Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayurveda Tips: పాదాల మసాజ్‌తో ఆ సమస్యలన్నీ దూరం.. కానీ ఆ నూనెతో చేయాల్సిందే..!

భారతీయ ఆయుర్వేదాన్ని అనుసరించడం వల్ల చాలా సమస్యల నుంచి బయటపడవచ్చని అందరూ చెబుతూ ఉంటారు. ముఖ్యంగా పురాతన చికిత్స విధానాలతో మేలు జరుగుతుందని అందరికీ తెలిసిందే. అయితే మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లతో పాటు వైద్య రంగంలో వచ్చిన మార్పులు కారణంగా సహజ వైద్య విధానాన్ని ఎవరూ పాటించడం లేదు. చిన్న సమస్యకు కూడా పెద్ద వైద్యం చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇంట్లో దొరికే చిన్న చిన్న వస్తువులతో నయమయ్యే సమస్యలకు వేల కొద్దీ సొమ్మును తగలేస్తున్నాం. అయితే […]

Ayurveda Tips: పాదాల మసాజ్‌తో ఆ సమస్యలన్నీ దూరం.. కానీ ఆ నూనెతో చేయాల్సిందే..!
Foot Massage
Follow us
Srinu

|

Updated on: Jul 17, 2023 | 7:30 PM

భారతీయ ఆయుర్వేదాన్ని అనుసరించడం వల్ల చాలా సమస్యల నుంచి బయటపడవచ్చని అందరూ చెబుతూ ఉంటారు. ముఖ్యంగా పురాతన చికిత్స విధానాలతో మేలు జరుగుతుందని అందరికీ తెలిసిందే. అయితే మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లతో పాటు వైద్య రంగంలో వచ్చిన మార్పులు కారణంగా సహజ వైద్య విధానాన్ని ఎవరూ పాటించడం లేదు. చిన్న సమస్యకు కూడా పెద్ద వైద్యం చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇంట్లో దొరికే చిన్న చిన్న వస్తువులతో నయమయ్యే సమస్యలకు వేల కొద్దీ సొమ్మును తగలేస్తున్నాం. అయితే ప్రాచీన ఆయుర్వేద వైద్యానికి ప్రస్తుత రోజుల్లో డిమాండ్‌ పెరిగింది. ఇటీవల కాలంలో భారతదేశ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా మళ్లీ ఆయుర్వేద వైద్యంపై ప్రజలు మక్కువ చూపుతున్నారు. కాబట్టి ప్రస్తుతం పాదాల మసాజ్‌ వల్ల కలిగే లాభాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

ప్రస్తుత రోజుల్లో బయటకు వెళ్లాలంటే కచ్చితంగా కాళ్లకు చెప్పులు ధరించి వెళ్తాం. అలాగే కొంత మంది ఇంట్లో కూడా చెప్పులను ధరిస్తారు. ఇలా చేయడం ద్వారా మన అరికాళ్లు పగిలిపోతాయి. అయితే ఆయుర్వేద నిపుణులు మాత్రం కచ్చితంగా కాళ్లకు చెప్పులు లేకుండా నడవాలని సూచిస్తుంది. ఎందుకంటే మన నెగటివ్‌ ఎనర్జీ కాళ్ల ద్వారా భూమిలోకి పోతుందని వారి వాదన. అలాగే ఆయుర్వేద వైద్యం ప్రకారం పాదాల్లో కొన్ని మర్మ బిందువులు ఉన్నాయని పేర్కొంటున్నారు. ఈ మర్మ బిందువులు ప్రాథమికంగా కండరాలు, సిరలు, స్నాయువులు, కీళ్లు, ఎముకలు కలిసే పాయిట్ల వద్ద ఉంటాయి. ఈ పాయింట్లను గుర్తించి అక్కడ స్థిరమైన శక్తితో మసాజ్‌ చేయడం ద్వారా శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మన పాదాల కింద ఉండే ఈ మర్మ పాయింట్లు మన శ్వాస కోశ ఆరోగ్యం, రక్త ప్రసరణ, కండరాలు ఆరోగ్యం, శరీర భంగిమతో నేరుగా అనుసంధానం అయి ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు రాత్రి సమయంలో గోరువెచ్చని నువ్వుల నూనెతో మీ పాదాలను మసాజ్‌ చేయడం ద్వారా శరీర ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు మంచి నిద్ర పడుతుందని ఆయుర్వేద వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 

ఉ‍ల్లిపాయతో ఇలా చేస్తే మేలు

రాత్రి పడుకోవడానికి ఉల్లిపాయను చక్రంలా కోసం ఓ పాదాల అడుగున పెట్టి దాన్ని ఓ గుడ్డతో కట్టడం వల్ల చాలా మేలని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఇలా చేయడం ద్వారా సైనస్‌ సమస్య నయం కావడంతో పాటు జలుబు, దగ్గు, అలెర్జీ, జ్వరం వంటి సమస్యలు దూరం అవుతాయి. ఉల్లిపాయలో సాధారణంగా సల్ఫర్‌ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇది బ్యాక్టిరియా, వైరస్‌లను చంపడంలో సాయం చేస్తుంది. అలాగే రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా సల్ఫర్‌ కీలకపాత్ర పోషిస్తుంది. అలాగే ఇలా పాదాల కింద కట్టిన ఉల్లిపాయలను నిరభ్యంతరంగా ఆహారంలో వాడుకోచ్చని పేర్కొంటున్నారు. కాబట్టి ఆయుర్వేద వైద్యులు సూచించే ఈ చిట్కాలను మీరు కూడా ఓసారి ప్రయత్నించి చూడండి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..