Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bald Head: బట్టతల సమస్యకు చక్కటి పరిష్కారం.. ఇది వాడితే వద్దన్నా జుట్టు..

అలోవెరా జెల్‌తో పాటు కొబ్బరి నూనె లేదా క్యాస్టర్ ఆయిల్ కలిపి ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. తలనొప్పి, పొడిబారిన తల చర్మం సమస్యలు ఉన్నవారు అలోవెరాను రాత్రంతా ఉంచడం చేయరాదు. బట్టతల సమస్యను ఎదుర్కొంటున్న వారు అలోవెరాను క్రమం తప్పకుండా ఉపయోగిస్తే మంచి ఫలితాలు పొందుతారు.

Bald Head: బట్టతల సమస్యకు చక్కటి పరిష్కారం.. ఇది వాడితే వద్దన్నా జుట్టు..
Aloe Vera
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 18, 2025 | 8:44 PM

అలోవెరాలో విటమిన్లు, ఖనిజాలు, ఎంజైమ్, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. అలోవెరా అందానికి, జుట్టు సౌందర్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. కలబందలో మాయిశ్చరైజింగ్ లక్షణాలు జట్టు సమస్యలను నివారిస్తుంది. స్కాల్ఫ్ ని ఆరోగ్యంగా ఉంచుతాయి. జుట్టు పెరుగుదలని ప్రోత్సహిస్తాయి. కలబంద తలకి పట్టించడం వల్ల చుండ్రు సమస్య, దురద తగ్గిపోతుంది. అలోవెరాలో ఎంజైమ్స్, విటమిన్ E, విటమిన్ C, ప్రొటీయోలిటిక్ ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి కొత్త జుట్టు పెరగడానికి సహాయపడతాయి. స్కాల్ప్‌లోని చర్మాన్ని హైడ్రేట్ చేసి పొడిబారిన తల చర్మాన్ని మెత్తగా మారుస్తుంది. అయితే ఇలా జుట్టు పెరుగుదల కోసం అలోవెరా అని కరెక్ట్ పద్ధతిలో వాడాలి. మరి ఎలా వాడాలో ఒకసారి చూద్దాం

తాజా అలోవెరా ఆకును తీసుకుని, లోపల గల జెల్‌ను స్కూన్ సహాయంతో తీసుకోవాలి. ఈ జెల్‌ను మెత్తగా చేసుకుని తలకు రుద్దటానికి రెడీ చేసుకోవాలి. తలలో జుట్టు రాలిపోయిన ఖాళీ ప్రాంతాల్లో నెమ్మదిగా అలోవెరా జెల్ తో 5-10 నిమిషాలు మృదువుగా మసాజ్ చేస్తే జెల్ ..త్వరగా స్కాల్ప్‌లోకి వెళ్లి కొత్త జుట్టు రావడానికి సహాయపడుతుంది. అలోవెరా జెల్ తలకు రుద్దిన తర్వాత కనీసం 30 నిమిషాలు ఉంచాలి. మరింత మంచి ఫలితాల కోసం రాత్రంతా ఉంచి ఉదయం తలస్నానం చేయవచ్చు.

గోరువెచ్చని నీటితో తలస్నానం చేసి సాఫ్ట్ షాంపూ ఉపయోగించాలి. వారానికి 3-4 సార్లు ఈ ప్రక్రియను చేయడం వల్ల బట్టతలపై కొత్త జుట్టు వచ్చే అవకాశం ఉంటుంది. అలోవెరా జెల్‌తో పాటు కొబ్బరి నూనె లేదా క్యాస్టర్ ఆయిల్ కలిపి ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. తలనొప్పి, పొడిబారిన తల చర్మం సమస్యలు ఉన్నవారు అలోవెరాను రాత్రంతా ఉంచడం చేయరాదు. బట్టతల సమస్యను ఎదుర్కొంటున్న వారు అలోవెరాను క్రమం తప్పకుండా ఉపయోగిస్తే మంచి ఫలితాలు పొందుతారు.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..