Lifestyle: కిడ్నీలను దెబ్బ తీస్తున్న వాయు కాలుష్యం.. పరిశోధనల్లో సంచలన విషయాలు
వాయు కాలుష్యం శరీరంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శ్వాస, చర్మ సంబంధిత సమస్యలకు వాయు కాలుష్యం కారణమవుతుందని మనందరికీ తెలిసిందే. అయితే వాయు కాలుష్యం కారణంగా కిడ్నీలపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. తాజాగా నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి..

ప్రస్తుతం వాయు కాలుష్యం ఏ రేంజ్‌లో భయపెడుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్య కాలంలో ఢిల్లీలో జరుగుతోన్న పరిణామాలే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. దేశ రాజధానిలో గాలి నాణ్యత రోజురోజుకీ పడిపోతోంది. దీంతో ప్రభుత్వం నివారణ చర్యలను తీసుకుంటోంది. అయితే వాయు కాలుష్యం కారణంగా వ్యాధుల బారిన పడుతోన్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది.
సాధారణంగా వాయు కాలుష్యం శ్వాస వ్యవస్థపై, చర్మంపై ప్రభావం చూపుతుందని చాలా మందికి తెలిసిందే. అయితే తాజాగా పరిశోధకులు షాకింగ్ విషయాన్ని తెలిపారు. వాయు కాలుష్యం కిడ్నీ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని తేలింది. గాలిలో ఉండే లెడ్ కణాలు శ్వాస ద్వారా శరీరంలోకి ప్రవేశించి మూత్రపిండాలకు హాని కలిగిస్తున్నాయని పరిశోధనల్లో తేలింది. విషపూరితమైన గాలిలో ఉండే సీసం, పాదసరం వంటి లోహాలు శరీరంలోకి చేరుతున్నాయి.
ఇవి రక్తంలో కవలడం వల్ల కిడ్నీలో తిత్తులు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇవి నెఫ్రాన్‌లో పేరుకుపోయి మూత్రపిండాల పనితీరుకు భంగం కలిగిస్తాయని చెబుతున్నారు. దీంతో కిడ్నీల పనితీరుపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీర్ఘకాలంలో ఇది కిడ్నీ క్యాన్సర్‌కు దారి తీసే ప్రమాదం కూడా ఉంటుందని చెబుతున్నారు. దీంతో కిడ్నీలు డయాలిసిస్ చేయడంతో పాటు మార్పిడి కూడా చేయాల్సి ఉంటుంది.
అయితే కిడ్నీల పనితీరు దెబ్బతింటే కొన్ని ముందస్తు లక్షణాల ఆధారంగా తెలుసుకోవచ్చు. సాధారణంగా మూత్ర ఇన్ఫెక్షన్, వెన్ను నొప్పి, కాళ్లలో వాపు కనిపించడం, ఎలాంటి పనిచేయకపోయినా అలసటగా ఉండడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడడం, కండరాల తిమ్మిరి వంటి లక్షణాల ఆధారంగా కిడ్నీల పనితీరును దెబ్బతిన్న విషయాన్ని తెలుసుకోవచ్చు. వాయు కాలుష్యానికి ఎక్కువగా ఎక్స్‌పోజ్ కాకుండా ఉండడంతో పాటు కొన్ని రకాల చర్యలు తీసుకుంటే కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
వీటిలో ప్రధానమైనవి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే స్మోకింగ్‌ను పూర్తిగా మానేయాలి. ఇక తీసుకునే ఆహారంలో ఉప్పును వీలైనంత వరకు తగ్గించాలి. అలాగే చక్కెర కంటెంట్‌ను కూడా తక్కువగా తీసుకోవాలని నిపునులు చెబుతున్నారు. ఇక ఎక్కువ సేపు కదలకుండా ఒకే చోట కూర్చోవడం కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు తీసుకునే ఆహారంలో సలాడ్, సీజనల్ పండ్లు, పెరుగు, మజ్జిగను తీసుకోవాలి.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..




