ముందు ఈ నిజాలు తెలుసుకోండి..
Aluminum Vs Stainless Steel Pressure CookerImage Credit source: AI image
Krishna S
|

Updated on: Jul 10, 2026 | 2:01 PM

Share

భారతీయ వంటగదిలో ప్రెషర్ కుక్కర్ లేని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. నిత్యం వంటను సులభం చేసే ఈ కుక్కర్ విషయంలో చాలా కాలంగా ఒక పెద్ద చర్చ నడుస్తోంది. అదేంటంటే.. అల్యూమినియం కుక్కర్ మంచిదా? లేక స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్కర్ మంచిదా? కొత్తగా ప్రెషర్ కుక్కర్ కొనుగోలు చేసేటప్పుడు చాలా మంది ఈ డౌట్ పడుతుంటారు. మన్నిక, వంట వేగం, బడ్జెట్, అన్నింటికంటే ముఖ్యంగా ఆరోగ్య భద్రత పరంగా ఈ రెండింటి మధ్య ఉన్న కీలకమైన తేడాలు ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

అల్యూమినియం కుక్కర్: బడ్జెట్ ఫ్రెండ్లీ.. వంట చాలా ఫాస్ట్..

భారతదేశంలో ఎక్కువ మంది ఇళ్లలో అల్యూమినియం కుక్కర్లు కనిపిస్తుంటాయి. దీనికి ప్రధాన కారణాలు..

ధర – బరువు: ఇవి బరువులో చాలా తేలికగా ఉంటాయి. స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్కర్లతో పోలిస్తే వీటి ధర చాలా తక్కువ. బడ్జెట్ పరిమితులు ఉన్నవారికి ఇది మొదటి ఎంపిక.

వేగవంతమైన వంట: అల్యూమినియం లోహం వేడిని చాలా వేగంగా ప్రసరింపజేస్తుంది. దీనివల్ల కుక్కర్ త్వరగా వేడెక్కి, లోపల ఆవిరి పీడనం వేగంగా ఏర్పడుతుంది. ఫలితంగా ఉదయం పూట ఉరుకుల పరుగుల మీద వంట చేసేవారికి సమయం ఆదా అవుతుంది.

సమస్యలు ఏంటి?: అల్యూమినియం పాత్రలను క్రమం తప్పకుండా వాడటం వల్ల కొన్ని రోజులకే వాటి లోపలి, బయటి మెరుపు తగ్గిపోతుంది. వీటిపై సులభంగా గీతలు పడతాయి. నల్లటి మొండి మరకలు ఏర్పడతాయి. కొద్దిగా తుప్పు పట్టే అవకాశం కూడా ఉంది.

స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్కర్

దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని చూస్తే స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్కర్లు అత్యుత్తమమైనవిగా నిలుస్తాయి.

బలం – నాణ్యత: ఇవి చాలా బలంగా ఉంటాయి. సంవత్సరాల తరబడి వాడినా సరే మరకలు, గీతలు పడవు. తుప్పు పట్టే ప్రసక్తే ఉండదు. ఎన్ని ఏళ్లయినా కొత్త వాటిలాగే మెరుస్తుంటాయి.

ఈజీ క్లీనింగ్: వీటిని నిర్వహించడం, శుభ్రం చేయడం చాలా సులభం. ఎంత రుద్దినా వీటి ఉపరితలం పాడవుతుందనే భయం ఉండదు. అల్యూమినియంలా ఇవి నల్లగా లేదా మురికిగా మారవు.

ఆధునిక మార్పులు: సాధారణంగా స్టీల్ పాత్రలు వేడెక్కడానికి కొంచెం సమయం పడుతుంది. కానీ, నేటి ఆధునిక స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్కర్లలో వేడి సమానంగా వ్యాపించడం కోసం ప్రత్యేకమైన శాండ్‌విచ్ బేస్‌లను లేదా బరువైన అడుగుభాగాలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల వంట కూడా త్వరగానే అవుతుంది.

భద్రత పరంగా ఏది బెస్ట్? నిపుణులు ఏమంటున్నారు?

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్కర్లే అన్నింటికంటే అత్యంత సురక్షితమైనవి. ఎందుకంటే స్టెయిన్‌లెస్ స్టీల్ చాలా స్థిరమైన లోహం. వండేటప్పుడు ఇది ఆహార పదార్థాలతో ఎలాంటి రసాయన చర్యలకు తావివ్వదు. అందువల్ల దీర్ఘకాలిక ఆరోగ్య రక్షణకు స్టీల్ కుక్కర్లే నూటికి నూరు శాతం ఉత్తమం.

మీ వంటగదికి ఏది కరెక్ట్?

మీ ప్రధాన సమస్య కేవలం తక్కువ బడ్జెట్ మాత్రమే అయితే.. మీరు అల్యూమినియం కుక్కర్‌ను ఎంచుకోవచ్చు. అలా కాకుండా ఎలాంటి నష్టం లేకుండా, ఆరోగ్యకరమైన పద్ధతిలో చాలా కాలం పాటు మన్నికగా ఉండేలా తీసుకోవాలంటే స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్కర్ మాత్రమే మీ వంటగదికి సరైన ఎంపిక.

Follow Us