- Telugu News Photo Gallery Mental Stress Can Reduce Easily In Some Ways Like Sleeping and Long Breathing
Mental Stress: స్ట్రెస్ ఎక్కువైతే గుండె పోటు ప్రమాదం ఎక్కువట.. వైద్య నిపుణుల హెచ్చరిక!
నేటి బిజీ లైఫ్‌లో ప్రతి ఒక్కరికీ ఇంటా, బయటా ఒత్తిడి ఎదుర్కోవడం కష్టంగా మారుతుంది. ఇక ఈ ఒత్తిడి వల్ల శరీరం బలహీనంగా మారడంతోపాటు ఆరోగ్యం కూడా త్వరగా దెబ్బతింటుంది. అధిక ఒత్తిడి మనస్సు, మెదడుపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది. ఇది జ్ఞాపకశక్తి కోల్పోయేలా చేస్తుంది. నిరాశకు దారితీస్తుంది. ఫలితం ప్రాణాంతకం కావచ్చు. ఇది శరీరంపై కూడా తీవ్ర దుష్ర్పభావాన్ని చూపుతుంది. రక్తపోటు స్థాయి పెంచుతుంది. అధిక ఒత్తిడి గుండెపై కూడా ప్రభావం చూపుతుంది..
Updated on: Feb 10, 2024 | 9:29 PM

నేటి బిజీ లైఫ్‌లో ప్రతి ఒక్కరికీ ఇంటా, బయటా ఒత్తిడి ఎదుర్కోవడం కష్టంగా మారుతుంది. ఇక ఈ ఒత్తిడి వల్ల శరీరం బలహీనంగా మారడంతోపాటు ఆరోగ్యం కూడా త్వరగా దెబ్బతింటుంది. అధిక ఒత్తిడి మనస్సు, మెదడుపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది. ఇది జ్ఞాపకశక్తి కోల్పోయేలా చేస్తుంది. నిరాశకు దారితీస్తుంది. ఫలితం ప్రాణాంతకం కావచ్చు. ఇది శరీరంపై కూడా తీవ్ర దుష్ర్పభావాన్ని చూపుతుంది. రక్తపోటు స్థాయి పెంచుతుంది. అధిక ఒత్తిడి గుండెపై కూడా ప్రభావం చూపుతుంది.

ఒత్తిడి వల్ల వచ్చే డిప్రెషన్ మనసును కకావికలం చేస్తుంది. దీని కారణంగా రక్తపోటు స్థాయి కూడా పెరుగుతుంది. ఒత్తిడి వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం లేకపోలేదు. ఒత్తిడి, డిప్రెషన్ వల్ల గుండె కూడా ప్రభావితమవుతుంది. ఇది గుండెపోటు అవకాశాలను పెంచుతుంది.

US పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. ఒత్తిడిని తగ్గించడానికి చూయింగ్ గమ్ మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. నిరంతరం చూయింగ్ గమ్ నమలడం ద్వారా మనస్సు ఇంద్రియాలతో ఒక ప్రత్యేక లయను పొందుతుంది. ఫలితంగా మానసిక ఒత్తిడి కొద్దికొద్దిగా తగ్గుతుంది.

మీకు స్ట్రెస్ అనిపిస్తే ఆ ప్రాంతం నుంచి దూరంగా ప్రశాంతమైన ప్రాంతానికి వెళ్లండి. తర్వాత కళ్లు మూసుకుని మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఈ అభ్యాసం మనస్సులో పేరుకుపోయిన ఒత్తిడిని వదిలించుకోవడానికి సహాయపడుతుంది.

నిద్రలేమి ఒత్తిడిని పెంచుతుంది. ఎంత బిజీగా ఉన్నా రోజు మధ్యలో కొద్దిసేపు నిద్రపోతే, ఒత్తిడి, అలసటను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ప్రత్యేక శ్వాస పద్ధతులు ఒత్తిడిని తగ్గించడంలో చాలా సహాయపడతాయి. 4 సెకన్ల పాటు బలంగా గాలి పీల్చి, 7 సెకన్ల పాటు పట్టుకుని తిరిగి 8 సెకన్ల పాటు నెమ్మదిగా ఊపిరి వదలాలి. రోజులో కనీసం కొన్ని నిమిషాల పాటు ఈ ట్రిక్ పాటిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. లోతైన శ్వాస ప్రక్రియలో కాసేపు శ్వాసను నిర్భందించడం, ఆ తర్వాత నెమ్మదిగా ఊపిరి వదలడం వల్ల శ్వాస వ్యవస్థతో సహా నాడీ వ్యవస్థపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది. ఈ ప్రక్రియ ద్వారా ఒత్తిడిని సులువుగా తగ్గించుకోవచ్చు.




