తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి ఖరారుతో పార్టీ క్యాడర్ లో కొత్త ఉత్సాహం

తిరుపతి లోక్ సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో వైయస్ఆర్ పార్టీ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ఫిజియో థెరఫిస్ట్ డాక్టర్ గురుమూర్తి పేరును ఖరారు చేసింది. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీనికి సంబంధించి గత గురువారం పార్టీ సీనియర్ నేతలతో భేటీ నిర్వహించిన సంగతి తెలిసిందే . డిప్యూటీ సీఎం కె.నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, కొడాలి నాని, అనిల్‌కుమార్‌ యాదవ్, బొత్స సత్య నారాయణ, ఎంపీలు […]

తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి ఖరారుతో పార్టీ క్యాడర్ లో కొత్త ఉత్సాహం
Follow us
Venkata Narayana

|

Updated on: Nov 21, 2020 | 8:42 PM

తిరుపతి లోక్ సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో వైయస్ఆర్ పార్టీ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ఫిజియో థెరఫిస్ట్ డాక్టర్ గురుమూర్తి పేరును ఖరారు చేసింది. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీనికి సంబంధించి గత గురువారం పార్టీ సీనియర్ నేతలతో భేటీ నిర్వహించిన సంగతి తెలిసిందే . డిప్యూటీ సీఎం కె.నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, కొడాలి నాని, అనిల్‌కుమార్‌ యాదవ్, బొత్స సత్య నారాయణ, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్థన్‌ రెడ్డి, వరప్రసాద్, బి.మధుసూదన్‌ రెడ్డి, కె.ఆదిమూలం, కిలివేటి సంజీవయ్య, మండలి చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరుల సలహాలు తీసుకొని చివరికి గురుమూర్తిని అభ్యర్థిగా ఖరారు చేశారు. దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కొడుకు కల్యాణ చక్రవర్తికి లేదా దుర్గాప్రసాద్ భార్యకు సముచిత స్థానం కల్పిస్తామని జగన్ మాట ఇచ్చిన తర్వాతే డాక్టర్ గురుమూర్తి పేరును ప్రకటించారు.