గో సంరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి..హైదరాబాద్‌లో గుడికో గోమాత కార్యక్రమానికి టీటీడీ శ్రీకారం
గో సంరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. హిందూ ధర్మ రక్షణ కోసం టీటీడీ ప్రారంభించిన 'గుడికో గోమాత' కార్యక్రమానికి దేశవాళీ ఆవులను దానంగా ఇవ్వాలని రెండు రోజుల క్రితం ఛైర్మన్ కోరారు..

గో సంరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. హిందూ ధర్మ రక్షణ కోసం టీటీడీ ప్రారంభించిన ‘గుడికో గోమాత’ కార్యక్రమానికి దేశవాళీ ఆవులను దానంగా ఇవ్వాలని రెండు రోజుల క్రితం ఛైర్మన్ కోరారు.
ఈ నేపథ్యంలో గుడికో గోమాత కార్యక్రమాన్ని గురువారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైవి సుబ్బారెడ్డి ప్రారంభించనున్నారు. ఉదయం 9 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో టీటీడీ నుంచి ఆలయానికి ఆవు , దూడను ఆయన అందించనున్నారు.
సనాతన హిందూధర్మ పరిరక్షణలో భాగంగా గోసంరక్ష కోసం గుడికో గోమాత కార్యక్రమం ప్రారంభించాలని ధర్మ కర్తల మండలి తీర్మానించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా డిసెంబరు 7న విజయవాడ కనక దుర్గ అమ్మవారి ఆలయంలో టీటీడీ చైర్మన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెండో విడతగా తెలంగాణలో ఈ కార్యక్రమానికిి శ్రీకారం చుడుతున్నారు.




