కాశ్మీర్ లో భారీ ఎన్ కౌంటర్, అమరులైన ముగ్గురు సైనికులు, ముగ్గురు ఉగ్రవాదుల మృతి

జమ్మూ కాశ్మీర్ కుప్వారా జిల్లాలోని వాస్తవాధీన రేఖ వద్ద ఆదివారం జరిగిన ఎన్ కౌంటర్ లో ఓ సైనికాధికారితో సహా ఇద్దరు జవాన్లు మరణించారు. వీరిలో  బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు చెందిన ఓ కానిస్టేబుల్ కూడా ఉన్నాడు. భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. కుప్వ్వారా జిల్లా మాచిల్ సెక్టార్ లో భద్రతా దళాలు యాంటీ టెర్రర్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా టెర్రరిస్టులు వారిపై కాల్పులు జరిపారు. ఏప్రిల్ తరువాత ఈ కేంద్ర పాలిత […]

కాశ్మీర్ లో భారీ ఎన్ కౌంటర్, అమరులైన ముగ్గురు సైనికులు, ముగ్గురు ఉగ్రవాదుల మృతి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 08, 2020 | 3:54 PM

జమ్మూ కాశ్మీర్ కుప్వారా జిల్లాలోని వాస్తవాధీన రేఖ వద్ద ఆదివారం జరిగిన ఎన్ కౌంటర్ లో ఓ సైనికాధికారితో సహా ఇద్దరు జవాన్లు మరణించారు. వీరిలో  బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు చెందిన ఓ కానిస్టేబుల్ కూడా ఉన్నాడు. భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. కుప్వ్వారా జిల్లా మాచిల్ సెక్టార్ లో భద్రతా దళాలు యాంటీ టెర్రర్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా టెర్రరిస్టులు వారిపై కాల్పులు జరిపారు. ఏప్రిల్ తరువాత ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ ఇది ! నియంత్రణ రేఖ వద్ద చొరబాటుదారులను గుర్తించిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దళాలు వారిపై కాల్పులు జరిపినట్టు తెలిసింది. మాచిల్ సెక్టార్ లో జరిగిన కాల్పుల్లో సుదీప్ సర్కార్ అనే బీ ఎస్ ఎఫ్ కానిస్టేబుల్ మరణించాడు. ఈ తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలోనూ, ఆ తరువాత ఉదయం పది గంటల ప్రాంతంలోనూ రెండు సార్లు ఉభయ  పక్షాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ సందర్భంగా ఇద్దరు జవాన్లు కూడా గాయపడ్డారు.