- Telugu News Photo Gallery Technology photos You can see message in whatsapp with blue tick by follow this simple trick
Whatsapp: వాట్సాప్‌లో మీరు మెసేజ్ చూసినట్లు తెలియకూడదా.? ఇందుకోసం ఓ ట్రిక్ ఉంది.
ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ ఏదైనా ఉందా అంటే.. ఠక్కున వచ్చే సమాధానం వాట్సాప్. ప్రతీ ఒక్క స్మార్ట్ ఫోన్‌లో వాట్సాప్ కచ్చితంగా ఉండాల్సిందే. సుమారు 200 కోట్లకుపైగా యూజర్లు వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. ఇక వాట్సాప్‌లో మనకు తెలియని ఎన్నో ట్రిక్స్ అందుబాటులో ఉన్నాయి..
Updated on: Feb 10, 2024 | 11:25 PM

ప్రతీఒక్క స్మార్ట్ ఫోన్‌లో వాట్సాప్ యాప్ కచ్చితంగా ఉండాల్సిందే. యూజర్ ఫ్రెండ్లీగా ఉండడం, ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తున్న కారణంగానే వాట్సాప్‌కు కోట్లాది మందిలో యూజర్లు ఉన్నారు.

ఎన్నో కొంగొత్త ఫీచర్లతో ఎప్పటికప్పుడు యూజర్లను ఆకట్టుకునే వాట్సాప్‌లో మనకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన ట్రిక్స్ ఉన్నాయని మీకు తెలుసా.? ఇలాంటి ఆసక్తికరమైన ట్రిక్స్‌లో ఒకదాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా వాట్సాప్‌లో వచ్చిన మెసేజ్‌ను చూస్తే వెంటనే అవతలి వ్యక్తికి మనం మెసేజ్ చూసినట్లు తెలుపుతూ బ్లూ టిక్స్ వస్తాయి. అయితే అలా బ్లూ టిక్స్ రాకుండా ఉండాలంటే 'రీడ్ రిసిపింట్స్'ను ఆఫ్ చేసుకుంటే సరిపోతుందని తెలిసిందే.

ఇలా చేస్తే మీ స్టేటస్ ఎవరు చూశారో తెలియదు, అలాగే మీరు మెసేజ్ చేసినట్లు ఎదుటి వ్యక్తులు చూశారో కూడా తెలియదు. అందుకే ఒక ట్రిక్ అందుబాటులో ఉంది.

ఇందుకోసం ముందుగా మీకు వాట్సాప్‌లో మెసేజ్ రాగానే ఓపెన్ చేసేకంటే ముందే, ఫ్లైట్ మోడ్ ఆన్ చేయాలి. అనంతరం మెసేజ్‌ను ఓపెన్ చేసి చదివి, సదరు మెసేజ్ విండో నుంచి బయటకు రావాలి. అనంతరం ఫ్లైట్ మోడ్ తీసేస్తే సరిపోతుంది. మీరు మెసేజ్ చదివినట్లు ఎదుటి వ్యక్తికి తెలియదు.




