AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Solar Eclipse: ఆగస్టు 12న సూర్యగ్రహణం..ఈ రాశుల జీవితాల్లో భారీ మార్పులు.. 12 రాశులకు ఇలా..

Solar Eclipse on 12 August: 2026 ఆగస్టు 12న సింహ రాశిలో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ గ్రహణం 12 రాశుల వారి జీవితాలపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా సింహం, కుంభం, వృషభం, వృశ్చిక రాశుల వారికి పెద్ద మార్పులు చోటుచేసుకోవచ్చని భావిస్తున్నారు. మీ రాశిపై ఈ సూర్యగ్రహణం ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోండి.

Solar Eclipse: ఆగస్టు 12న సూర్యగ్రహణం..ఈ రాశుల జీవితాల్లో భారీ మార్పులు.. 12 రాశులకు ఇలా..
Solar Eclipse On August 12
Janardhan Veluru
|

Updated on: Jul 10, 2026 | 1:29 PM

Share

జ్యోతిష్య శాస్త్రంలో సూర్యగ్రహణంకు అధిక ప్రాధాన్యత ఉంది. సూర్యగ్రహణం జీవితంలో కొత్త ప్రారంభాలు, కీలక మార్పులు, పాత పరిస్థితులకు ముగింపు వంటి పరిణామాలకు సంకేతంగా పరిగణించబడుతుంది. 2026 ఆగస్టు 12న సింహ రాశిలో అమావాస్య రోజున సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. భారత దేశంలో ఈ సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించనప్పటికీ.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం దీనికి ప్రాధాన్యత ఉంది. దీని ప్రభావం సింహం, కుంభం, వృషభం, వృశ్చికం రాశులపై ఎక్కువగా ఉండే అవకాశముంది. ఈ గ్రహణ ప్రభావం 12 రాశుల వారిపై ఎలా ఉంటోంది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆయా రాశుల వారిపై సుమారు 6 నుంచి 12 నెలల వరకు దీని ప్రభావం కనిపించే అవకాశం ఉంటుంది.

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): సంతానం, ప్రేమ, విద్య, సృజనాత్మక రంగాల్లో కొత్త అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో కొత్త ప్రాజెక్టులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): కుటుంబం, ఇల్లు, స్థిరాస్తి విషయాలు ప్రధానంగా మారతాయి. కొత్త ఇల్లు కొనుగోలు లేదా మార్పిడి అవకాశాలు వేగం అందుకుంటాయి. కుటుంబ సభ్యులతో సామరస్యంగా వ్యవహరించడం మంచిది.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3): కమ్యూనికేషన్, రచన, మీడియా, మార్కెటింగ్ రంగాల వారికి అనుకూల సమయం ఇది. చిన్న ప్రయాణాలు, కొత్త పరిచయాలతో ప్రయోజనం కలుగుతుంది. మాటల విషయంలో సంయమనం అవసరం.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఆదాయం, పొదుపు, ఆర్థిక ప్రణాళికలపై దృష్టి పెరుగుతుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడే అవకాశం ఉంది. అనవసర ఖర్చులను తగ్గించుకోవడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): సూర్య గ్రహణ ప్రభావం అత్యధికంగా ఉండే రాశుల్లో ఇది ఒకటి. వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు మరింత బలపడతాయి. ఉద్యోగం, వ్యాపారం, సామాజిక గుర్తింపులో కీలక మార్పులు సంభవించే అవకాశముంది. జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): వీరికి ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. పాత సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): కొత్త స్నేహాలు, సామాజిక సంబంధాలు పెరుగుతాయి. దీర్ఘకాల లక్ష్యాల సాధనకు సమయం అనుకూలంగా ఉంటుంది. సంఘ సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ): ఉద్యోగం, పదోన్నతి, వృత్తి జీవితంలో కీలక మార్పులు సంభవించే అవకాశముంది. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది. కుటుంబం-ఉద్యోగం మధ్య సమతుల్యత పాటించడంపై దృష్టిపెట్టాలి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఉన్నత విద్య, విదేశీ అవకాశాలు, ధార్మిక కార్యక్రమాలకు సమయం అనుకూలంగా ఉంటుంది. కొత్త కోర్సులు, శిక్షణలు ప్రారంభించే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాల యోగం ఏర్పడవచ్చు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2): రుణాలు, పన్నులు, ఉమ్మడి ఆస్తుల విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక ప్రణాళికలను పునఃసమీక్షించుకోవడం మంచిది. మానసికంగా కొత్త మార్పులకు సిద్ధంగా ఉండాలి.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): వివాహం, భాగస్వామ్యాలు, వ్యాపార ఒప్పందాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశముంది. వ్యాపారాల్లో కొత్త భాగస్వామ్యాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇతరులతో అపార్థాలు రాకుండా స్పష్టమైన సంభాషణ అవసరం.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఉద్యోగ బాధ్యతలు, ఆరోగ్యం, రోజువారీ జీవనశైలిలో మార్పులు వస్తాయి. ఆరోగ్యకరమైన అలవాట్లు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. పని ఒత్తిడిని నియంత్రించుకోవడంపై దృష్టి పెట్టాలి.

2026 ఆగస్టు 12న జరిగే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. అందువల్ల భారతీయ సంప్రదాయం ప్రకారం సూతక కాలం సాధారణంగా వర్తించదు.

Also Read: ఆషాఢంలో ఈ రాశుల వారికి అదృష్ట పంట..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?

(Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న జ్యోతిష్య ఫలితాలు, గ్రహణ ప్రభావాలు, రాశులవారీ అంచనాలు జ్యోతిష్య శాస్త్రంలోని విశ్వాసాలు, అభిప్రాయాల ఆధారంగా మాత్రమే అందించబడ్డాయి. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. వ్యక్తిగత అనుభవాలు, పరిస్థితులు భిన్నంగా ఉండవచ్చు. ఈ సమాచారాన్ని కేవలం అవగాహన, వినోదం కోసం మాత్రమే పరిగణించాలి)

Follow Us