Anjeer: రోజూ నీటిలో నానబెట్టిన అంజీర్ పండ్లను తింటే అమేజింగ్ అంతే.! అమృతం లాంటి ఫలం..
అంజీర్.. పలు పోషకాలు కలిగిన బెస్ట్ డ్రై ఫ్రూట్స్ లో ఒకటి. ఇందులో కావలసినన్ని ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. మరి వీటిని రోజూ తలో రెండు చొప్పున తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. ఆ వివరాలు

అధిక పోషకాలు నిండిన డ్రైఫ్రూట్స్‌లో ఒకటి అంజీర్. వీటిని రోజుకొకటి తింటే మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంజీర్‌లో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఫ్రెష్ లేదా ఎండిన అంజీర్‌లను రోజూ తినడం వల్ల మీ ఆరోగ్యానికి శ్రీరామరక్ష. మరి రోజూ అంజీర్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..
1. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది..
అంజీర్‌లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. రోజూ రెండు లేదా మూడు ఎండు అంజీర్‌లను నీటిలో నానబెట్టి తింటే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇది కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
2. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది..
అంజీర్‌లో పొటాషియం, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి రక్తపోటును కంట్రోల్ చేయడంలో తోడ్పడతాయి. ఇందులోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు చెడు కొలెస్ట్రాల్(LDL) స్థాయిలను తగ్గించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
3. బరువు తగ్గడానికి సహాయపడుతుంది
అంజీర్‌లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల.. ఇది తిన్న తర్వాత మీకు కడుపునిండిన ఫీలింగ్ కలుగుతుంది. ఎక్కువసేపు ఆకలి వేయనివ్వకుండా చేస్తుంది. దీనిలో చక్కెర కూడా ఉంటుంది. కాబట్టి మితంగా తీసుకోవాలి. రోజుకు 2-3 అంజీర్‌లు తినడం వల్ల బరువును ఈజీగా తగ్గించుకోవచ్చు.
4. ఎముకలను బలపరుస్తుంది
అంజీర్‌లో కాల్షియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉన్నాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఇది ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల సమస్యలను నివారిస్తుంది. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఎముకల బలహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది.
5. రక్తహీనతను నివారిస్తుంది
అంజీర్‌లో ఐరన్ కంటెంట్ ఉంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. రక్తహీనత సమస్య ఉన్నవారు రోజూ కొన్ని ఎండు అంజీర్‌లను తింటే శరీరంలోని రక్తం మెరుగవుతుంది. అలాగే అలసట కూడా తగ్గుతుంది.
6. రోగనిరోధక శక్తిని పెంచుతుంది
అంజీర్‌లో విటమిన్ సి, విటమిన్ ఎ, జింక్ వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడతాయి. జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్లు దరికి చేరకుండా చేస్తాయి.
ఎలా తినాలి?
-
ఎండు అంజీర్‌ను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినవచ్చు.
-
తాజా అంజీర్‌ను సలాడ్‌తో లేదా డైరెక్ట్‌గా తినవచ్చు.
-
రోజుకు 2-4 అంజీర్‌లు తినడం మంచిది. ఎక్కువ తిన్నా చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది.
