వరుసగా రెండో రోజు పెరిగిన పెట్రోల్ ధరలు… హైదరాబాద్‌లో‌ ఈ రోజు పెట్రోల్ ధర ఎంతంటే..!

దేశ వ్యాప్తంగా వరుసగా రెండో రోజు పెట్రోల్​, డీజిల్​ ధరలు మరోసారి పెరిగాయి. శనివారం లీటరు పెట్రోల్ పై 15పైసలు, డీజిల్​పై 20పైసలు పెంచాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్​ రేటు లీటరుకు రూ. 81.23 నుంచి 81.38కు పెరిగింది. డీజిల్ రేటు లీటరుకు రూ.70.68నుంచి 70.88కు ఎగబాకింది. ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.87.92నుంచి 88.09కు పెరిగింది. డీజిల్​ ధర 77.11నుంచి 77.34గా ఉంది. వ్యాట్​ను బట్టి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ధర ఉన్నాయి. […]

వరుసగా రెండో రోజు పెరిగిన పెట్రోల్ ధరలు... హైదరాబాద్‌లో‌ ఈ రోజు పెట్రోల్ ధర ఎంతంటే..!

దేశ వ్యాప్తంగా వరుసగా రెండో రోజు పెట్రోల్​, డీజిల్​ ధరలు మరోసారి పెరిగాయి. శనివారం లీటరు పెట్రోల్ పై 15పైసలు, డీజిల్​పై 20పైసలు పెంచాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్​ రేటు లీటరుకు రూ. 81.23 నుంచి 81.38కు పెరిగింది.

డీజిల్ రేటు లీటరుకు రూ.70.68నుంచి 70.88కు ఎగబాకింది. ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.87.92నుంచి 88.09కు పెరిగింది. డీజిల్​ ధర 77.11నుంచి 77.34గా ఉంది. వ్యాట్​ను బట్టి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ధర ఉన్నాయి. ఇక అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర 17 పైసలు పెరుగుదలతో రూ.87.57కు చేరింది. డీజిల్‌ ధర 22 పైసలు పెరుగుదలతో రూ.79.85కు ఎగసింది.

ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 17 పైసలు పెరుగుదలతో రూ.87.10కు చేరింది. డీజిల్ ధర 22 పైసలు పెరుగుదలతో రూ.79.41కు ఎగసింది.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడంతో ఆ ప్రభావం ఇక్కడ కూడా పడింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 2.06 శాతం పెరుగుదలతో 45.11డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 1.29 శాతం పెరుగుదలతో 42.44 డాలర్లకు ఎగసింది.