శ్రీకాకుళం జిల్లాలో విషాదం.. పెళ్లి చేసుకునేందుక పిల్లను ఇవ్వలేదని యువకుడి ఆత్మహత్య..!

మేనత్తను పిల్లను ఇవ్వమంటే కాదు పొమ్మన్నారు. అవమానభారం భరించలేక ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదఘటన శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలో చోటుచేసుకుంది.

శ్రీకాకుళం జిల్లాలో విషాదం.. పెళ్లి చేసుకునేందుక పిల్లను ఇవ్వలేదని యువకుడి ఆత్మహత్య..!

మేనత్తను పిల్లను ఇవ్వమంటే కాదు పొమ్మన్నారు. అవమానభారం భరించలేక ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదఘటన శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలో చోటుచేసుకుంది. కొప్పరవలస గ్రామానికి చెందిన సిరిపురం ప్రతాప్‌కుమార్‌(24) గురువారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కన్నతల్లి తరఫు బంధువులే కదా అని పెళ్లి సంబంధం మాట్లాడేందుకు వెళ్లారు వారంతా. కానీ తమ పిల్లను ఇవ్వబోమని ఆడపిల్లవారు తెగేసి చెప్పేశారు. ఆమెకు వేరే సంబంధం చూస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో ఆ యువకుడు జీర్ణించుకోలేకపోయాడు. తనలో తనే మథనపడ్డాడు. తీవ్ర మనస్థాపానికి గురైన యువకుడు.. స్వగ్రామానికి చేరుకుని పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రతాప్ కుమార్ కుటుంబం పదేళ్ల కిందటే విజయవాడలో స్థిరపడింది. డిగ్రీ చదివిన ప్రతాప్‌ అక్కడే ఫ్లోరింగ్‌ మార్బుల్స్‌ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

ఇదిలావుంటే, తల్లి తరపు బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని భావించి.. ఇటీవల సంబంధం మాట్లాడేందుకు సొంతూరుకు వచ్చాడు. ఇందుకు ప్రతాప్ బంధువులు ససేమిరా అనటంతో జీర్ణించుకోలేక పోయాడు. ఆ యువతికి వేరే సంబంధం చేసేందుకు సిద్ధపడటంతో కుమిలిపోయాడు. ఈనెల 18న విజయవాడ నుంచి బయలుదేరి 19న ఉదయం పార్వతీపురం పట్టణం చేరుకున్నాడు. అక్కడే పురుగుల మందు సీసా కొనుక్కొని స్వగ్రామం వచ్చాడు. ఇంట్లో రాత్రి పురుగుల మందు తాగేశాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు రాజాంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. ఈ ఘటనతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.