Yoga for Kids: పిల్లలు మానసిక, శారీరక ఆరోగ్యం కోసం రోజూ ఈ యోగాసనాలు వేయించండి..
నేటి మనుషుల జీవనశైలి క్షీణిస్తున్నందున.. అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతోంది. ఈ వ్యాధుల బారిన పడకుండా మానసిక, శారీరక ఆరోగ్యం కోసం సరైన ఆహారంతో పాటు వ్యాయామాలు చేయడం మంచిది. ఇది పిల్లలతో పాటు పెద్దలకు కూడా అవసరం. అటువంటి పరిస్థితిలో 5 నుంచి 10 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు సులభమైన యోగాసనాలను నేర్పించవచ్చు. తద్వారా పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు.

యోగా నిపుణురాలు సుగంధ గోయల్ మాట్లాడుతూ.. పిల్లలకు తాడాసనం, పాదహస్తాసనం, ఉత్కటాసన ,భుజంగాసనం వంటి కొన్ని యోగాసనాలను అభ్యసించడం ఆరోగ్యానికి ముఖ్యమని చెప్పారు. ఎవరైనా సరే ఈ యోగాసనాలను సాధన చేయగలిగినప్పటికీ.. పిల్లలు వీటిని చేయడం కొంచెం సులభం అవుతుంది. అయితే పిల్లలు ఈ యోసనాలు చేసే సమయంలో సరైన భంగిమ ఉండేలా జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఈ యోసగానాలు చేయడం వలన పిల్లలు బలంగా ఆరోగ్యంగా పెరుగుతారు.
పాదహస్తాసనం చేయడం వల్ల బలం పెరుగుతుంది. దీని కోసం నిటారుగా నిలబడి.. తరువాత నెమ్మదిగా రెండు చేతులను తలపైకి ఎత్తండి. దీని తరువాత.. శ్వాస వదులుతూ క్రిందికి వంగండి. నడుము వరకూ మాత్రమే వంగాలని గుర్తుంచుకోండి. శరీరం పై భాగాన్ని ఎక్కువగా వంచకుండ నిటారుగా ఉంచండి. ఇప్పుడు రెండు చేతులతో పాదాలను తాకడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వలన ఉదర సమస్యలు దరి చేరవు, నడుం, వీపుకి బలం చేకూర్చుతుంది.
ఉత్కటాసనాన్ని చైర్ పోజ్ అని కూడా అంటారు. దీనికోసం ముందుగా తాడాసన స్థితిలోకి వచ్చి.. తర్వాత కుర్చీపై కూర్చున్నట్లుగా మోకాళ్లను వంచి, ఛాతీని పైకి లేపి, వీపును నిటారుగా ఉంచండి. అయితే ఇప్పులైనా సరే మోకాళ్ల నొప్పులు ఉన్నవారు ఈ యోగాసనాన్ని చేయకూడదు.
భుజంగాసనాన్ని కోబ్రా పోజ్ అని కూడా అంటారు. దీన్ని చేయడం సులభం. దీని కోసం మొదట యోగా మ్యాట్ మీద కడుపు ఆన్చి పడుకోండి. దీని తర్వాత రెండు కాళ్లను కలిపి నిటారుగా పెట్టండి. దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ.. ఛాతీని పైకి ఎత్తండి. శరీర బరువును చేతులపై ఉంచండి. ఇలా పైకి చూస్తున్నట్లుగా తలను వెనుకకు వంచండి. కొన్ని సెకన్ల పాటు ఈ స్థితిలో ఉన్న తర్వాత.. తిరిగి పాత స్థితికి చేరుకోండి.
తాడాసన చేయడానికి.. ముందుగా నిటారుగా నిలబడండి. ఇప్పుడు రెండు చేతులను తలపైకి తీసుకుని రెండు చేతులను కలపండి. దీని తరువాత మీ పాదాల మడమలను పైకి లేపి, మీ కాలి వేళ్ళ మీద నిలబడండి. 10 సెకన్ల పాటు ఈ స్థితిలో ఉన్న తర్వాత, మీ పాత స్థితికి తిరిగి రండి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




