గుండాలలో ఎన్‌కౌంటర్: నక్సల్ నేత హత్యపై హైకోర్టు తీర్పు..!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఇప్పటికే బాగా బలహీనపడిన నక్సల్స్ ఉద్యమానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. బుధవారం తెల్లవారుజామున గుండాల మండల సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నక్సల్ నేత పూనెం లింగన్న అలియాస్‌ శ్రీధర్‌ హతమయ్యారు. పూనెం లింగన్న‌ చనిపోగా.. మరో ఆరుగురు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు లింగన్న మృతదేహానికి పోస్టుమార్టం జరిపించాలని ఆదేశించింది. గాంధీ ఆస్పత్రిలో సూపరింటెండెంట్‌ ఆధ్వర్యంలో […]

గుండాలలో ఎన్‌కౌంటర్: నక్సల్ నేత హత్యపై హైకోర్టు తీర్పు..!
Follow us

| Edited By:

Updated on: Aug 02, 2019 | 8:21 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఇప్పటికే బాగా బలహీనపడిన నక్సల్స్ ఉద్యమానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. బుధవారం తెల్లవారుజామున గుండాల మండల సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నక్సల్ నేత పూనెం లింగన్న అలియాస్‌ శ్రీధర్‌ హతమయ్యారు. పూనెం లింగన్న‌ చనిపోగా.. మరో ఆరుగురు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు లింగన్న మృతదేహానికి పోస్టుమార్టం జరిపించాలని ఆదేశించింది. గాంధీ ఆస్పత్రిలో సూపరింటెండెంట్‌ ఆధ్వర్యంలో రీపోస్టుమార్టం జరిపించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పోస్టుమార్టం నివేదికను సీల్డ్‌కవర్‌లో సమర్పించాలని మెడికల్‌ బోర్డు సీనియర్‌ అధికారులకు స్పష్టం చేసింది. ఎన్‌కౌంటర్‌పై పూర్తి వివరాలతో ఈ నెల 5న కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా, ఐపీసీ 302 సెక్షన్‌ ప్రకారం ఎన్‌కౌంటర్‌ చేసిన వారి పై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని పిటిషనర్‌ కోర్టుకు విన్నవించారు.