గోల్డ్ కాయిన్, కొత్త బట్టలు, స్వీట్స్‌తో సిబ్బందికి సర్​ప్రైజ్​

గోల్డ్ కాయిన్, కొత్త బట్టలు, స్వీట్స్‌తో సిబ్బందికి సర్​ప్రైజ్​

తమిళ హీరో శింబు కోలివుడ్‌లోని పాత సాంప్రదాయాన్ని పాలో అయ్యారు. తన కొత్త సినిమా 'ఈశ్వరన్' సిబ్బందికి దీపావళి గిఫ్ట్ కింద ఒక గ్రాము బంగారు నాణెం, కొత్త బట్టలను బహుమతిగా అందించి...  పెద్ద సర్​ప్రైజ్​ ఇచ్చాడు.

Ram Naramaneni

|

Nov 08, 2020 | 3:41 PM

తమిళ హీరో శింబు కోలివుడ్‌లోని పాత సాంప్రదాయాన్ని పాలో అయ్యారు. తన కొత్త సినిమా ‘ఈశ్వరన్’ సిబ్బందికి దీపావళి గిఫ్ట్ కింద ఒక గ్రాము బంగారు నాణెం, కొత్త బట్టలు, స్వీట్స్‌ను బహుమతిగా అందించి…  పెద్ద సర్​ప్రైజ్​ ఇచ్చాడు. అయితే.. తమిళ ఇండస్ట్రీలో ఈ సంప్రదాయం.. ప్రముఖ నటుడు శివాజీ గణేశన్​తో ప్రారంభమైంది. ఆ తర్వాత రజినీకాంత్, విజయ్​ వంటి హీరోలు కొనసాగిస్తూ వచ్చారు. తాజాగా శింబు.. ఆ లిస్ట్‌లో చేరిపోయాడు. ఈశ్వరన్​ చిత్రంలో నటించిన 200 మంది జూనియర్​ ఆర్టిస్ట్​లకు కూడా శింబు కొత్త బట్టలు అందజేసి, వారి మనసులు గెలుచుకున్నాడు. చిత్రీకరణ​ చివరి రోజు ఈ కానుకలను వారికి పంపిణీ చేశాడు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈశ్వరన్ చిత్రాన్ని​ తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. రానున్న సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో ఈశ్వరుడు పేరుతో ఈ మూవీ రిలీజ్ కానుంది. కాగా శింబు పెళ్లి వార్తలు ఇటీవల వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆయన కథానాయిక త్రిషను పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరిగింది. ఈ వార్తను హీరో, హీరోయిన్లు సహా ఖండించకపోడంతో త్వరలోనే శింబు, త్రిషతో దాంపత్య జీవింతంలోకి అడుగుపెడుతున్నాడని అందరూ భావిస్తున్నారు.

Also Read :

దిండు కింద ఫోన్‌ పేలి వ్యక్తికి తీవ్ర గాయాలు

రెండోసారి కరోనా సోకి కడప డాక్టర్ మృతి

రాయ్ లక్ష్మి తండ్రి కన్నుమూత..నటి ఎమోషనల్ పోస్ట్

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu