Parenting: పిల్లలు చదవులో రాణించడంలో తండ్రి పాత్రే కీలకం.. పరిశోధనల్లో కీలక విషయాలు..
ఐదేళ్ల వయసులో ఉన్న చిన్నారులపై తండ్రి ప్రభావం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఎకనామిక్ అండ్ సోషల్ రీసెర్చ్ కౌన్సిల్ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో తండ్రి పాత్ర ఎక్కువగా ఉంటే... సామాజిక.. భావోద్వేగపరమైన అంశాల్లో తల్లిది కీలక పాత్ర అని ఈ సర్వేలో వెల్లడైంది. తండ్రులు వీలైనంత ఎక్కువ క్వాలిటీ సమయాన్ని...

తమ పిల్లలు ప్రతిభావంతులు కావాలని ప్రతీ ఒక్క పేరెంట్ ఆశపడుతుంటారు. బాగా చదువుకొని ఉన్నత ఉద్యోగాలు చేయాలని ఆశిస్తుంటారు. అందుకోసం మంచి స్కూల్ వెతికి మరీ, లక్షల్లో ఫీజులు పోసి చదివిస్తుంటారు. అయితే కేవలం ఫీజు కట్టడానికి మాత్రమే పరిమితమైతే సరిపోదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లల చదువుపై తండ్రి పాత్ర ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ప్రైమరీ స్కూల్ దశలో ఉన్న చిన్నారులతో తండ్రి చదివించడం, ఆడడం, డ్రాయింగ్ వంటి యాక్టివిటీస్‌లో పాల్గొనడం ద్వారా వారిలో అనూహ్య మార్పునకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. రోజులో కనీసం 10 నిమిషాలు పిల్లల చదువుకు సమయం కేటాయించాలని, దీనివల్ల స్పష్టమైన మార్పు కనిపిస్తుందని చెబుతున్నారు.
ఐదేళ్ల వయసులో ఉన్న చిన్నారులపై తండ్రి ప్రభావం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఎకనామిక్ అండ్ సోషల్ రీసెర్చ్ కౌన్సిల్ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో తండ్రి పాత్ర ఎక్కువగా ఉంటే… సామాజిక.. భావోద్వేగపరమైన అంశాల్లో తల్లిది కీలక పాత్ర అని ఈ సర్వేలో వెల్లడైంది. తండ్రులు వీలైనంత ఎక్కువ క్వాలిటీ సమయాన్ని తమ చిన్నారులకు కేటాయించాలని ఈ సర్వే సూచిస్తోంది. ‘ఉద్యోగం, వ్యాపారం మాకు అంత సమయం ఎక్కడిది’ అంటారా.? అయితే కేవలం 10 నిమిషాలు అయినా సరే నాణ్యతతో కూడిన సమయాన్ని పిల్లల కోసం కేటాయించాలని పరిశోధకులు చెబుతున్నారు. ఇక పాఠశాలలు కూడా చిన్నారుల విద్యా సంబంధిత విషయాల్లో తండ్రుల పాత్ర ఉండేలా చర్యలు తీసుకోవాలని ఈ అధ్యయనం చెబుతోంది.
ఈ అధ్యయనంలో పాల్గొన్న లీడ్స్ యూనివర్సిటీ బిజినెస్ స్కూల్ రీసెర్చ్ డాక్టర్ హెలెన్ నార్మన్ మాట్లాడుతూ.. ‘ప్రైమరీ స్కూల్ దశలో చిన్నారుల ఎదుగుదలలో తల్లుల పాత్రే ఎక్కువ ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. అయితే చిన్నారుల రోజువారీ వ్యవహారాల్లో తండ్రి పాల్గొంటే వారు ప్రైమరీ విద్యలో మరింత మెరుగైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు. ఇంగ్లండ్‌కు చెందిన సుమారు 5000 మంది తల్లిదండ్రులను పరిగణలోకి తీసుకొని, అధ్యయనం నిర్వహించిన తర్వాత పరిశోధకులు ఈ విషయాలను వెల్లడించారు.
చిన్నారుల ప్రతిభను, పరీక్షల్లో వారు సాధించిన మార్కులను, తల్లిదండ్రుల పాత్రను పరిగణలోకి తీసుకున్న తర్వాత పరిశోధకులు ఈ విషయాలను వెల్లడించారు. ఇక ఎక్సెటర్ మెడికల్ స్కూల్‌కు చెందిన చైల్డ్ సైకాలజీ ప్రొఫెసర్ హెలెన్ డాడ్ మాట్లాడుతూ.. చిన్నారుల అభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర ఎంత కీలకమో చెప్పడానికి ఈ అధ్యయనం ప్రత్యక్ష ఉదాహరణ. తండ్రి ప్రభావం పిల్లల చదువుపై ప్రభావం చూపితే, తల్లి పెంపకం సోషల్ స్కిల్స్, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని’ చెప్పుకొచ్చారు.
మరిన్ని లైఫ్ స్టైల్ కథనాల కోసం క్లిక్ చేయండి..