సీఎం జగన్‌ అప్పుడు వార్నింగ్ ఇచ్చారు.. ఇప్పుడు ఆ పోలీసుల పరిస్థితి ఇదీ!

రెండేళ్ల క్రితం విశాఖ ఎయిర్‌పోర్టులో వైఎస్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిలను అడ్డుకున్న ఏపీ పోలీసులను తాజాగా వీఆర్‌కు పంపినట్టుగా తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రెండేళ్ల క్రితం జరిగిన ఈ సంఘటనలో విధులు నిర్వహించిన పోలీసులను వీఆర్‌ (వేకెన్సీ రిజర్వ్‌)కు సరండర్‌ చేస్తున్నట్లు తెలిసింది. దీనిప్రకారం నగర పోలీస్‌ కమిషనరేట్‌లో పనిచేస్తున్న ముగ్గురు ఎస్సైలు, ఒక ఏఎస్సైని వీఆర్‌కు పంపుతూ జూలై 27న పోలీసు కమిషనర్‌ ఆదేశాలు జారీచేసినట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే దీనికి […]

సీఎం జగన్‌ అప్పుడు వార్నింగ్ ఇచ్చారు.. ఇప్పుడు ఆ పోలీసుల పరిస్థితి ఇదీ!
Follow us

| Edited By:

Updated on: Aug 02, 2019 | 8:45 AM

రెండేళ్ల క్రితం విశాఖ ఎయిర్‌పోర్టులో వైఎస్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిలను అడ్డుకున్న ఏపీ పోలీసులను తాజాగా వీఆర్‌కు పంపినట్టుగా తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రెండేళ్ల క్రితం జరిగిన ఈ సంఘటనలో విధులు నిర్వహించిన పోలీసులను వీఆర్‌ (వేకెన్సీ రిజర్వ్‌)కు సరండర్‌ చేస్తున్నట్లు తెలిసింది. దీనిప్రకారం నగర పోలీస్‌ కమిషనరేట్‌లో పనిచేస్తున్న ముగ్గురు ఎస్సైలు, ఒక ఏఎస్సైని వీఆర్‌కు పంపుతూ జూలై 27న పోలీసు కమిషనర్‌ ఆదేశాలు జారీచేసినట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు మాత్రం బయటకు రాలేదు. అలాగే ఆ ఘటన జరిగినప్పుడు నగరంలో పనిచేసిన, తాజాగా విశాఖ రేంజ్‌ పరిధిలో పనిచేస్తున్న మరికొంతమంది అధికారులను కూడా వీఆర్‌కు పంపినట్లు సమాచారం.

ప్రత్యేక హోదా కోసం 2017లో విశాఖలో నిరసన తెలిపేందుకు వెళ్లున్న అప్పటి ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌ను బృందాన్ని ఎయిర్ పోర్టులోనే అడ్డుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. వైఎస్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి, ఇప్పటి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, అంబటి రాంబాబు వంటి వారని ఎయిర్‌పోర్టులో పోలీసులు బయటకు రాకుండా గేట్లు మూసివేశారు. దీంతో జగన్ అక్కడకున్న పోలీసులపై తీవ్రస్ధాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ పోలీసులు ఎయిర్‌పోర్టులోకి ఎలా వచ్చారని, అసలు మీకున్న అధికారాలేమిటని ఆయన ప్రశ్నించి రాద్ధాంతం చేశారు. ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న సభకు వెళ్లాల్సి ఉన్న తమను విమానాశ్రయంలోనే అడ్డుకోవడం ఏమిటని జగన్‌తో పాటు ఎంపీ విజయసాయి కూడా ప్రశ్నించారు. చివరికి వారిని అక్కడినుండి హైదరాబాద్‌కు వెనక్కి పంపించేశారు. మొత్తానికి గతప్రభుత్వ హయాంలో అతిగా ప్రవర్తించి రెచ్చిపోయిన అధికారులకు ఈ ఘటనతో చెమటలు పడుతున్నాయట.

సాయంకాలం సదా సీదాగా మాజీ మంత్రి.. రోడ్‎పై టిఫిన్ చేసిన హరీష్ రావు
సాయంకాలం సదా సీదాగా మాజీ మంత్రి.. రోడ్‎పై టిఫిన్ చేసిన హరీష్ రావు
రోడ్డుపై మందుబాబుల వీరంగం.. సహనం కోల్పోయి చెయ్యి చేసుకున్న పోలీస్
రోడ్డుపై మందుబాబుల వీరంగం.. సహనం కోల్పోయి చెయ్యి చేసుకున్న పోలీస్
ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..
ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..
'ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‎పై దుష్ప్రచారాన్ని నమ్మోద్దు'.. జగన్
'ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‎పై దుష్ప్రచారాన్ని నమ్మోద్దు'.. జగన్
పైకి చూస్తే అదొక ఏటీఎం వ్యాన్.. లోపలున్న పార్శిళ్లు తెరిచి చూడగా
పైకి చూస్తే అదొక ఏటీఎం వ్యాన్.. లోపలున్న పార్శిళ్లు తెరిచి చూడగా
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు
వందే భారత్‌ మెట్రో ఫస్ట్‌ లుక్‌.. ఎలా ఉందంటే ??
వందే భారత్‌ మెట్రో ఫస్ట్‌ లుక్‌.. ఎలా ఉందంటే ??
బుద్ధిమంతులకే బ్రాండ్‌ అంబాసిడర్‌.. అతని షర్ట్‌లోనే ఉంది ట్విస్ట్
బుద్ధిమంతులకే బ్రాండ్‌ అంబాసిడర్‌.. అతని షర్ట్‌లోనే ఉంది ట్విస్ట్