AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

4AM Biryani: కోడి కూయక ముందే వేడి వేడి బిర్యానీ కోసం ఎగబడ్డ జనం.. అంత స్పెషల్ ఏంటబ్బా..!!

బిర్యానీ అంటే ఇష్టపడని భోజనప్రియులు ఎవరు ఉండరు..! బిర్యానీ అంటే మధ్యాహ్నం లంచ్‌కో, రాత్రి డిన్నర్‌కో తింటాం. కానీ క్రేజీగా వైజాగ్‌లో మాత్రం తెల్లారే సరికే వేడి వేడి గా టేస్టీ టేస్టీ బిర్యానీ వడ్డించేస్తున్నారు. అవునండీ ఈ వేకువ జామున 4గంటల నుండే చీకటిలో బిర్యానీ కోసం క్యూ కట్టేస్తున్నారు విశాఖ బిర్యానీ లవర్స్.

4AM Biryani: కోడి కూయక ముందే వేడి వేడి బిర్యానీ కోసం ఎగబడ్డ జనం.. అంత స్పెషల్ ఏంటబ్బా..!!
Biryani
Eswar Chennupalli
| Edited By: |

Updated on: Feb 10, 2024 | 9:35 PM

Share

బిర్యానీ అంటే ఇష్టపడని భోజనప్రియులు ఎవరు ఉండరు..! బిర్యానీ అంటే మధ్యాహ్నం లంచ్‌కో, రాత్రి డిన్నర్‌కో తింటాం. కానీ క్రేజీగా వైజాగ్‌లో మాత్రం తెల్లారే సరికే వేడి వేడి గా టేస్టీ టేస్టీ బిర్యానీ వడ్డించేస్తున్నారు. అవునండీ ఈ వేకువ జామున 4గంటల నుండే చీకటిలో బిర్యానీ కోసం క్యూ కట్టేస్తున్నారు విశాఖ బిర్యానీ లవర్స్.

సాధారణంగా బిర్యానీ అంటే నచ్చని వాళ్లు ఎవరుంటారు? క్రేజీగా పొద్దున్నే అదీ కోడి కూయక ముందే వేడివేడిగా ఘుమఘుమలాడే కోడి బిర్యానీతో పాటు లేలేత ల్యాంబ్ బిర్యానీ లాగించేస్తే ఎలా ఉంటుంది? వాహ్..! సూపర్ కదా.. ఈ ఐడియానే అమలు చేస్తూ బిర్యానీ లవర్స్ ను నోరూరిస్తోంది 4 ఏఎం బిర్యానీ సెంటర్.

విశాఖపట్నంలోని అర్ టి సీ కాంప్లెక్స్ కు కూత వేటు దూరంలో జీ వీ ఎం సీ ప్రధాన గేట్ ఎదురుగా ఈ 4 AM బిర్యానీ సెంటర్ తెల్లారి 4 గంటల నుంచే మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. బర్త్ డే, మ్యారేజ్ డే.. ఇలా సందర్భం ఏదైనా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కలిసి లంచ్ లేదా డిన్నర్‌కు వెళ్లడం ఒకప్పటి మాట. ఇప్పడు ట్రెండ్ మారింది. అకేషన్ ఏదైనా సరే కాస్త వెరైటీగా ప్లాన్ చేసుకుంటుంది నేటి యూత్. అలాంటి వారి కోసమే ఈ ఎర్లీ మార్నింగ్ రెస్టారెంట్‌లు అన్నదీ ఒక థియరీ.

చిట్టి ముత్యాల బిర్యానీ టాప్

తెల్లవారుజామున 4 గంటలకు మొదలుకుని మార్నింగ్ 9 వరకు కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది ఈ రెస్టారెంట్. చికెన్, మటన్ ధమ్ బిర్యానీతో పాటు చిట్టి ముత్యాల బిర్యానీ, కబాబ్స్, సూప్స్ ఇలా కస్టమర్ల అభిరుచికి తగ్గట్లుగా రకరకాల ఐటమ్స్ ఫుడ్ లవర్స్‌ను ఫిదా చేస్తున్నాయి ఇక్కడ. ఈ రెస్టారెంట్లను రాత్రి 12 గంటలకు ఓపెన్ చేసి అప్పటికప్పుడు ఫ్రెష్ గా ఘుమఘుమలాడే వంటకాలు తయారు చేసి 4 గంటలకు అందిస్తున్నారు.

వీకెండ్లో బిజీ బిజీ

ఐటీ, బీపీవో, నైట్ షిఫ్టు ఎంప్లాయీస్‌తో పాటు సిటీలోని బిర్యానీ లవర్స్‌ను దృష్టిలో పెట్టుకుని కొందరు వ్యాపారులు మిడ్ నైట్ బిర్యానీ, 4 AM బిర్యానీ పేర్లతో కొత్త రెస్టారెంట్లను ప్రారంభిస్తున్నారు. ఇటీవల కాలంలో వీక్ డేస్ లో గిరాకీ అంతంతమాత్రంగా ఉన్నా వీకెండ్‌లో మాత్రం కస్టమర్లతో కిక్కిరిసిపోతుందని రెస్టారెంట్ల నిర్వాహకులు తెలిపారు. ఫ్యామిలీతో వచ్చేవారి సంఖ్య పెరుగుతోందని, మా దగ్గర చిట్టి ముత్యాలతో చేసే బిర్యానీ చాలా ఫేమస్ అనీ, దీనితో పాటు కబాబ్స్ ఇతర వంటకాలు తక్కువ బడ్జెట్లో దొరుకుతాయంటున్నారు. మరోవైపు కస్టమర్లు కూడా రుచికరమైన బిర్యానీ దొరుకుతుండటంతో ఇష్టంగా తినేందుకు ఆసక్తి చూపుతున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..