అమ్మకానికి అగ్రరాజ్య అధినేత ఇల్లు.. ట్రంప్ ఫాన్స్‌కి రియల్ ఎస్టేట్ ఏజెన్సీ బంపర్ ఆఫర్..

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ చిన్ననాటి గృహం మరోసారి వేలానికి వచ్చింది. సుమారు రూ. 22 కోట్లు విలువ చేసే ఈ హౌస్..

  • Ravi Kiran
  • Publish Date - 8:03 am, Thu, 10 December 20
అమ్మకానికి అగ్రరాజ్య అధినేత ఇల్లు.. ట్రంప్ ఫాన్స్‌కి రియల్ ఎస్టేట్ ఏజెన్సీ బంపర్ ఆఫర్..

Donald Trump Childhood Home: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ చిన్ననాటి గృహం మరోసారి వేలానికి వచ్చింది. సుమారు రూ. 22 కోట్లు విలువ చేసే ఈ హౌస్.. 2016 తర్వాత మళ్లీ మార్కెట్‌లోకి వచ్చింది. అయితే ఈసారి దీన్ని క్రౌడ్ ఫండింగ్ ద్వారా అభిమానులు కొనాలని రియల్ ఎస్టేట్ ఏజెన్సీ కోరింది. అందుకు అనుగుణంగా GoFundMe అనే క్రౌడ్‌ ఫండింగ్ సైట్‌లో ఓ ఫండ్ రైజర్‌ను కూడా ప్రారంభించింది.

అభిమానులు క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఈ హౌస్‌ను కొనుగోలు చేస్తే, ట్రంప్‌కు బహుమతిగా ఇస్తామని రియల్ ఎస్టేట్ ఏజెన్సీ పారామౌంట్ రియాల్టీ తెలిపింది. గతంలో ఈ సంస్థ న్యూయార్క్ క్వీన్స్ బరోలోని జమైకా ఎస్టేట్స్ పరిసరాల్లో ఉన్న ఇంటిని అమ్మడానికి ప్రయత్నించి విఫలమైంది. దానితో ఇప్పుడు క్రౌడ్ ఫండింగ్ స్ట్రాటజీతో మళ్లీ ముందుకు వచ్చింది. ఈ ఇంట్లో డొనాల్డ్ ట్రంప్ నాలుగేళ్ల వయసు వరకు ఉన్నారు. మరి ట్రంప్ ఫ్యాన్స్ ముందు వస్తారా.? లేదా అన్నది వేచి చూడాలి.

Also Read:

ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం.. రిజర్వేషన్ ఉన్నవారికే అనుమతి..

గ్రామ వాలంటీర్ల తొలిగింపు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం.? వివరణ ఇచ్చిన సచివాలయ శాఖ కమిషనర్.!

ఏలూరు మిస్టరీ డిసీజ్.. చికిత్సపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఆళ్ళ నాని కీలక ప్రకటన..

ఆస్ట్రేలియా జట్టుకు గట్టి ఎదురు దెబ్బ.. పింక్ బాల్ టెస్టుకు వైదొలిగిన డేవిడ్ వార్నర్..